Nagarjuna The Ghost: అక్కినేని నాగార్జున హీరో గా నటించిన ‘ది ఘోస్ట్’ చిత్రం దసరా కానుకగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది..పర్వాలేదు అనే రేంజ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఈ సినిమాని థియేటర్స్ లో చూడడానికి జనాలు ఆసక్తి చూపించలేదు..మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాథర్’ సినిమా కూడా అదే రోజు విడుదల అవ్వడమే అందుకు కారణం గా చెప్పుకోవచ్చు..పండగ సమయం లో జనాలు మొదటి ఆప్షన్ గా ‘గాడ్ ఫాదర్’ నే ఎంచుకోవడం ఘోస్ట్ మూవీ కి పెద్ద దెబ్బ పడింది.

22 కోట్ల రూపాయిల వరుకు థియేట్రికల్ ప్రీ రిలీజ్ ని జరుపుకున్న ఈ చిత్రానికి కేవలం 6 కోట్ల రూపాయిల షేర్ మాత్రమే వచ్చింది..అయితే ఈ చిత్రం ఈ నెల నాల్గవ తేదీ నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయ్యింది..థియేటర్స్ లో ఆశించిన స్థాయి రెస్పాన్స్ రాకపోయినప్పటికీ కూడా OTT లో అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకుంది ఈ సినిమా.
అంతే కాకుండా కొన్ని అరుదైన రికార్డ్స్ ని కూడా నెలకొల్పింది ఈ చిత్రం..అసలు విషయానికి వస్తే దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రం నెట్ ఫ్లిక్స్ లో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన విషయం తెలిసిందే..సుమారు 20 వారల నుండి ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతూనే ఉంది..ఎన్ని కొత్త సినిమాలు విడుదల అయ్యినప్పటికీ కూడా #RRR చిత్రాన్ని ట్రేండింగ్ లిస్ట్ లో నుండి వెనక్కి నెట్టలేకపోయాయి..కానీ ఘోస్ట్ సినిమా వచ్చిన తర్వాత #RRR నెట్ ఫ్లిక్స్ టాప్ 10 ట్రేండింగ్ మూవీస్ లిస్ట్ నుండి వెళ్ళిపోయింది.

ప్రస్తుతం ఘోస్ట్ మూవీ టాప్ 1 స్థానం లో వారం రోజుల నుండి ట్రెండ్ అవుతూనే ఉంది..సినిమాకి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ ని గమనించిన నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు ఘోస్ట్ మూవీ హిందీ వెర్షన్ ని కూడా విడుదల చేసారు..హిందీ వెర్షన్ కూడా టాప్ 5 లిస్ట్ లోకి వచ్చేసింది.
అలా రెండు వెర్షన్స్ కి కలిపి ఈ చిత్రానికి ఇప్పటి వరుకు సుమారు 10 మిలియన్ల వ్వాచ్ హావర్స్ వచ్చాయట..రీసెంట్ టైమ్స్ లో విడుదలైన నెట్ ఫ్లిక్స్ మూవీస్ లో ఇది ఒక రికార్డు గా చెప్పుకోవచ్చు..అలా థియేటర్స్ లో ఆడకపోయినా డిజిటల్ ఫ్లాట్ ఫారం లో దుమ్ము లేపుతూ ముందుకు దూసుకుపోతున్న ఘోస్ట్ ఊపుని చూసి అక్కినేని అభిమానులు సంతోషిస్తున్నారు.