
కరోనా వైరస్ బారిన పడి కోలుకుంటున్న వారిని బ్లాక్ ఫంగస్ వేధిస్తోంది. తెలంగాణ, కర్ణాటకల్లో బ్లాక్ ఫంగస్ భయపెడుతోంద. తొలుత మహారాష్ర్టలో వెలుగు చూసిన బ్లాక్ ఫంగస్ ప్రస్తుతం దేశమంతా విస్తరిస్తోంది. తెలుగు ప్రాంతాల్లో రోజురోజుకు క్రమంగా పెరుగుతున్నాయి. దీని కోసం చికిత్స విధానాన్ని మార్చుకోవాల్సి వస్తోంది. బ్లాక్ ఫంగస్ విస్తరిస్తోన్న సమయంలో జగన్ సర్కారు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది. బ్లాక్ ఫంగస్ తో బాధపడుతున్న వారు ఇతర ప్రాంతాల్లో చికిత్స చేయించుకున్నా ఆరోగ్య శ్రీ వర్తించే వీలు కల్పించింది. చికిత్సకు అయ్యే ఖర్చు రూ.వెయ్యి దాటితే అది ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తుంది.
బ్లాక్ ఫంగస్ నివారణకు..
బ్లాక్ ఫంగస్ నివారణకు ప్రభుత్వం 1600 యాంఫోటెరిసిన్ బీ ఇంజక్షన్ల వయల్స్ ను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ సంఖ్యను మరింత పెంచాలని జగన్ సర్కారు కేంద్రాన్ని కోరింది. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన వారి పిల్లల పేర్లపై బ్యాంకుల్లో రూ.10 లక్షలు డిపాజిట్ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. దీనికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు.
ప్రజల్లో చైతన్యం పెరగాలి
బ్లాక్ ఫంగస్ విషయంలో ప్రజలు చైతన్యవంతులు కావాలి. కరోనా రక్కసి భయపెడుతుండగా దానికి తోడు బ్లాక్ ఫంగస్ సైతం వెంటాడుతోంది. కరోనా వైరస్ సోకిన వారు వాడే మందుల ప్రభావంతోనే బ్లాక్ ఫంగస్ విస్తరిస్తుందని తెలుస్తోంది. అందుకే దీని నివారణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ప్రజలు అప్రమత్తమై కరోనా సోకకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇందుకోసం ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను తూచ తప్పకుండా పాటించాలి. రోగాల నివారణకు అందరూ సంయుక్తంగా పోరాడాలి. ఇంటి నుంచి బయటకు రాకుండా జాగ్రత్తలు వహించాలి. మంచి ఆహారం తీసుకోవాలి. దీంతో వ్యాధి నిరోధక శక్తి పెరిగి రోగం దరి చేరకుండా పోతుంది. ఒక వేళ సోకినా తట్టుకునే శక్తి సామర్థ్యాలు కలిగేలా చూసుకోవాలి.