https://oktelugu.com/

BJP Annamalai- DMK Files: “డీఎంకే ఫైల్స్”: స్టాలిన్ సర్కార్ అవినీతిని బయటపెడుతున్న అన్నామలై

BJP Annamalai: అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచయో లేదో అప్పుడే స్టాలిన్ ప్రభుత్వానికి బిజెపి తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై చుక్కలు చూపిస్తున్నాడు. రొటీన్ రాజకీయాలు కాకుండా, పెరియార్ సిద్ధాంతాలు వల్లె వేయకుండా తమిళనాడు లో కొత్త శకాన్ని ప్రారంభించేందుకు అడుగులు వేస్తున్నాడు. ఇందులో భాగంగానే అధికార డిఎంకె అవినీతిని డీఎంకే ఫైల్స్ పేరుతో బట్టబయలు చేస్తున్నాడు. ఏ ప్రజా ప్రతినిధి ఎన్ని డబ్బులు మింగాడో, ఏ పథకంలో ఎంత అవినీతికి పాల్పడ్డాడో లెక్కలతో సహా వివరించి […]

Written By:
  • Rocky
  • , Updated On : April 14, 2023 / 02:15 PM IST
    Follow us on

    BJP Annamalai- DMK Files

    BJP Annamalai: అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచయో లేదో అప్పుడే స్టాలిన్ ప్రభుత్వానికి బిజెపి తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై చుక్కలు చూపిస్తున్నాడు. రొటీన్ రాజకీయాలు కాకుండా, పెరియార్ సిద్ధాంతాలు వల్లె వేయకుండా తమిళనాడు లో కొత్త శకాన్ని ప్రారంభించేందుకు అడుగులు వేస్తున్నాడు. ఇందులో భాగంగానే అధికార డిఎంకె అవినీతిని డీఎంకే ఫైల్స్ పేరుతో బట్టబయలు చేస్తున్నాడు. ఏ ప్రజా ప్రతినిధి ఎన్ని డబ్బులు మింగాడో, ఏ పథకంలో ఎంత అవినీతికి పాల్పడ్డాడో లెక్కలతో సహా వివరించి చూపుతున్నాడు. బహుశా తమిళనాడు చరిత్రలోనే ఈ స్థాయి సాహసానికి ఏ పార్టీ పూనుకోలేదు. అంతటి జయలలిత, కరుణానిధి హయాంలోనూ ఢీ అంటే ఢీ అనుకునే రాజకీయాలు సాగినప్పటికీ ఈ స్థాయిలో తూర్పార పట్టుకోలేదు.

    BJP Annamalai- DMK Files

    ద్రావిడ మున్నేట్ర కజగం ఇప్పుడు తమిళనాడులో అధికారంలో ఉంది. స్టాలిన్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు.. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పలు మార్పులకు శ్రీకారం చుట్టినప్పటికీ అవన్నీ కూడా తమ పార్టీ నాయకులకు లబ్ధి చేకూర్చేందుకు చేసినవే అని తెలుస్తోంది.. నీట్ ఆందోళనల దగ్గర నుంచి మొన్నటి శ్రీరామనవమి శోభాయాత్ర వరకు ప్రతి విషయంలోనూ స్టాలిన్ ప్రభుత్వం ఓ వర్గం మనోభావాలను దెబ్బతీస్తోంది. అంతేకాదు పెరియార్ సిద్ధాంతాల పేరుతో అక్కడి తమిళ హిందువులను ఇబ్బంది పెడుతోంది.. మరోవైపు హిందీ పై రాద్ధాంతం చేస్తూ భారతీయ జనతా పార్టీ పై విషం కక్కుతోంది. మొన్నటికి మొన్న దహి అనే పేరు మీద ఎంత రాద్ధాంతం చేసిందో తెలిసిందే.. ఈ వివాదాలు మొత్తం తమిళ ప్రజల మనోభావాలు కాపాడేందుకు తెరపైకి తీసుకొచ్చినవి కావు. స్టాలిన్ ప్రభుత్వంలో జరుగుతున్న అవకతవకలను డైవర్ట్ చేసేందుకు వ్యూహాత్మకంగా అమలు చేసినవి. పైగా డీఎంకే చేతిలో సన్ టీవీ, మురసోలి అనే పేపర్ ఉండటంతో ప్రజల దృష్టి సులువుగా మళ్ళిస్తోంది.

    BJP Annamalai- DMK Files

    సరిగ్గా దీనినే ఆసరాగా తీసుకున్న తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అధికార పార్టీ నేతల అవినీతిని బయటపెడుతున్నాడు. డీఎంకే ఫైల్స్ పేరుతో ఒక్కొక్క డీఎంకే నేత ఎన్ని కోట్లు ప్రజల సొమ్ము దిగమింగారో లెక్కలతో సహా చెబుతున్నాడు. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాడు. ప్రస్తుతం ట్విట్టర్లో డీఎంకే ఫైల్స్ ట్రెండింగ్ గా నిలుస్తోంది. స్టాలిన్ సోదరి కనిమొలి ఎన్నికల సమయంలో తన ఆస్తులను 30 కోట్లుగా పేర్కొంది. కానీ ఆమెకు కలయింగర్ టీవీలో ఆమెకు ఎనిమిది వందల కోట్ల విలువైన వాటాలు ఉన్నాయి. కేవలం ఏళ్ల వ్యవధిలోనే ఇంత సంపాదన ఎలా సాధ్యమైంది అనేది అన్నామలై ప్రధాన ప్రశ్న.

    ఇక జగత్ రక్ష కన్ అనే మంత్రి తన ఎన్నికల అఫిడవిట్లో అప్పులు ఉన్నాయని చూపించాడు. ఇప్పుడు ఆయన సంపాదన ఏకంగా వందల కోట్లకు వెళ్ళిపోయింది. ఇది ఎలా సాధ్యమవుతుందో చెబితే తమిళ ప్రజలు మొత్తం అనుసరిస్తారని అన్నామలై అడుగుతున్నాడు.

    BJP Annamalai- DMK Files

    ఇక ఇవి వేలు అనే మంత్రి ఎన్నికలప్పుడు తన అరుణయి అనే కాలేజీ విలువ 1086 కోట్లు ఉంటుందని అఫిడవిట్ లో ప్రకటించాడు. కానీ ఇప్పుడు ఆయన కాలేజీ విలువ నాలుగు వేల కోట్లకు పెరిగింది. ఆయన కాంబన్ కాలేజీ విలువ కూడా 141 కోట్లకు పెరిగింది.
    ఇక మరో మంత్రి కేఎన్ నెహ్రూ కూడా తన సంపాదనను వేల కోట్లకు పెంచుకున్నారు. ఇలా 27 డిఎంకె నాయకులు తమ ఆస్తులను అడ్డగోలుగా పెంచుకున్నారని అన్నామలై ఆరోపిస్తున్నాడు. వీరి అవినీతి విలువ రెండు లక్షల కోట్లు అని ఆయన చెబుతున్నాడు. అంతేకాదు ఇది తమిళనాడు జిడిపిలో పది శాతం అని, స్వచ్ఛమైన పాలన అందిస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చిన స్టాలిన్ ఇలా రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడని అన్నామలై ఆరోపిస్తున్నాడు. కాగా అన్నామలై ప్రకటిస్తున్న డీఎంకే ఫైల్స్ నేపథ్యంలో కేంద్ర బలగాలు ఆయనకు పట్టిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం విశేషం.