BJP vs TRS: తాను చేస్తే సంసారం పక్కవాడు చేస్తే వ్యభిచారం అనేది సామెత. ఇప్పుడు టీఆర్ఎస్ పరిస్థితి కూడా అలాగే ఉంది. గతంలో ఇల్లందులో ఫ్లెక్సీలు కడితే జరిమానా విధించిన మంత్రి కేటీఆర్ ఇప్పుడు ఏ విధంగా తన ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలు కట్టుకున్నారో సమాధానం చెప్పాలని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్ లో మొత్తం జెండాలు, ఫ్లెక్సీలతో గులాబీమయం చేశారు. దీంతో గతంలో కేటీఆర్ చెప్పిన మాటలనే బీజేపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. దీనిపై ఏం సమాధానం చెబుతారో అని ప్రశ్నిస్తున్నారు.

అధికారంలో ఉన్నామని భావించి అడుగడుగునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తగదని సూచిస్తున్నారు. ఏ అధికారంతో ఈ పని చేశారో చెప్పాలంటున్నారు. మంత్రి కేటీఆర్ తీరుపై ధర్నా చేసేందుకు బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. బుద్ధభవన్ లోని జీహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్ ఎదుట ధర్నా చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ర్టంలో పాలన గాడితప్పుతుందని పదేపదే చెబుతున్నా పట్టించుకోవడం లేదు. దీంతోనే గులాబీ పార్టీ అప్రదిష్టను ఎదుర్కొంటోంది.
టీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేయడంపై విమర్శలు పెరుగుతున్నాయి. టీఆర్ఎస్ కు అధికారం ఉందని ఏం చేసినా చెల్లుతుందని అలా ప్రవర్తిస్తుందని బీజేపీ మండిపడుతోంది. ఇతరులు పెట్టిన కటౌట్లకు ఫైన్ వేసిన మంత్రి ఇప్పుడు తాను పెట్టుకున్న ఫ్లెక్సీలకు జరిమానా కడతారా అని అడుగుతున్నారు. దీంతో ఇప్పుడు టీఆర్ఎస్ చేస్తున్న ఆగడాలపై ఎవరు ప్రశ్నించరని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
నగరమంతా ఫ్లెక్సీలతో నిండిపోయిన నేపథ్యంలో గులాబీ నేతలపై మామూలుగానే విమర్శలు వస్తున్నాయి. అధికార పార్టీ కావడంతోనే ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలతో నగరమంతా నింపేశారని సామాన్యులు సైతం పెదవి విరుస్తున్నారు. దీంతో బీజేపీ వేసిన ప్రశ్నలకు టీఆర్ఎస్ నేతలు ఏ మేరకు సమాదానాలు చెబుతారో వేచి చూడాల్సిందే. తమ తప్పులను ఏ విధంగా తప్పించుకోవాలని చూస్తారో మాట్లాడితేనే అర్థమవుతుంది. మొత్తానికి గులాబీ పార్టీ నేతలు ఫ్లెక్సీల వ్యవహారంలో భలేగా ఇరుక్కున్నట్లు తెలుస్తోంది.