Huzurabad: తెలంగాణలో హుజురాబాద్, ఆంధ్రప్రదేశ్ లో బద్వేల్ లకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. దీంతో వీటిపై ప్రధాన పార్టీలు ఫోకస్ పెడుతున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తున్నాయి. దీనికి గాను వ్యూహాలు ఖరారు చేస్తున్నాయి. ఓటర్లను ప్రభావితం చేసే విధంగా పావులు కదుపుతున్నాయి. అయితే హుజురాబాద్ లో మాత్రం ఖచ్చితంగా విజయం సాధించాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అధికార పార్టీ టీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతోంది. కానీ బద్వేల్ మాత్రం అంత దూకుడు ప్రదర్శించడం లేదు. దీంతో హుజురాబాద్ లోనే ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలుస్తోంది.

హుజురాబాద్ ఎన్నికల ప్రచారానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను తీసుకురానున్నట్లు ప్రచారం సాగుతోంది. కానీ బద్వేల్ కు మాత్రం స్థానిక నేతలు కూడా రావడం లేదు. దీంతో బద్వేల్ పై అంతగా దృష్టి సారించడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హుజురాబాద్ లో ఈటల రాజేందర్ అధికార పార్టీకి గట్టి పోటీ ఇస్తున్నారు. బద్వేల్ లో మాత్రం వనతల సురేష్ అంతగా ప్రభావం చూపడం లేదు.
బద్వేల్ ఉప ఎన్నికలో భాగస్వామ్య పార్టీ అయిన జనసేనతో పొత్తు ఉంటుందని తొలుత బీజేపీ భావించినా అది సాధ్యం కాదని తెలిసిపోతోంది. అకస్మాత్తుగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు జనసేన ప్రకటించడంతో బీజేపీ పోటీలో ఉంటున్నట్లు ప్రకటించిది. ఈ నేపథ్యంలో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగనుంది. దీంతో బద్వేల్ లో బీజేపీ అంతగా ప్రభావం చూపించలేదని తెలుస్తోంది. హుజురాబాద్ లో మాత్రం తన సత్తా చాటుకోవాలని భావిస్తోంది. దీని కోసం అన్ని మార్గాల్లో ముందుకు వెళుతోంది.
దక్షిణాది స్టేట్లపై ప్రత్యేక దృష్టి సారించే క్రమంలో బీజేపీ నిర్ణయాలు చేస్తోంది. ఇటీవల ప్రకటించిన జాతీయ కార్యవర్గంలో తెలుగు ప్రాంతాలకు ప్రత్యేక స్థానం ఇచ్చి ఇక్కడ తమ పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తోంది. హుజురాబాద్ లో రెండు పార్టీల మధ్యే పోటీ నెలకొంది. 2023లో అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఇందుకుగాను ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.