ఎడారిలోనూ వాటర్ పుట్టించగల సామర్థ్యం ఉన్న పార్టీ బీజేపీ. ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాల్లో పాగా వేసిన బీజేపీ.. ఇక దక్షిణాది రాష్ట్రాలపై కన్నేసింది. కమ్యూనిస్టుల కంచుకోట అయిన పశ్చిమ బెంగాల్‌ని సైతం బద్ధలు కొట్టి మమతా బెనర్జీతో ఢీకొడుతోంది. ఇంతటి ఘనాపాటి అయిన బీజేపీ ఏపీలో పాగా వేయాలని ఎందుకు అనుకోదు. ఇన్నాళ్లు ఆ ఆలోచన చేయకున్నా.. ఇప్పుడు మాత్రం సీరియస్‌గానే తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే.. ఏపీలో ఆ పార్టీ దూకుడు కూడా పెంచుతోంది.
Also Read: టీటీడీ ఈవోను బదిలీ చేసిన జగన్.. అసలు కారణం అదేనా?
ఏపీలో ఏదో ఒక అంశాన్ని ఎత్తుకొని బీజేపీ తన ప్రాభవాన్ని చాటాలని చూస్తోంది. ఇటీవల ఏపీలో వరుసగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆలయాలు నేలమట్టం అయ్యాయి. కానీ.. అప్పుడు టీడీపీకి బీజేపీ మిత్రపక్షం. పైగా లోకల్ లీడర్ షిప్ బాబుతో కలసి మెలసి ఉంది. దాంతో బీజేపీ పెద్దగా ఫోకస్ పెట్టలేదు. ఇప్పుడు మాత్రం ప్రతీదీ క్షణాల్లో బయటకు వచ్చి భారీ ఎత్తున ప్రచారానికి నోచుకుంటోంది.
త్రిపురలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం అధికారంలో ఉండేది. అంతటి కరుడుగట్టిన రాష్ట్రంలోనే బీజేపీ పాగా వేసింది. హిందూ మతమే కాదు, అసలు దేవుడే లేడనే నాస్తికత్వం వామపక్ష ప్రభుత్వానిది. దాంతో బీజేపీ పని సులువు అయింది. దేవుడే లేని చోట వారు ఎలా హిందూ మతాన్ని గౌరవిస్తారంటూ దూకుడుగా త్రిపురలో బీజేపీ దూసుకెళ్ళింది. జనం మధ్యలోనే ఉంటూ హిందూ సెంటిమెంట్‌ని రాజేసింది. అక్కడ కూడా వరుసగా హిందూ ఆలయాల మీద ఇదే తరహాలో అప్పట్లో దాడులు జరిగేవట. దాంతో హిందువుల భక్తినే పెట్టుబడిగా పెట్టి బీజేపీ చేసిన పోరాటానికి మాణిక్ సర్కార్ గద్దె దిగాల్సి వచ్చింది.
ఇప్పుడు ఏపీలో కూడా సేమ్ సీన్. ఏపీలో క్రైస్తవ మత విశ్వాసకుడు జగన్ సీఎంగా ఉన్నారు. దాంతో బీజేపీ అదే ఫార్ములాను వర్కవుట్ చేస్తోందని తెలుస్తోంది. మరో విషయం ఏంటంటే త్రిపుర బీజేపీ ఇన్‌చార్జిగా ఉన్న సునీల్ డియోదరే ఇప్పుడు ఏపీకి ఇన్‌చార్జిగా ఉన్నారు. అలాగే ఆరెస్సెస్ నేపథ్యం ఉన్న సోము వీర్రాజు బీజేపీ రథ సారథి అయ్యారు. ఇక కాషాయం పార్టీ జోరు మామూలుగా లేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Also Read: అన్ లాక్ 5.0లో పాఠశాలలు తెరుస్తారా…? విద్యార్థుల భవిష్యత్తేంటి..?
ఏపీలో రోజుకో ఆలయం మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీనికితోడు మంత్రులు కూడా ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియదు. వీటన్నింటినీ బీజేపీ క్యాచ్ చేసుకుంటోంది. వీటనే జనాల ముందు పెడితే ఫలితాలు రాబట్టొచ్చని బీజేపీ భావిస్తోంది. ఇదే సీన్ కొనసాగితే కొత్త ఏడాది నాటికి ఏపీలో రాజకీయ వాతావరణం మారుతుందనడంలో అతిశయోక్తి లేదు. జగన్ కౌంటర్ అటాక్ ఎలా ఉంటుందో చూడాలి మరి.