Vijaya Sai Reddy: వైసీపీపై బీజేపీ ప్రభుత్వం దృష్టి సారిస్తోందా? కీలక నాయకులే ధ్యేయంగా స్కెచ్ వేస్తూ.. తమ కమలం వలలో పడేలా చేస్తోందా? ఆ పార్టీలోని కీలక నాయకుల ద్వారా రాష్ట్రంలో వైసీపీ గ్రాఫ్ తగ్గించి.. బీజేపీ పుంజుకోవాలని చూస్తోందా? అవుననే అంటున్నాయి… ఏపీ.. ఢిల్లీ రాజకీయాలు. కొన్నాళ్లుగా వైసీపీ సీనియర్ నాయకుడు విజయసాయి రెడ్డి పార్టీకి దూరంగా ఉండడం కనిపిస్తోంది. ఏపీలో కొనసాగుతున్న రాజకీయ పరిణామాలను ఆసరాగా తీసుకుంటున్న బీజేపీ పెద్దలు అవకాశం చూసి… మంచి పదవులు ఇచ్చి వారిని దగ్గర చేసేకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం పార్టీకి దూరంగా ఉంటున్న విజయసాయి రెడ్డిపై మొదటికన్ను వేశారు.. బీజేపీ అధినాయకులు..

అయితే వైసీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డికి(Vijaya Sai Reddy) కేంద్ర ప్రభుత్వం ఓ కీలక పదవి ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నారు. ఈ పదవి అనేది వైసీపీకి బీజేపీ దగ్గర కావాలని చూస్తోందా..? లేదా ప్రస్తుత పరిణామాలను అనుకూలంగా మార్చుకోవాలని చూస్తుందా అనే అనుమానాలను ఏపీ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో బీజేపీ నాయకులు.. వైసీపీ పార్టీవాళ్లు నిత్యం చిన్నపాటి యుద్ధాలనే చేస్తుంటారు. అలాంటిది ఢిలీలో ఇలా దోస్తీ కడుతూ.. సానుకూలంగా వ్యవహరిండం ఏంటని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల పునర్ వ్యవస్థీకరణలో ఇది మరోసారి నిరూపణ అయ్యింది. బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలకు సీనియర్లను అందరినీ.. స్థాయీ సంఘాలకు చైర్మన్లుగా నియమించింది. కీలకమైన పోర్టుపోలియోలకు మాత్రం మిత్రపక్ష నాయకులకు నియమించింది. ఇలాంటి కీలక వ్యవస్థకు వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ని నియమిండం ప్రస్తుతం ప్రాధాన్యత నెలకొంది.
వాణిజ్యంపై ఏర్పాటయిన స్థాయీ సంఘానికి చైర్మన్ గా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని నియమించింది కేంద్ర ప్రభుత్వం. ఈ వ్యవస్థలో విజయసాయి రెడ్డికి ఉన్న అనుభవాన్ని కేంద్ర ప్రభుత్వం వినియోగించుకోవాలని ఈ పదవిని కట్టబెట్టింది. స్వతహాగా విజయసాయి రెడ్డి సీనియర్ ఆడిటర్ కావడంతో వాణిజ్య రంగానికి సంబంధించిన స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా నియమించింది. అయితే కేంద్ర ప్రభుత్వం విజయసాయి రెడికి కీలక పదవి ఇవ్వడంపై ఏపీలో చర్చనీయాంశంగా మారింది. వైసీపీతో దోస్తీకి పదవి ఇచ్చారా.?? లేదా ఇప్పటికే పార్టీకి దూరంగా ఉంటున్న విజయసాయి రెడ్డిని బీజేపీలోకి లాగేందుకు ఈ కీలక పదవిని ఆయనకు అప్పగించారా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. ఏది ఏమైనా.. విజయసాయి రెడ్డి సీఎం జగన్ మోహన్ రెడ్డికి దూరం కావడం.. బీజేపీ దాన్ని వినియోగించుకోవడం భవిష్యత్ రాజకీయాల్లో కీలకంగా మారే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అంటున్నారు.