BMC Election Results: ప్రాంతీయ పార్టీలు( Regional parties ) నడపడం అంత ఈజీ కాదు. అంతకంటే మించి కేవలం రాజకీయ వ్యూహాలే సరిపోవు. మారుతున్న కాలానికి తగ్గట్టు తాము మారడమే కాదు.. పార్టీని మార్చాలి. ఎప్పటికప్పుడు బలహీనతలను అధిగమించాలి. అప్పుడే రాజకీయంగా ముద్ర చాటగలం. లేకుంటే ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. ఇప్పుడు మహారాష్ట్రలో బాబా సాహెబ్ థాకరే కుటుంబానికి అదే పరిస్థితి ఎదురయింది. ఒంటి చేత్తో పార్టీని నడిపారు ఆయన. కానీ ఇప్పుడు ఆయన వారసులు మాత్రం పార్టీని వదులుకోవాల్సి వచ్చింది. కేవలం భావోద్వేగాన్ని మాత్రమే నమ్ముకున్నారు. పట్టింపులతోపాటు ఈగోకు పోయి బిజెపిని చేజేతులా వదులుకున్నారు. క్షేత్రస్థాయిలో శివసేన సిద్ధాంతాలను పట్టించుకోలేదు. అందుకే ఆ పార్టీ వేరే నాయకత్వం చేతిలోకి వెళ్లిపోయింది.
* తప్పులు సరిదిద్దుకుంటేనే..
ఏ పార్టీకైనా, ఏ నేతకైనా ఇబ్బందులు ఎదురు కావడం ఖాయం. అంతకుమించి తప్పులు చేయడం కూడా సర్వసాధారణం. రాజకీయ సమీకరణల బట్టి నిర్ణయాలు ఉంటాయి. ఒక్కోసారి అవి తప్పుడు విధానాలకు దారితీస్తాయి. అయితే ప్రతికూలతలు ఎదురైన వెంటనే వ్యూహం మార్చుకొని… తప్పులు తెలుసుకొని.. సరిదిద్దుకోవాలి. ఈ విషయంలో మాత్రం చంద్రబాబు ఆలోచన ఆకట్టుకుంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి( Congress Party) వ్యతిరేకంగా ఏర్పాటయింది తెలుగుదేశం. అటువంటి కాంగ్రెస్ పార్టీతో 2018లో తెలంగాణలో పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు. బిజెపిని వదులుకొని కాంగ్రెస్తో చేతులు కలిపారు. కానీ ప్రజలు దీనిని విశ్వసించలేదు. చంద్రబాబును దారుణంగా ఓడించారు 2019 ఎన్నికల్లో. అయితే బిజెపిని వదులుకొని తాను ఎంత తప్పు చేశానో గుర్తించారు చంద్రబాబు. వెంటనే దానిని సరిదిద్దుకొని బిజెపితో పొత్తు పెట్టుకుని అధికారంలోకి రాగలిగారు.
* భావోద్వేగం అంటే కుదరదు..
బాబాసాహెబ్ థాకరే( Baba Saheb Thakre ) తన శివసేనను ఒక పటిష్టమైన నాయకత్వంతో ముందుకు తీసుకెళ్లారు. ఆయన వారసుడిగా రంగంలోకి దిగారు ఉద్దవ్ థాకరే. అయితే భావోద్వేగంతో పార్టీని నడిపారు. బిజెపి నుంచి బయటకు వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఈ క్రమంలో సిద్ధాంతపరంగా విభేదించే కాంగ్రెస్, ఎన్ సి పి తో చేతులు కలిపారు. అయితే వీరి అపవిత్ర కలయికకు ప్రజల నుంచి మద్దతు లభించలేదు. ఆపై బిజెపిని దూరం చేసుకుని దారుణంగా దెబ్బతిన్నారు ఉద్దవ్. అయితే చంద్రబాబు మాదిరిగా దిద్దుబాటు చర్యలకు దిగలేదు. ఇంకా ఈగో పెంచుకొని కష్టాలను కోరి తెచ్చుకున్నారు. తనకు అత్యంత పట్టున్న ముంబైలో సైతం చతికిల పడ్డారు. థాకరే వారసులు ఇద్దరు కలిసి పోయిన ప్రజలు మాత్రం ఏక్ నాథ్ సిండే నేతృత్వంలో జనసేన ను మాత్రమే గుర్తించారు. తన తండ్రి పెట్టిన పార్టీ తమ చేతుల్లో లేకపోవడం అనేది థాకరే సోదరులు చేసుకున్న వైఫల్యమే.. చంద్రబాబు ఇదే తప్పిదానికి పాల్పడ్డారు. తప్పు అని తేలేసరికి సరిదిద్దుకున్నారు. కానీ ఇప్పుడు థాకరే సోదరులు తప్పు అని తెలిసిన సరిదిద్దుకోలేకపోతున్నారు. అనవసర ఈగోలకు పోయి ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు.