BJP- Governors: తమిళనాడు, కేరళ, తెలంగాణ… ఇప్పుడు ఈ మూడు రాష్ట్రాల్లో రాజకీయ రగడ జరుగుతోంది. స్థానిక ప్రభుత్వాలు, గవర్నర్లు పరస్పరం ఢీ అంటే డి అనుకుంటున్నారు.. తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో గవర్నర్లకు, అధికార ప్రభుత్వాలకు మధ్య అన్ని నిత్య సమరం జరుగుతోంది. రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం తెలిపిన బిల్లులకు సంబంధించి రాజముద్ర వేయకుండా నాన్చడంపై ఆయా ప్రభుత్వాలు భగ్గుమంటున్నాయి. కేంద్రం చేతుల్లో కీలుబొమ్మలుగా, బిజెపి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నాయి. వారికి సహాయ నిరాకరణ చేయడం గాక అధికారాలకు కత్తెర వేసి చర్యలకు కూడా పాల్పడుతున్నాయి.. చివరకు గవర్నర్ వ్యవస్థని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.. అటు గవర్నర్లు కూడా గట్టిగానే గల మెతుతున్నారు.. కీలకమైన బిల్లులకు రాజముద్ర వేయకుండా పెండింగ్లో పెడుతున్నారు.. లేవనెత్తిన అంశాలపై వివరణ ఇవ్వడం లేదంటూ ప్రభుత్వాలను తప్పుపడుతున్నారు.. బిల్లులను ఆమోదించడం, పెండింగ్లో పెట్టడం, తిరస్కరించడం వంటివి హక్కని గవర్నర్లు స్పష్టం చేస్తున్నారు.

గవర్నర్ ప్రథమ పౌరుడు
ఏ రాష్ట్రానికైనా గవర్నర్ ప్రథమ పౌరుడు. రాష్ట్ర మంత్రి మండలి సలహాలను పాటించడం ఆయన విధి. ఇదే సమయంలో అతడికి కొన్ని విచక్షణాధికారాలు ఉంటాయి. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం వివాదాస్పద బిల్లును ఆమోదించి గవర్నర్ వద్దకు పంపితే రాజముద్ర వేయడం లేదా పక్కన పెట్టడం చేయవచ్చు. చాలా సందర్భాల్లో వాటిని తిప్పి పంపే అధికారం వారికి ఉంటుంది. కేంద్ర చట్టాలకు అతీతంగా ఉంటే దేశ ప్రథమ పౌరుడు అయిన రాష్ట్రపతికి నివేదిస్తారు. రాజ్యాంగ ప్రకారం ఇలాగే జరుగుతూ ఉంటుంది.. తాజాగా దక్షిణాదిలోని తమిళనాడు, కేరళ, తెలంగాణలో ఇప్పుడు కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో గవర్నర్లు బిల్లులను తొక్కి పెట్టడంతోనే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇటువంటి విషయాలు సందర్భంగా అటు రాజ్ భవన్, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు సామరస్యంగా వ్యవహరిస్తే పెద్ద సమస్య ఉండదు. కానీ ఎవరికి వారు పట్టింపులకు పోతున్నారు. సమస్యలు నానాటికి జటిలమవుతున్నాయి. కేంద్రంలో ఉన్న బిజెపిని తీవ్రంగా వ్యతిరేకించే సిపిఎం నేతృత్వంలోని ఎల్డిఎఫ్, తెలంగాణలో టిఆర్ఎస్, తమిళనాడులో డీఎంకే అధికారంలో ఉన్నాయి. గవర్నర్ భుజంపై తుపాకీ పెట్టి బిజెపిని లక్ష్యంగా చేసుకుంటున్నాయనే ఆరోపణలు లేకపోలేదు. ప్రజలను ప్రభుత్వాలు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తొక్కిపెట్టే అధికారం గవర్నర్లకూ లేదు. గవర్నర్లను బిజెపి నేతలుగానే పరిగణించి తీవ్రస్థాయిలో ఆయా ప్రభుత్వాలు విమర్శిస్తున్నాయి. గవర్నర్లు కూడా ఆ విమర్శలను బహిరంగంగా తిప్పికొడుతున్న నేపథ్యంలో సమస్య జటిలమవుతుంది.. కొందరు గవర్నర్లు కేంద్ర పెద్దల మనసుకు తగినట్టు వ్యవహరిస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వివాదాలు మరింత ముదురుతున్నాయి.
తమిళనాడులో ఏం జరిగిందంటే
తమిళనాడు గవర్నర్ గా రవీంద్ర నారాయణ్ వ్యవహరిస్తున్నారు. అయితే స్టాలిన్ ప్రభుత్వం పంపిన 20 బిల్లులను ఆమోదించకుండా ఆయన పెండింగ్లో పెట్టడంపై వివాదం రాజుకుంది.. ఇందులో కీలకమైన నీట్ బిల్లు మినహాయింపు కూడా ఉంది. నీట్ పరీక్ష నుంచి తమ్మిలనాడుకు మినహాయింపు ఇవ్వాలని స్టాలిన్ సారధ్యంలోని డీఎంకే ప్రభుత్వం రెండుసార్లు అసెంబ్లీలో తీర్మానం చేసింది.. దానిని రాష్ట్రపతి ఆమోదానికి పంపకుండా గవర్నర్ రవి నాన్చుతున్నారు . గత నెల 23న కోయంబత్తూరులో సంభవించిన కారు పేలుడు కేసుకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించకుండా రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయడాన్ని ఆయన ప్రశ్నించారు. స్టాలిన్ సర్కారు మండిపడింది. ఆయనను వెంటనే రీ కాల్ చేయాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసింది. అయితే డిఎంకె ఆరోపిస్తున్నట్టు రవి సాధారణ రాజకీయ నాయకుడు కాదు.. బిజెపికి చెందిన నేతా కాదు. సీనియర్ ఐపీఎస్ అధికారి.. 2014లో జాయింట్ ఇంటెలిజెన్స్ కమిటీ చైర్మన్గా, 2018లో జాతీయ భద్రత ఉపసహాదారుగా పనిచేశారు. 2014 నుంచి 2021 మధ్య నాగా మిలిటెంట్ల తో చర్చల సంధానకర్తగా పనిచేశారు. 2019 నుంచి 2021 వరకు మేఘాలయ, నాగాలాండ్ గవర్నర్గా పనిచేసి తమిళనాడుకు వచ్చారు.
ఆరిఫ్ పై కేరళ గరం గరం
కేరళ సీఎం విజయన్ కార్యాలయంలో పనిచేసే ఓఎస్డి భార్యకు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ ఇవ్వడం, అది కూడా ఇంటర్వ్యూలో ప్రథమ స్థానం ఇవ్వడం పై గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేసి ఆమె నియామకాన్ని నిలిపి వేశారు. అప్పటినుంచి మొదలైన వివాదం కేరళలోని అన్ని యూనివర్సిటీల ఛాన్స్లర్లు రాజీనామా చేయాలని గవర్నర్ ఆదేశించడంతో తీవ్ర రూపం దాల్చింది. రాజీనామాలు చేయొద్దని వారికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇదే క్రమంలో గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సీఎంఓ అధికారులు ఉన్నట్టు తెలిస్తే తానే జోక్యం చేసుకుంటానని ఆరిఫ్ ఖాన్ హెచ్చరించడంతో సీఎం విజయన్ మండి పడ్డారు. ఆయన ఆర్ఎస్ఎస్ ఏజెంట్గా పని చేస్తున్నారని ఆరోపించారు. బుధవారం రాష్ట్ర కేబినెట్ భేటీ ఏర్పాటు చేసి 14 విశ్వవిద్యాలయాల చాన్స్ లర్ గా తొలగించి విద్యావేత్తను నియమించేలా ఆర్డినెన్స్ జారీ చేయాలని తీర్మానించారు. దీనిని కూడా గవర్నరే ఆమోదించాల్సి ఉంటుంది. ఆరిఫ్ ఖాన్ కాంగ్రెస్ మూలాలు ఉన్న రాజకీయ నేత. గాంధీ కేబినెట్లో పనిచేశారు.. ముస్లిం పర్సనల్ బిల్లును ఇస్తూ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. తర్వాత జనతాదల్లో చేరి వీపీ సింగ్ ప్రధానంగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా పనిచేశాడు.. ఆ తర్వాత బీఎస్పీలో చేరారు.. వాజ్పేయి హయాం లో బిజెపికి చేరువయ్యారు. 2019లో కేరళ గవర్నర్గా నియమితులయ్యారు. ఈ ఏడాది తొలినాళ్ల వరకు వామపక్ష ప్రభుత్వంలో సజావుగానే జరిగింది.. కానీ సీఎం ఓలో ఓఎస్డిగా ఉన్న సిపిఎం నాయకుడి భార్యకు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ ఇవ్వడాన్ని గవర్నర్ వ్యతిరేకించినప్పటి నుంచి సంబంధాలు దెబ్బతింటూ వచ్చాయి.

తెలంగాణలో జరిగింది ఇది
2019లో తెలంగాణ గవర్నర్గా నియమితులైన తమిళసై కేసిఆర్ ప్రభుత్వంతో మొదట్లో సామరస్యంగా వ్యవహరించారు.. నిరుడు హుజరాబాద్ ఉప ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లోకి వచ్చిన కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించాలని రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించలేదు. నాటి నుంచి రాష్ట్ర సర్కార్ తో విభేదాలు మొదలయ్యాయి. అవి రానురాను ముదిరి ప్రోటోకాల్ వివాదాల వరకు వెళ్లాయి.. ఈ నేపథ్యంలో ఆమె కూడా అసెంబ్లీ ఆమోదించిన ఎనిమిది బిల్లులకు రాజముద్ర వేయకుండా పెండింగ్లో పెట్టారు.. సి ఆర్ బి బిల్లుపై చర్చించేందుకు రాజ్ భవన్ రావాలని మంత్రి సబితను గవర్నర్ ఆదేశించారు. అయితే తనకు లేఖ అందలేదని సబిత చెప్పడంతో తమిళిసై బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విరుచుకుపడ్డారు. రాజ్ భవన్ ప్రగతి భవన్ కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.. దీంతో ఇప్పుడు గవర్నర్ వర్సెస్ టిఆర్ఎస్ నాయకులు అనే తీరుగా రాష్ట్రంలో వ్యవహారం కొనసాగుతోంది. ఇది ఎటు వైపుకు దారి తీస్తుందోనని రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.