https://oktelugu.com/

థియేటర్ల ఓపెనింగ్.. కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుందా?

గడిచిన ఆరునెలలుగా థియేటర్లు మూతపడి ఉన్నాయి. దీంతో ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులంతా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. థియేటర్లు మూతపడటంతో ప్రేక్షకులంతా ఓటీటీలకు అలవాటు పడ్డారు. ఇక తాజాగా ఆన్ లాక్ 5.0లో భాగంగా థియేటర్లు రీ ఓపెన్ కాబోతున్నాయి. అక్టోబర్ 15 నుంచి థియేటర్లలో 50శాతం అక్యుపెన్సీతో ఓపెన్ చేసుకోవచ్చని కేంద్రం తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. Also Read: తమన్నా కెరీర్ లోనే ఇది భారీ రెమ్యున‌రేష‌న్‌ ! కరోనా ఎఫెక్ట్ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 1, 2020 11:06 am
    cinema theaters

    cinema theaters

    Follow us on

    cinema theaters
    గడిచిన ఆరునెలలుగా థియేటర్లు మూతపడి ఉన్నాయి. దీంతో ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులంతా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. థియేటర్లు మూతపడటంతో ప్రేక్షకులంతా ఓటీటీలకు అలవాటు పడ్డారు. ఇక తాజాగా ఆన్ లాక్ 5.0లో భాగంగా థియేటర్లు రీ ఓపెన్ కాబోతున్నాయి. అక్టోబర్ 15 నుంచి థియేటర్లలో 50శాతం అక్యుపెన్సీతో ఓపెన్ చేసుకోవచ్చని కేంద్రం తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది.

    Also Read: తమన్నా కెరీర్ లోనే ఇది భారీ రెమ్యున‌రేష‌న్‌ !

    కరోనా ఎఫెక్ట్ తో ఇప్పటికే థియేటర్లలో రావాల్సిన సినిమాలన్నీ ఓటీటీ వైపు మళ్లాయి. థియేటర్లలో మంచి కలెక్షన్లు సాధించాక ఓటీటీల్లో వచ్చే సినిమాలు కరోనా ఎఫెక్ట్ తో నేరుగానే రిలీజు అయ్యారు. చిన్నచిత్రాలకు ఓటీటీలకు వరంగా మారినా భారీ బడ్జెట్ సినిమాలకు మాత్రం ఓటీటీ కలిసి రావడం లేదు. దీంతో అగ్ర నిర్మాతలంతా థియేటర్లు ఓపెనింగుల కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈనెల నుంచే థియేటర్లు ఓపెన్ అవుతుండటంతో దర్శక, నిర్మాతలకు కొంత ఊరట లభిస్తోంది.

    కరోనా కారణంగా షూటింగులు వాయిదా పడిన సినిమాలు కూడా ఇటీవలే ప్రారంభమయ్యాయి. కరోనా నిబంధనలను పాటిస్తూ తక్కువ మందితో షూటింగులను చేస్తున్నారు. కరోనాకు ముందు చివరి దశలో ఉన్న కొన్ని సినిమాలు త్వరగా షూటింగులను పూర్తి చేసుకొని థియేటర్లలో వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఇక ఇప్పటికే రెడీ అయినా సినిమా కూడా థియేటర్ల వైపు చూస్తున్నాయి.

    Also Read: 50 ఏళ్ల వయసులో హాట్ హాట్ ఫోజులా ?

    చాలా రోజుల తర్వాత థియేటర్లు ఓపెన్ అవుతుండటంతో మునుపటిలా ప్రేక్షకులు వస్తారా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇప్పటికే థియేటర్లలో సినిమాలు చేసే ప్రేక్షకులు ఇటీవల కాలంలో ఓటీటీలకు అలవాటు పడిపోయారు. మరోవైపు కరోనా నేపథ్యంతో వీరంతా మళ్లీ థియేటర్లకు వస్తారా? అనే సందేహాలు కలుగుతున్నాయి.

    2020లో సూపర్ కలెక్షన్లతో భారీ ఇన్నింగ్స్ ఆడాలని ఆశించిన హీరోలు, దర్శక నిర్మాతలకు ఈ ఏడాది పెద్దగా కలిసి రాలేదనే చెప్పొచ్చు. ఇక దసరా పండుగకు థియేటర్లు రీ ఓపెన్ అవుతుండటంతో ఈ కొత్త ఇన్నింగ్స్ ఏమేరకు ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాల్సిందే..!