కమల్ నాథ్ బలపరీక్షకు పావులు కదుపుతున్న బీజేపీ

మధ్య ప్రదేశ్‌‌లో 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కమల్ నాథ్ వచ్చే సోమవారమే, ఈ నెల 16న బలపరీక్ష జరిపేటట్లు చేయాలను బిజెపి పట్టుబడుతున్నది. రెండ్రోజుల క్రితం మాజీ కేంద్రమంత్రి జ్యోతినాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పడంతో.. ఆయనకు మద్దతుగా పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో 15 నెలల కమల్‌నాథ్ ప్రభుత్వం ఒక్కసారిగా సంక్షోభంలో చిక్కుకుంది. ‘‘కమల్‌నాధ్ ప్రభుత్వం మైనారిటీలో […]

Written By: Neelambaram, Updated On : March 12, 2020 6:43 pm
Follow us on

మధ్య ప్రదేశ్‌‌లో 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కమల్ నాథ్ వచ్చే సోమవారమే, ఈ నెల 16న బలపరీక్ష జరిపేటట్లు చేయాలను బిజెపి పట్టుబడుతున్నది. రెండ్రోజుల క్రితం మాజీ కేంద్రమంత్రి జ్యోతినాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పడంతో.. ఆయనకు మద్దతుగా పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

దీంతో 15 నెలల కమల్‌నాథ్ ప్రభుత్వం ఒక్కసారిగా సంక్షోభంలో చిక్కుకుంది. ‘‘కమల్‌నాధ్ ప్రభుత్వం మైనారిటీలో పడినందున ఈ నెల 16న బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా బల పరీక్ష నిర్వహించాలని మేము గవర్నర్, అసెంబ్లీ స్పీకర్‌లను కోరనున్నాం…’’ అని బీజేపీ చీఫ్ విప్ నరోత్తమ్ మిశ్రా వెల్లడించారు. కాగా ఇప్పటికే గవర్నర్, స్పీకర్ల వద్ద ఎమ్మెల్యే రాజీనామాలు పెండింగ్‌లో ఉన్నాయనీ.. ఇక బలపరీక్షపై నిర్ణయం తీసుకోవాల్సింది వారేనని ఆయన తెలిపారు.

మరోవంక, రాజీనామా చేసిన 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ ప్రజాపతి గురువారం నోటీసులు జారీ చేశారు. ఈ 22 మంది శుక్రవారం తన ముందు హాజరై రాజీనామాలకు కారణాలు తెలపాలని ఆయన నోటీసులో పేర్కొన్నారు. తమంత తామే రాజీనామాలు చేశారా? లేక ఎవరైనా బలవంతం చేశారా? అన్న అంశాన్ని వ్యక్తిగతంగా కలిసి వివరించాలని స్పీకర్ ఆదేశించారు.

దానితో ఈ 22 మంది ఎమ్మెల్యేల భవితవ్యం తేలిన తర్వాతే బలపరీక్ష నిర్వహించాలని కాంగ్రెస్ స్పష్టం చేస్తున్నది. కాగా కమల్‌నాధ్ ప్రభుత్వం మైనారిటీలో పడిందని మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.

మధ్య ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 228 స్థానాలకు గానూ 22 మంది రాజీనామా చేయడంతో అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 206కు తగ్గింది. దీంతో మ్యాజిక్ ఫిగర్ 104కు పడిపోయింది. కాంగ్రెస్ పార్టీ 114 మంది ఎమ్మెల్యేల్లో 22 మంది రాజీనామా చేయడంతో ఆ పార్టీ బలం 92కు పడిపోయింది.

మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య 107గా ఉంది. ఒకవేళ బలపరీక్షలో బీజేపీ నెగ్గితే మళ్లీ శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.