https://oktelugu.com/

వర్మ పై అరియానా షాకింగ్ కామెంట్స్ !

వివాదాస్పద ‘రామ్ గోపాల్ వర్మ’ నిజంగా మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్. దానిలో ఎవరికీ ఎలాంటి డౌట్ లేదు. ఇప్పటికీ గొప్ప దర్శకుడిగానే ఆర్జీవీని గౌరవిస్తున్నారు కూడా. కాకపోతే ఆర్జీవీ ఇంటర్వ్యూలు చూసి ఒక వ్యక్తిగా ఆయన్ని ఒక సెక్స్ మేనియాక్ అని భావిస్తూ ఉంటారు జనం. అందరూ ఇదే అనుకుంటారు అని కచ్చితంగా చెప్పలేం గానీ, ఆర్జీవీకి ఉన్న బ్యాడ్ నేమ్స్ లో ఇది కూడా ఒకటి. పైగా ఆర్జీవీ కూడా తానూ అలాంటి వ్యక్తినే […]

Written By:
  • admin
  • , Updated On : June 25, 2021 / 01:45 PM IST
    Follow us on

    వివాదాస్పద ‘రామ్ గోపాల్ వర్మ’ నిజంగా మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్. దానిలో ఎవరికీ ఎలాంటి డౌట్ లేదు. ఇప్పటికీ గొప్ప దర్శకుడిగానే ఆర్జీవీని గౌరవిస్తున్నారు కూడా. కాకపోతే ఆర్జీవీ ఇంటర్వ్యూలు చూసి ఒక వ్యక్తిగా ఆయన్ని ఒక సెక్స్ మేనియాక్ అని భావిస్తూ ఉంటారు జనం. అందరూ ఇదే అనుకుంటారు అని కచ్చితంగా చెప్పలేం గానీ, ఆర్జీవీకి ఉన్న బ్యాడ్ నేమ్స్ లో ఇది కూడా ఒకటి.

    పైగా ఆర్జీవీ కూడా తానూ అలాంటి వ్యక్తినే అన్నట్టు తన ట్వీట్లతో చేష్టలతో కలర్ ఇస్తాడు. లెగిస్తే.. వోడ్కా, అమ్మాయిల మధ్యలో సినిమా కథలు ఇవే తన ప్రపంచం అన్నట్లుగా బిల్డప్ ఇచ్చే ఆర్జీవీ గురించి, కుర్ర భామ అరియానా క్లారిటీ ఇచ్చింది. వర్మ గారికి సెక్స్ పిచ్చోడు అనే ఇమేజ్ వచ్చింది. కానీ ఆ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు.

    ఆయన పై ఉన్న ఆ అభిప్రాయం పూర్తిగా తప్పు అని చెబుతుంది ఆర్జీవీ లేటెస్ట్ వీరాభిమాని. ఇటీవల అరియనా గ్లోరీకి వర్మ తనదైన శైలిలో ఒక బోల్డ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ఈ భామ అందాలను శరీరాన్ని అంగాంగ వర్ణన చేస్తూ కసి చూపులతో కవ్వించాడు 59 ఏళ్ల వర్మ. తనకు అరియానా బాడీ బాగా నచ్చింది అని కూడా చెప్పి… ఆమెను అలాగే చూస్తూ ఉండిపోయాడు.

    ఐతే, ఇంత చేసినా అరియానా మాత్రం ఆర్జీవీ పై తెగ ప్రేమ చూపిస్తోంది. తాజాగా అరియనా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూ గురించి చెప్పుకొచ్చింది. అరియనా మాట్లాడుతూ.. రామ్ గోపాల్ వర్మని ఒక మాడ్రన్ రిషి. ఆయన గురించి మీకు ఏమి తెలుసు. నాకు తెలుసు, ఆయన మన మధ్య ఉన్న రిషి,” అని హొయలు పోతూ ముచ్చటించింది ఒయ్యారి భామ.