ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ దర్శనమిస్తోంది. దీనికితోడు సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తోంది. అందుకే ఇప్పుడు రాజకీయ పార్టీలు సోషల్ మీడియాను టార్గెట్ చేశాయి. ఇన్నాళ్లు మీడియాను వాడుకున్న పార్టీలన్నీ సోషల్ మీడియాను అస్త్రంగా ఎంచుకున్నాయి. అయితే.. సోషల్ మీడియాను వాడడంతో జాతీయ పార్టీ అయిన బీజేపీ ప్రథమ స్థానంలో ఉంది. ప్రధానంగా దుబ్బాక ఉప ఎన్నికలోనూ ఈ అస్త్రాన్నే ప్రయోగించింది. అందుకే సక్సెస్ కాగలిగింది. ఇప్పుడు టీఆర్‌ఎస్ కూడా సోషల్ మీడియాలో ప్రచారం నడిపిస్తోంది.
Also Read: సీఎం కేసీఆర్ vs భూపేందర్ యాదవ్.. ఎవరిది పైచేయి?
‘బీజేపీ నేతలు సోషల్ మీడియాలోనే ఎక్కువ కనిపిస్తారు. జనంలో కనిపించరు’ అని ఇటీవల సీఎం కేసీఆర్ కూడా ఎద్దేవా చేశారు. యువతను ఆకట్టుకునే సందేశాలు, హుషారెత్తించే పాటలను ఆ పార్టీ తన ఫేస్‌బుక్, ట్విటర్ ఖాతాలు, యూట్యూబ్ చానళ్లలో వైరల్ చేసింది. బీజేపీ విజయానికి సోషల్ మీడియా ప్రచారం కారణమనే వ్యాఖ్యానాలూ వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే.. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో ఆయా పార్టీలు ‘సోషల్’ సైన్యాలను పెంచేశాయి.
ఇప్పటికే ఫేస్‌బుక్‌లో టీఆర్‌ఎస్‌కు టీఆర్‌ఎస్ పొలిటికల్, టీఆర్‌ఎస్, కేసీఆర్, కేటీఆర్ ఆర్మీ, హరీశ్ అన్న సైన్యం, తెలంగాణ జాగృతి తదితర ఖాతాలున్నాయి. వీటితోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల ఖాతాలు సరేసరి. ఇప్పుడు వీటి సంఖ్యను కూడా భారీగా పెంచేశారు. ఇక.. బీజేపీలో తెలంగాణ బీజేపీ, బండి సంజయ్, అర్వింద్ సైన్యం, కాషాయ దళంతోపాటు మరికొన్ని అకౌంట్లు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్‌కు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్, కాంగ్రెస్ హైదరాబాద్, రేవంత్ సైన్యం.. మజ్లి్స్‌కు ఎంఐఎం తెలంగాణ, ఎంఐఎం పార్టీ, అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీ ఖాతాలున్నాయి. ఇప్పుడు ఇతర పార్టీలు కూడా తమ సోషల్ మీడియా సైన్యాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి.
Also Read: పొద్దున బీజేపీలోకి.. రాత్రికి టీఆర్ఎస్ లోకి.. కాపుకాస్తున్న హరీష్
గ్రేటర్ ఎన్నికల పోలింగ్‌కు మరో 12 రోజుల సమయం మాత్రమే ఉండడంతో అన్ని వర్గాల ఓటర్లను కలుసుకునేందుకు నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఒక్కో డివిజన్‌లో 60 నుంచి 70 వేల మందికిపైగా ఓటర్లు ఉండడంతో అందరినీ కలిసేందుకు సమయం సరిపోదు. దీంతో అన్ని పార్టీలూ సోషల్ మీడియా వేదికగా ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అభ్యర్థుల పేరిట కొత్త అకౌంట్లనూ ఓపెన్ చేస్తున్నాయి. టీఆర్‌ఎస్ నాయకులు దట్టీలు కట్టుకుని తిరుగుతారని నిజామాబాద్ ఎంపీ అరవింద్ వ్యాఖ్యానించారు. దాంతో.. ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత రఘునందన్ దట్టీ కట్టుకున్న ఫొటోను టీఆర్‌ఆర్ కార్యకర్తలు వైరల్ చేస్తున్నారు.
మరోవైపు ‘వరద బాధితులకు రూ.10 వేల ఆర్థిక సాయంపై టీఆర్‌ఎస్ కొత్త డ్రామా. జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేళ బండి సంజయ్ కుమార్ పేరుతో ఫోర్జరీ లెటర్లు సృష్టించి ప్రజలను మోసం చేస్తున్న వైనం. ఓటమి భయంతో ఫేక్ లెటర్లు, అసత్యపు వార్తలతో కుట్రలకు తెరలేపిన టీఆర్‌ఎస్ జలగలు’ అంటూ బండి సంజయ్ ఫేస్‌బుక్ ఖాతాలో వైరల్ చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ భగీరథ మంచినీళ్లు ఇచ్చిన తర్వాతే ఓట్లు అడుగుతామంటూ కేసీఆర్ అన్న మాటలను.. తమకు మంచి నీళ్లు అందడం లేదంటూ బస్తీవాసులు చేస్తున్న వ్యాఖ్యలను పక్కపక్కన పెట్టి బీజేపీ వాట్సా్‌ప్‌లో ’ 2016 ఎన్నికల ముందు, 2020 ప్రస్తుతం’ పేరిట ప్రచారం చేస్తోంది. ఇలా సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఒక్కో పార్టీ ఒక్కో తీరు ప్రచారం మొదలు పెట్టేసింది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్