spot_img
Homeజాతీయ వార్తలుAssembly Election Results 2026: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. రాజకీయ పార్టీలకు ఎన్నో పాఠాలు

Assembly Election Results 2026: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. రాజకీయ పార్టీలకు ఎన్నో పాఠాలు

Assembly Election Results 2026: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచా‍్చయి. దీనిపై అనేక మంది అనేక విశ్లేషణలు చేస్తున్నారు. ఎలా ఓడారు.. ఎలా గెలిచారనే డిబేట్లు పెట్టారు. 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారత రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం మరియు పుదుచ్చేరి రాష్ట్రాల్లో వెలువడిన ఈ తీర్పు, గతంలో ఉన్న రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చివేసింది. ఈ ఎన్నికలు కేవలం అధికారాన్ని మార్చడమే కాకుండా, ప్రజల ఆలోచనా దృక్పథంలో వస్తున్న మార్పులను కూడా ప్రతిబింబించాయి. ఈ ఎన్నికల ఫలితాలు ఐదు ముఖ‍్యమైన గుణపాఠాలు చెబుతున్నాయి. ఓటరులో మార్పు, హిందువుల ఐక్యత, సంస్థాగత బలం, ప్రాంతీయ, వామపక్ష పార్టీల తిరస్కరణ, కాంగ్రెస్‌ భవితవ్యం ఈ ఫలితాల్లో కనిపించింది.

ఓటరు వైఖరిలో మార్పు..
ఓటరు స్పష్టంగా, నిర్ధిష్టంగా, నిక్కచ్చిగా తీర్పును ఇచా‍్చరు. కోపంగా ఉన్నపార్టీని తుడిచిపెట్టారు. అనుగ్రహం ఉన్న పార్టీకి అగ్రస్థానం కట్టబెట్టారు. బెంగాల్‌లో తృణమూల్‌ను దాదాపు తుడిచిపెట్టారు. అస్సాంలో కాంగ్రెస్‌ను 19 స్థానాలకు పరిమితం చేశారు. తమిళనాడులో రెండు ద్రవిడ పార్టీలకు షాక్‌ ఇచ్చారు. రెండు పార్టీల మధ్య అధికారం మార్చే సంస్కృతికి స్వస్తి పలికారు. డీఎంకే, ఏఐఏడీఎంకేను ఓడించారు. కేరళలో కూడా వామపక్ష ఎల్‌డీఎఫ్‌ కూటమికి షాక్‌ ఇచ్చారు. కాంగ్రెస్‌కు భారీగా సీట్లు వచ్చాయి. ఓటరు కోపంగా, నిర్ణయాత్మకంగా ఓటేశారు. హంగ్‌ లేకుండా తీర్పు ఇచ్చారు. టీవీకేకు పూర్తి మెజారిటీ రాకపోవడానికి వివిధ కారణాలు ఉన్నాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీ తరహాలో వచ్చింది. ఇది మొదటి పాఠం.

ఏకమవుతున్న హిందువులు..
హిందూ ఓటర్లు గతంలో కులాలు, వర్గాలుగా విడిపోలేదు. మత రాజకీయాల పేరిట హిందువులను నిర్లక్ష్యం చేయడంపై కోపంగా ఉన్నారు. ఈ ఫలితాల్లో అది స్పష్టంగా కనబడింది. అస్సాంలో కాంగ్రెస్‌ను 19 సీట్లకు, మరో ముస్లిం పార్టీ యునైటెడ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌కు 4 సీట్లు ఇచ్చారు. 126 స్థానాల్లో 102 బీజేపీకి ఇచ్చారు. ముస్లింలు మెజారిటీ ఉన్న స్థానాల్లోనే కాంగ్రెస్‌, ముస్లిం పార్టీలు గెలిచాయి. ఇక బెంగాల్‌లోనూ హిందూ మెజారిటీ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, ఉత్తర బెంగాల్‌, మాల్దా, ముర్షీదాబాద్‌లో హిందువుల ఆగ్రహం ఫలితాల్లో కనిపించింది. తమిళనాడులో కూడా హిందూ వ్యతిరేక విధానాలు అవలంభించిన డీఎంకే మంత్రులు ఓడిపోయారు. సీఎం స్టాలిన్‌ను సైతం ఓడగొట్టారు. కేరళలో కూడా హిందూ ఓటర్లు బీజేపీవైపు మొగ్గు చూపారు. అందుకే బీజేపీ ఎన్నడూ లేనివిధంగా మూడు సీట్లు గెలిచింది. హిందూ ఓటర్లను ఓట్ల కోసం అనే భావనతో చూడడం పార్టీలు మానుకోవాలి.

సంస్థాగతమైన పటిష్టత..
ఐదు రాష్ట్రాల్లో ఆర్గనైజేషనల్‌ స్ట్రక్చర్‌ చేయగలిగిన పార్టీలనే గెలిపించారు. బీజేపీ చక్కని ఆర్గనైజేషన్‌ ఔట్‌రీచ్‌ మెయింటేన్‌ చేసింది. 1.70 లక్షల చిన్న సమావేశాలు నిర్వహించింది. వెయ్యిలోపు మందితో సమావేశాలు ఏర్పాటు చేసింది. దాదాపు 80 వేలకుపైగా హిందూ సమ్మేళనాలు ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్వహించింది. క్యాంపెయిన్‌ వ్యూహంలోనూ బీజేపీ విజయం సాధించింది. ప్రతీ బూత్‌లో ఎలా ఉండాలి. ఓటరును ఎలా ఓటు వేయించాలి అనే శిక్షణ ఇచ్చారు. దీంతో కార్యకర్తలు క్రమశిక్షణతో పనిచేశారు. రెచ్చగొట్టడం, దుర్భాషలాడడం చేయలేదు. కేరళలో బీజేపీ ఓట్ల శాతం 11. కానీ మూడు సీట్లు గెలిచింది. ప్రచారం సైలెంట్‌గా జరిగింది. ముందు ఓటు వేయి.. తర్వాతే తిను అనే నినాదం బాగా పనిచేసింది. హిందువుల కోసం పనిచేసే సంస్థలు కలిసికట్టుగా పనిచేశాయి. ఎక్కువ మందితో ఓటు వేయించేలా ప్రోత్సహించాయి.

ప్రాంతీయ, లెఫ్ట్‌ పార్టీలకు బై..బై..
దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ప్రజలు తిరస్కరిస్తున్నారు. వామపక్షాల ఆదరణ తగ్గుతోంది. ప్రాంతీయ పార్టీలతో దేశానికి ఎలాంటి ప్రయోజనం లేదన్న భావన పెరుగుతోంది. వామపక్షాలు అధికారంలో ఉన్న కేరళలో కూడా అధికారం కోల్పోయారు. కీలయ నాయకులు ఓడిపోయారు. బాలగోపాలన్‌ గెలిచారు. ఆయన ఆకర్షించే పర్సనాలిటీ కాదు. దీంతో వామపక్షాలకు కూడా కాలం చెల్లుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కాంగ్రెస్‌కు కష్టకాలం..
ఇక ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో అధికారం కోసం కాంగ్రెస్‌ గట్టిగా ప్రయత్నించింది. కేరళలో విజయం సాధించింది. అసా‍్సంలో 19 స్థానాలకే పరిమితమైంది. పశ్చిమబెంగాల్‌, తమిళనాడులో ఒక్కోసీటు, పుదుచ్చేరిలో 5 సీట్లు గెలిచింది. అంటే కాంగ్రెస్‌కు కూడా ఆదరణ తగ్గుతోంది. బీజేపీకి ఆదరణ పెరుగుతోంది. దీంతో కాంగ్రెస్‌ గట్టిగా ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఐదు రాష్ట్రాల్లో బీజేపీ 298 సీట్లు గెలిచింది. కాంగ్రెస్‌ కేవలం 89 సీట్లు మాత్రమే గెలిచింది. దీంతో కాంగ్రెస్‌ వ్యూహాలు, బీజేపీని ఎదుర్కొనే విషయంలో సీరియస్‌గా ఆలోచించాలి. లేదంటే వామపక్షాల తరహాలో కనుమరుగయ్యే ప్రమాదం ఉంటుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Dharmendra Pradhan : ఇది విద్యార్థుల విజయం ప్రజాస్వామ్య విజయం

Dharmendra Pradhan : ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరం, ముఖ్యంగా యువత గొంతు, పాలకులను నిర్ణయాలు మార్చుకునేలా చేయగలదని మరోసారి రుజువైంది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణపై వ్యక్తమైన అసంతృప్తి, వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజీ...

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version