https://oktelugu.com/

Nupur Sharma Controversy: బీజేపీ విధానాలే నుపుర్ శర్మ వ్యాఖ్యలకు కారణమా..?

Nupur Sharma Controversy: ఒక కుటుంబం బాగుండాలంటే ఆ ఇంట్లోని సభ్యుల ప్రవర్తన బాగుండాలి.. అలా బాగుండేలా ఇంటి పెద్ద తయారు చేయాలి.. ఒక్కోసారి ఎంత బాగా తీర్చిదిద్దినా ఎవరో ఒకరు కుటుంబానికి చెడ్డపేరు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఆ ఒక్క వ్యక్తితోనే కుటుంబం నాశనమైతే.. ఆ వ్యక్తిని ఏం చేయాలి..? చిన్న వార్నింగ్ ఇస్తే సరిపోతుందా..? అసలు ఆ వ్యక్తి తయారు కావడానికి తప్పు ఆ కుటుంబ పెద్ద అనుసరిస్తున్న విధాన లోపమేనా..? ఇప్పుడు […]

Written By:
  • NARESH
  • , Updated On : June 10, 2022 / 01:07 PM IST
    Follow us on

    Nupur Sharma Controversy: ఒక కుటుంబం బాగుండాలంటే ఆ ఇంట్లోని సభ్యుల ప్రవర్తన బాగుండాలి.. అలా బాగుండేలా ఇంటి పెద్ద తయారు చేయాలి.. ఒక్కోసారి ఎంత బాగా తీర్చిదిద్దినా ఎవరో ఒకరు కుటుంబానికి చెడ్డపేరు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఆ ఒక్క వ్యక్తితోనే కుటుంబం నాశనమైతే.. ఆ వ్యక్తిని ఏం చేయాలి..? చిన్న వార్నింగ్ ఇస్తే సరిపోతుందా..? అసలు ఆ వ్యక్తి తయారు కావడానికి తప్పు ఆ కుటుంబ పెద్ద అనుసరిస్తున్న విధాన లోపమేనా..? ఇప్పుడు దేశంలోని బీజేపీ పరిస్థితి అలాగే తయారైంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్టీ గురించి, ప్రభుత్వం గురించి గొప్పలు చెప్పుకున్నారు. కానీ అంతలోనే ఓ పార్టీ సభ్యురాలు ఓ వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసి పరువు తీశారు. పరువు పోతే మళ్లీ వస్తుంది కావచ్చు.. కానీ దేశానికి ఆర్థిక మూలాలు దెబ్బతీసే పరిస్థితి ఏర్పడుతోంది. అసలు ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి పార్టీ అనుసరిస్తున్న విధాన నిర్ణయాలేనా..? ఇప్పటికే ఎందరో ఎన్నో వ్యాఖ్యలు చేసిన వారిని కట్టడి చేస్తే ఈ పరిస్థితి వచ్చేదా..?

    Nupur Sharma

    దేశంలోని కేంద్రంతో పాటు పలు రాష్ట్రాల్లో బీజేపీ జెండా రెపరెపలాడుతోంది. అధికారంలోకి రావడానికి గుండెకాయలగా ఉన్న యూపీలోనూ ఇటీవల అధికారంలోకి వచ్చింది. అయితే మొదటి ఐదేళ్లు సాఫీగా సాగిన మోదీ ప్రభుత్వం ఆ తరువాత నుంచి దూకుడు పెంచినట్లు కనిపిస్తోంది. మోదీ మానియాతో కొందరు నాయకులు తెగ రెచ్చిపోవడం మొదలు పెట్టారు. ఓ వర్గం వారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. వారి సంస్థలపై కేసులు పెడుతూ వంచించడం మొదలుపెట్టారు. లీటర్ పాలల్లో ఒక్క విషపు చుక్క చాలు.. పాలన్నీ పాడైపోవడానికి అన్నట్లు.. పార్టీ పరవుపోవడానికి ఒక్క వ్యక్తి వ్యాఖ్యలు చాలవా..? అన్న విధంగా తయారైంది. తాజాగా నపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. అంతేకాదు విదేశాలతో సంబంధాలను తెగేంత వరకు వెళ్లాయి. అయితే ఈ పరిస్థితి రాకుండా ఎప్పుడో కట్టడి చేయాల్సి ఉందని విశ్లేషకులు అంటున్నారు.

    Also Read: Early Elections in Telangana: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు?

    యూపీలో అధికారంలో ఉన్న బీజేపీ బుల్డోజర్లను ఉపయోగించి పలు ఇళ్లను కూల్చి వేసింది. అయితే కొన్ని వర్గాలకు చెందిన వారివే ఎక్కువగా కూల్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. అంతేకాకుండా దేశంలోని కొన్ని సంస్థలు తమ మాట వినకుంటే వారిపై అక్రమంగా కేసులు పెడుతున్నారని అంటున్నారు. తమకిక తిరుగులేదన్నట్లు కొందరు నాయకులు ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. అప్పటి వరకు కాంగ్రెస్ లో ఉన్న అస్సాం సీఎం బీజేపీలో చేరగానే కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీపై దేశం మొత్తం విమర్శించేలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. మరి ఈ సమయంలో పార్టీ తీసుకున్న చర్యలేంటి..? అస్సాం సీఎ వ్యక్తిగత కోపంతో ఇలాంటి వ్యాఖ్యలు చేసినా సభ్య సమాజంలో అవి అనుచిత వ్యాఖ్యలేగా..?

    Nupur Sharma

    తాజాగా నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యతో బీజేపీ కళ్లు తెరిచినట్లయింది. ఆమె చేసిన వ్యాఖ్యలు దేశంలోనే కాకుండా పశ్చిమాసియా దేశాలు భగ్గుమంటున్నాయి. తమ దైవం మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు ఆర్థిక మూలాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. పశ్చిమాసియా ముస్లిం దేశాలతో భారత్ సత్సంబంధాలు నెరుపుతూ వస్తోంది. ఎన్నో పెట్టబడులను స్వీకరిస్తోంది. అంతేకాకుండా భారత్ నుంచి వెళ్లిన వారు ఎంతో మంది అక్కడ స్తిరపడ్డారు. ఇప్పుడు నపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలతో అక్కడి వారు క్షమాపణ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మహ్మద్ ప్రవక్తపై నపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలతో ఆమెను పార్టీ సస్పెండ్ చేసింది. అయితే అంతటితో తాము చర్యలు తీసుకున్నట్లేనా..? అని కొందరు అంటున్నారు. ఇలాంటి వారు పార్టీలో మరెందరో ఉన్నారు. మరి వారిని ఎలా కట్టడి చేసుకుంటూ పోతారు..? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

    Also Read:Pawan Kalyan Emotional : ఆ వీడియో చూసి ఎమోషనల్ అయిన పవన్ కళ్యాణ్

    Tags