BJP Annamalai: తమిళనాడు ముఖ్యమంత్రి తనయుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి సనాతన ధర్మంపై చేసిన వాఖ్యలపై బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అన్నామలై స్పందించారు. వ్యాఖ్యలు చేసిన ఉదయ్‌నిధికి, సమర్థించిన ఆయన తండ్రి స్టాలిన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ ఒక రాష్ట్రంలో అమర్‌గా, మరో రాష్ట్రంలో అక్బర్‌గా, ఇంకో రాష్ట్రంలో ఆంథోనీగా మారారని తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై ఎద్దేవా చేశారు. ఈమేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు.
డీఎంకేను వ్యాధులతో పోల్చి..
సనాతన ధర్మ వివాదంపై తన కుమారుడు, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు, ఆయనను వెనకేసుకొచ్చిన సీఎం ఎంకే.స్టాలిన్‌కు ఈ వీడియోలో గట్టి కౌంటర్ ఇచ్చారు. డీఎంకేను వ్యాధుతో పోల్చారు. డీఎంకే అంటే డెంగ్యూ, మలేరియా, కోసు(దోమ) అని అన్నారు. నిర్మూలించాలన్నారు. ‘మాకు డీఎంకే డ్రామా తెలుసు. మీరు అధికారం చేపట్టిన తొలి ఏడాది సనాతన ధర్మాన్ని వ్యతిరేకించారు, రెండో ఏడాది సనాతన ధర్మాన్ని రద్దు చేయండి అని చెప్పారు. మూడో ఏడాది సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనుకుంటున్నారు. కానీ నాలుగో ఏడాది నువ్వు హిందువు అని, నీ సభ్యులలో 90% హిందువులే అంటున్నారు అని, ఐదవ సంవత్సరం నువ్వు కూడా హిందువే అంటావు.. తమిళనాడు ఎన్నో దశాబ్దాలుగా ఈ నాటకాన్ని చూస్తూనే ఉంది.. ఎన్నికలు రాగానే అమర్, అక్బర్, ఆంథోనీ అయిపోతావు. రాహుల్ గాంధీ గత 17 సంవత్సరాలుగా విఫలమవుతున్నారు. ఒక రాష్ట్రంలో అమర్‌గా, మరో రాష్ట్రంలో అక్బర్‌గా, ఇంకో రాష్ట్రంలో ఆంథోనీగా మారారు.. 2024లో డీఎంకే తుడిచిపెట్టుకుపోతుంది. ఇది నేను చెప్పడం లేదు.. నీ కొడుకు చెప్పాడు. ఎందుకంటే డీఎంకేలో డి అంటే డెంగ్యూ, ఎం అంటే మలేరియా, కె అంటే కేసు’ అని వివరించారు.
మోదీపై అబద్ధాలు..
‘మీరు ఓడిపోయిన యుద్ధంలో పోరాడుతున్నారని మీకు తెలుసు కాబట్టి మీరిద్దరూ మీ ప్రకటనలను తగ్గించారు. కానీ మీరు ప్రధాని మోదీ జీ గురించి కొన్ని అబద్ధాలు మాట్లాడారు. దానికి ప్రతిస్పందించడం నా బాధ్యత. ప్రధాని మోదీ బిజీగా ఉన్నారు కాబట్టి దయచేసి ఇబ్బంది పడకండి. మీ నిరాధారమైన, తప్పుడు, దౌర్జన్య ఆరోపణలకు ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి’ అని అన్నామలై డీఎంకే కులతత్వాన్ని పాటిస్తున్నారని ఆరోపించారు.
క్రిస్టియన్‌గా ఉదయ్ నిధి..
అన్నామలై తన వీడియోలో ఉదయనిధి 2022లో క్రై స్తవ మతాన్ని ఆచరిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇప్పుడు అతను దానిపై తనకు నమ్మకం లేదని చెప్పాడు. మీ సిద్ధాంతకర్త, ద్రవిడర్ కజగం అధ్యక్షుడు కె. వీరమణి సనాతన ధర్మం హిందూయిజం అని అన్నారు. మీరు ఖండించగలరా? అని ప్రశ్నించారు అన్నామలై.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Bjps annamalai is a strong counter to stalin and udayanidhi
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com