Bhadrachalam Floods మామూలుగా యాక్సిడెంట్లు ఎలా జరుగుతాయి.. రోడ్డు వెంట వెళుతున్నప్పుడు నిద్ర కమ్ముకొచ్చినా..కాస్తా మద్యం ఎక్కువైనా పక్కనున్న విద్యుత్ స్తంభాలను ఢీకొట్టేస్తుంటారు వాహనదారులు.. అలా జరగడం సర్వసాధారణం.. కానీ ఇక్కడ ప్రకృతి విపత్తులకు అరుదైన వింత చోటు చేసుకుంది. ఈ చోద్యం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

ఎక్కడైనా రహదారుల వెంట విద్యుత్ స్తంభాలుంటాయి. వాటిని ఢీకొని బైక్ లు , కార్లు, ఇతర వాహనాలు ప్రమాదాల బారినపడుతారు. చనిపోయిన ఘటనలు ఉన్నాయి. కానీ ఇప్పుడు భారీ వర్షాలకు మునిగిన భద్రాచలంలో ఎవ్వరూ ఊహించని వింత విషాధ ఘటన చోటుచేసుకుంది.
తెలంగాణలో భారీ వర్షాలకు వరదతో గోదావరి ఉప్పొంగుతోంది. మహారాష్ట్ర, ఒడిశా నుంచి కూడా మొత్తం గోదావరికే రావడంతో ఒడ్డున ఉన్న భద్రాద్రి నగరం నీట మునిగింది.ఆ నీటిలోనే భద్రాద్రి నగరం ఇప్పుడు అష్టకష్టాలు పడుతోంది.
భద్రాద్రిలో పడవల సాయంతో ఇప్పుడు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఈ క్రమంలోనే ఓ నాటు పడవలో ప్రజలను తరలిస్తుండగా.. అది ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఆ నాటు పడవలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఆ వరద నీటిలో గల్లంతయ్యాడు. అతడి కోసం వెతుకుతున్నారు.
భద్రాచలంలో ఎంతటి కన్నీళ్లు.. ఎంతటి కష్టాలు ఉన్నాయో ఈ ఘటన మచ్చుతునక అని చెప్పొచ్చు. ఎందుకంటే రోడ్లపై వాహనాలపై వెళ్లాల్సిన ప్రజలు పడవలపై వెళుతున్నారు. నదులు, సముద్రాల్లో తిరగాల్సిన పడవలు నడిరోడ్డుపై ప్రయాణిస్తున్నాయి. భద్రాద్రి పట్టణంలోని వరద నీటిలోనూ వెళుతూ విద్యుత్ స్తంభాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి గల్లంతు అయ్యాడు. ఈ ఘటన చూస్తేనే ఎంతటి ప్రకృతి చోద్యమో అర్థం చేసుకోవచ్చు. ఇంతటి ప్రళయ విపత్తుకు ఇలాంటివి ఇంకా ఎన్ని చోటుచేసుకుంటాయో చూడాలి మరీ..