జగన్ సర్కార్ బడ్జెట్ మాయాజాలాన్ని లెక్కలతో కొట్టారు ఏపీ బీజేపీ నేత పార్థసారథి. జగన్ చెప్పే లెక్కలతో.. అమలు చేసే పథకాలకు అసలు పొంతనే లేదని.. కేటాయింపులు లేవని.. నిధులు ఏమయ్యాయని పార్థసారథి చీల్చిచెండాడాడు. రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో జగన్ సర్కార్ చేస్తున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటాడు.

3 సంవత్సరాల్లో ఏపీ బడ్జెట్లో నవరత్నాలకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డా. పార్థసారథి తీవ్ర విమర్శలు చేశారు. ఇక జలయజ్ఞంకు అసలు కేటాయింపులు, బడ్జెట్ నే కేటాయించలేదని విమర్శించారు. కొత్త ప్రాజెక్టులు రాలేదని.. అసలు మెయింటనేన్స్ కు డబ్బులు ఇవ్వడం లేదని మండిపడ్డారు.
జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాక రాయలసీమకు నీళ్లు ఇస్తానని.. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తానని ఎన్నోసార్లు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటీకీ జగన్ సర్కార్ సీమకు చుక్క నీరు ఇచ్చింది లేదని పార్థసారతి విమర్శించారు. మూడేళ్లుగా రాయలసీమ రైతులు ఎదురుచూస్తున్నారని.. ఒక్క చిన్న ప్రాజెక్ట్ అయినా ఇవ్వండి కోరుతున్నా కూడా జగన్ ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. కొన్ని వందల కోట్లు ఖర్చు పెడితే రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి అవుతాయని.. కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదని పార్థసారథి ఏపీ సర్కార్ ను ప్రశ్నించారు.
మద్యపాన నిషేధాన్ని చేస్తానన్న జగన్.. ఇప్పుడు మద్యాన్ని నియంత్రించకపోగా.. ఏరులైపారిస్తూ ఆదాయాన్ని పెంచుకుంటోందని పార్థసారథి విమర్శించారు. ఈరోజు మద్యం ఆదాయాన్ని పెంచుకుంటున్నారు.. గత ఏడాది 11 వేల కోట్ల మద్యం తాగిస్తే ఈ ఏడాది 16వేల కోట్లు టార్గెట్ పెట్టి తాగిస్తున్నారని పార్థసారథి నిప్పులు చెరిగారు. ఇదేనా ఏపీలో మద్య నిషేధం అని మండిపడ్డారు.
-పార్థసారథి వీడియోను కింద చూడొచ్చు..
[…] Chandrababu- Mamata Banerjee: దేశంలో పెగాసస్ వ్యవహారం సృష్టించిన వివాదం అందరికి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేస్తూ కుట్రలు చేస్తోందని అప్పట్లో పార్లమెంట్ ను ఓ కుదుపు కుదిపేసిన పెగాసస్ విషయం మరోసారి వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓ బాంబు పేల్చారు. అసెంబ్లీ వేదికగా ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. పెగాసస్ సాఫ్ట్ వేర్ ప్రపంచంలోని అన్ని దేశాల్లో పెను దుమారం రేగేందుకు పరోక్షంగా కారణమవుతోంది. […]
[…] Shocking News: పాములంటే అతడికి సరదా. వాటితో ఆడుకోవడానికి ఇష్టపడుతుంటాడు. కానీ అవే అతడి పాలిట యమపాశంగా మారతాయని మాత్రం గ్రహించలేదు. మనకు ఎక్కడైనా పాము కనబడితే పారిపోతాం. మళ్లీ అటు వైపు వెళ్లడానికి జంకుతుంటాం. కానీ పాములు పట్టేవారు అలాకాదు. వాటిని పట్టుకుని ఆడిస్తుంటారు. అవి కూడా పాములు పట్టే వారితో సరదాగానే ఉన్నట్లుగా అనిపిస్తాయి. వాటి మనుగడకు ప్రమాదం అని భావిస్తే మాత్రం కచ్చితంగా కాటు వేస్తాయి. అందుకే అంటారు పాముకు పాలుపోసినట్లు అని. అంటే దానికి విశ్వాసం ఉండదు. కేవలం తన ఉనికిని కాపాడుకోవడమే దానికి తెలుసు. […]
[…] Anand Mahindra: ప్రధాని మోడీ.. ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా సుపరిచితమైంది. రెండు పర్యాయాలుగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఈ పేరు కారణమైంది. ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనువైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు మోడీ. తాజాగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అందులో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయఢంకా మోగించింది. దీంతో బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. బీజేపీ ఓటమి ఖాయమని చాలా పార్టీలు అంచనా వేశాయి. అదే విషయాన్ని బహిరంగంగానే చెప్పాయి. కానీ ఆ అంచనాలను తారు మారు చేస్తూ నాలుగు రాష్ట్రాల్లో విజయ పతాకం ఎగరేసింది బీజేపీ. దీంతో ప్రతిపక్షాలు ఆలోచనలో పడ్డాయి. […]
[…] Janasena-BJP: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాలకు పైగానే సమయం ఉంది. కానీ ఇప్పటి నుంచి వేడి రాజుకుంటోంది. పార్టీల పొత్తు, సీట్లు వంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి. వైసీపీ పార్టీని అధికారం నుంచి దింపేందుకు విపక్షాలన్నీ ఏకమయ్యే చాన్స్ ఉంది. కానీ ఎన్నికల సమయానికి బీజేపీ, జనసేన విడిపోయేలా అవకాశాలున్నాయి. తాజాగా జనసేన ఆవిర్భావ సభలో పార్టీ అధినేత పవన్ పలు అంశాలు ప్రస్తావించారు. కానీ బీజేపీ పేరును మాత్రం ఎక్కడా చెప్పలేదు. […]
[…] Bigg Boss OTT Telugu: బిగ్ బాస్ ఇప్పుడు ఓటీటీ వేదికగా నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ చేస్తుంది. గతంలో కంటే చాలా విభిన్నమైన టాస్కులతో అలరిస్తోంది. నిత్యం గొడవలు, తిట్టుకోవడాలు బాగానే నడుస్తున్నాయి. అయితే బిగ్ బాస్‌లో ఎప్పటి నుంచో ఓ సంప్రదాయం నడుస్తోంది. హౌస్ లో ఒకర్ని టార్గెట్ చేయడం చాలాకామన్. కాగా ఇలా టార్గెట్ చేసిన ప్రతిసారి ఆ టార్గెట్ అయిన వ్యక్తి కప్పు గెలుస్తున్నాడు. […]