వీరిలో గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, నేతి విద్యాసాగర్, ఫరీదుద్దీన్, బోడకుంటి వెంకటేశ్వర్లు, ఆకుల లలిత ఉన్నారు. ఎమ్మెల్సీ పదవులకు పోటీ పడే వారి సంఖ్య కూడా ఎక్కువగా నే ఉంది. కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనచారి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన కోటిరెడ్డి, అవకాశం కోసం ఎదురు చూస్తున్న తుమ్మల నాగేశ్వర్ రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి వారు పదవుల కోసం ఎదురుచూస్తున్నారు.
సీనియర్ నేత చింతల వెంకటేశ్వర్ రెడ్డి, అంజయ్య యాదవ్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, బొంతు రామ్మోహన్, శ్రవణ్ రెడ్డి, టీఆర్ఎస్ ఎల్వీ సెక్రటరీ రమేశ్ రెడ్డి, పన్యాల భూపతిరెడ్డి, కేసీఆర్ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ కూడా ఆశలు పెట్టుకున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పదవుల భర్తీ తర్వాత ఆపరేషన్ ఆకర్ష్ ను మొదలు పెట్టాలని బీజేపీ నిర్ణయించింది.
టీఆర్ఎస్ లో చాలా మంది అసమ్మతి నేతలు ఉన్నారంటూ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలతో గులాబీ పార్టీపై ఫోకస్ పెట్టింది. టీఆర్ఎస్ లో ఉన్న బడా వ్యాపార నేతలపై కన్నేశారు. గుర్తింపు లేక ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న నేతలతో పాటు పదవులు రాకుండా కోపంతో ఉన్న వారిని చేర్చుకునేందకు బీజేపీ పథకాలు రచిస్తోంది.