Bolli Kishan-Jagga Reddy: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతారని వార్తలు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఉలిక్కిపడ్డారు. నేతలు ఒక్కొక్కరుగా వెళ్తుంటే పార్టీ భవితవ్యం ఏమవుతుందనే ఆందోళన అందరిలో నెలకొంది. దీంతో ఆయనను బుజ్జగించే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంత రావు ఆయనను బుజ్జగించేందుకు విచ్చేసి పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు సహకరించాలని సూచించారు. దీంతో జగ్గారెడ్డి కూడా కాస్త మెత్తబడినట్లు తెలుస్తోంది.
పార్టీలో జరుగుతున్న కలహాల నేపథ్యంలోనే ముందుకు వెళ్లడం లేదని తెలుస్తోంది. దీనికి అందరు సహకరించాలని చెబుతున్నారు. ఈ క్రమంలో పీసీసీ కార్యదర్శి బొల్లి కిషన్ జగ్గారెడ్డి కాళ్లు పట్టుకుని బతిమాలాడటం ఆశ్చర్యం కలిగించింది. పార్టీని విడిచిపెట్టి గందరగోళం చేయొద్దని ప్రాధేయపడ్డారు. దీంతో జగ్గారెడ్డి కాస్త మెత్తబడి పార్టీ వ్యవహారాలను అధినేత్రి సోనియాగాంధీకి లేఖ ద్వారా వివరిస్తానని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీలో తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని అధిష్టానానికి వివరిస్తానని తెలిపారు. దీంతో పార్టీలో ప్రక్షాళన జరగాలని సూచిస్తున్నారు. తనపై అక్కసుతోనే చెడుగా ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్ లో కూడా ఇలాంటివి జరిగితే ఉపేక్షించేది లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో తన సత్తా చాటాలంటే అందరు ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది.
Also Read: Jagga Reddy Resign: జగ్గారెడ్డి రాజీనామాను ఆమోదిస్తుందా? అడ్డుకుంటుందా?
టీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అపఖ్యాతి ఆపాదిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ మానసిక వేధింపులకు గురిచేస్తున్నారని చెబుతున్నారు.దీంతోనే తాను పార్టీని వీడేందుకు నిర్ణయించుకున్నట్లు చెప్పడం గమనార్హం. దీంతో వీహెచ్ కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దీంతో పార్టీలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది. అంతర్గత కలహాలతో పార్టీ భవితవ్యం ఆందోళనకరంగా మారుతోందనే వాదనలు కూడా వస్తున్నాయి. వీహెచ్ చేసిన దౌత్యం ఫలించి జగ్గారెడ్డి రాజీనామా ఉపసంహరించుకున్నట్లు సమాచారం.
Also Read: MLA Jagga Reddy Resign: నేడు జగ్గారెడ్డి రాజీనామా? కాంగ్రెస్ కు షాక్?
Recommended Video: