spot_img
Homeజాతీయ వార్తలుBJP vs Regional Parties: కేంద్రంతో కయ్యం.. ఎన్నికల్లో ఓటమి.. ప్రాంతీయ పార్టీలకు ఇదో గుణపాఠం

BJP vs Regional Parties: కేంద్రంతో కయ్యం.. ఎన్నికల్లో ఓటమి.. ప్రాంతీయ పార్టీలకు ఇదో గుణపాఠం

BJP vs Regional Parties: కేంద్రంలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఈ మూడేళ్లలో దేశంలో అనేక రాష్ట్రాల్లో బీజేపీని గెలిపించింది. 0 నుంచి అధికారం వరకు వచ్చేలా ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్‌షా వ్యూహాత్మకంగా పరిచేస్తున్నారు. తాజగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోనూ లక్ష్యాన్ని చేరుకున్నారు. బెంగాల్‌ను టార్గెట్‌ చేశారు. పార్టీని అధికరాంలోకి తెచ్చారు. అస్సాంలో అధికారం నిలబెట్టుకున్నారు. కేరళలోనూ ఖాతా తెరిచారు. ఇక గడిచిన 12 ఏళ్లుగా గమనిస్తే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో గొడవలు పెట్టుకున్న పార్టీలన్నీ ఓడిపోతున్నాయి. అధికారం కోల్పోతున్నాయి. కేంద్రాన్ని బద్నాం చేయడానికి ప్రయత్నించి ప్రజల మద్దతు కోల్పోతన్నాయి. ఒక‍్కమాటలో చెప్పాలంటే తెగేదాక లాగి.. పవర్‌కు దూరమవుతున్నాయి.

తెలంగాణలో బీఆర్‌ఎస్‌..
తెలంగాణలో బీఆర్‌ఎస్‌ అలియాస్‌ టీఆర్‌ఎస్‌ వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. మూడోసారి రావాలని 2023లో వ్యూహాత్మకంగా పనిచేసింది. కానీ అధికారం నిలబెట్టుకోలేకపోయింది. అందకుముంద మూడేళ్లు కేంద్రంలో ఉన‍్న బీజేపీని కేసీఆర్‌ టార్గెట్‌ చేశారు. గుజారత్‌లో రెండుసార్లు సీఎం అయిన నరేంద్రమోదీ ప్రధాని అయ్యాడు. తాను ఎందుకు కాకూడదని, బీజేపీని గద్దె దించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. జాతీయ పార్టీగా టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌ చేశాడు. ఢిల్లీలో ఆఫీస్‌ తెరిచాడు. వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల నేతలను కలిశారు. మూడో కూటమి ప్రయత్నాలు చేశాడు. కానీ అన్నీ విఫలమయ్యాయి. చివరకు సొంత రాష్ట్రంలో అధికారం కోల్పోయాడు.

ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ..
ఇక ఢిల్లీలో వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చిన ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా చివరి ఐదేళ్లు కేంద్రంలో తీవ్రస్థాయిలో యుద్ధమే చేసింది. సీఎంగా ఉన‍్న అరవింద్‌ కేజ్రీవాల్‌ బీజేపీని కేంద్రంలో అధికారంలోకి రాకుండా చేయాలని కాంగ్రెస్‌ కూటమిలో చేరాడు. ఇక లిక్కర్‌ కేసు విషయంలో బీజేపీని అప్రతిష్టపాలు చేసేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు. కానీ చివరకు గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోలేకపోయారు. వచే‍్చ ఏడాది పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీని ఓడించే అవకాశం కనిపిస్తోంది.

తాజాగా తృణమూల్‌ కాంగ్రెస్‌..
ఇక కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా చేయడానికి తృణమూల్‌ కాంగ్రెస్‌ కూడా ఇండియా కూటమిలో చేరింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కూటమి పక్షాన ప్రచారం చేశారు. ఇక కేంద్ర ఎన్నికల సంఘం అమలు చేసిన సర్‌ విషయంలో మమతా బెనర్జీ పెద్ద యుద్ధం చేశారు. సుప్రీం కోర్టు వరకూ వెళ్లారు. ఇక మైనారీటీల పక్షాన నిలబడ్డారు. దాడులు, అరాచకాలకు అండగా నిలిచారు. బీజేపీ వ్యతిరేక భావజాలంలో పనిచేశారు. దీంతో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి కూడా ఓటర్లు బుద్ధి చెప్పారు.

రాజకీయ నాయకులు గమనించాల్సిన కీలక అంశం ఏమిటంటే, ఓటరు నేడు అత్యంత విజ్ఞానవంతుడు. దైనందిన సమస్యల పరిష్కారం, అభివృద్ధి, మరియు స్థిరమైన పాలనను కోరుకునే ఓటరు, నిరంతరం కేంద్రంపై నెపం నెట్టే నాయకత్వాన్ని తిరస్కరించడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. కేంద్రంతో ఘర్షణను రాజకీయ అజెండాగా మార్చుకోవడం ద్వారా తాత్కాలికంగా లబ్ధి పొందవచ్చునేమో కానీ, దీర్ఘకాలంలో అది పార్టీ ఉనికినే దెబ్బతీస్తుందని ఢిల్లీ మరియు బెంగాల్ ఎన్నికల ఫలితాలు హెచ్చరిస్తున్నాయి.

చివరగా, ప్రాంతీయ పార్టీలు తమ రాష్ట్రాల అభివృద్ధిపై దృష్టి సారించి, కేంద్రంతో సమన్వయంతో వ్యవహరించడమే ఇప్పుడున్న ఏకైక మార్గం. రాజకీయ నాయకులు ప్రజాక్షేత్రంలో గెలవాలంటే ‘వ్యక్తిగత కక్షలు’ కంటే ‘ప్రజా ప్రయోజనాలే’ ప్రధానమని గుర్తించాలి. లేనిపక్షంలో, ఈ ఫలితాల సరళిని బట్టి చూస్తే, వస్తున్న మార్పును గమనించని పార్టీలు వామపక్షాల మాదిరిగానే కనుమరుగయ్యే ప్రమాదం లేకపోలేదు. రాజకీయ ప్రస్థానంలో ఇది అపజయమో లేక నూతన పాఠమో, పార్టీలు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...

Andhra Pradesh Voter List: ఏపీలో 44.71 లక్షల ఓట్లు ఔట్!

Andhra Pradesh Voter List: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. గత కొద్దిరోజులుగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలో...

Dharmendra Pradhan Resignation: ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా.. స్టేజీపై కాక్రోచ్‌ల వికటట్టహాసం.. వైరల్‌ వీడియో

Dharmendra Pradhan Resignation: నీట్‌ లీకేజీ వివాదం నేపథ్యంలో నెలల తరబడి సాగిన ఆందోళనలు చివరకు ఫలితం ఇచ్చాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ జూలై 25న తన పదవికి రాజీనామా...
Oktelugu Epaper
Exit mobile version