దుబ్బాక గెలుపుతో బీజేపీ మంచి జోష్ మీద ఉంది. దీంతో జీహెచ్‌ఎంసీలో ఆపరేషన్ ఆకర్ష్ నడిపిస్తోంది. ఈ క్రమంలో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ పార్టీలోకి వచ్చేందుకు అంగీకరించగా… విశ్వేశ్వర్‌రెడ్డి మాత్రం ఇంకా ఎటూ తేల్చలేదు. సయమం సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటానని తనతో మాట్లాడిన బీజేపీ నేత భూపేందర్ యాదవ్‌కు చెప్పేశారట. విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరే సమయంలోనే టీఆర్ఎస్ మీద పోరాటం చేయటానికే వస్తున్నా అని ప్రకటించారు. ఇప్పుడు టీఆర్ఎస్ మీద పోరాటం చేయటం కాంగ్రెస్ వల్ల కాకుంటే మరో వేదికను ఎంచుకుంటారా..? లేదంటే కాంగ్రెస్‌లోనే ఉంటూ.. బీజేపీతో ఉన్న సంబంధాలను ఉపయోగిస్తూ టీఆర్ఎస్‌పై పోరాడుతారా అనేది తెలియాల్సి ఉంది.
Also Read: కాంగ్రెస్ కు షాక్.. గ్రేటర్ లో బీజేపీ తరుఫున విజయశాంతి ప్రచారం
అలాగే.. మాజీ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డిని కూడా బీజేపీ కలిసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఇన్‌చార్జిగా వచ్చిన భూపేందర్ యాదవ్ ఆయనతో మీట్ అయ్యారు. ఈ పరిణామం కాంగ్రెస్ వర్గాల్లోనూ కలకలం రేపింది. విశ్వేశ్వర్‌రెడ్డి ఉద్యమ సయయంలో టీఆర్‌ఎస్‌లో చేరి తర్వాత చేవెళ్ల నుంచి ఎంపీ అయ్యారు. అసెంబ్లీ ముందస్తు ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. టీఆర్‌ఎస్‌లో ఓ నేతతో వచ్చిన చిన్న గ్యాప్ కారణంగా అధికార పార్టీకి గుడ్‌బై చెప్పారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయినా కాంగ్రెస్ కార్యక్రమాల్లో చురుకుగానే పాల్గొంటున్నారు. అలాంటి విశ్వేశ్వర్‌రెడ్డిపై బీజేపీ ఫోకస్ పెట్టింది బీజేపీ.
Also Read: కేసీఆర్ ట్విస్ట్.. మేనిఫెస్టోలో ‘ఫిల్మ్ సిటీ’..!
తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో ఆ పార్టీ దుస్థితి మరింత అధ్వానంగా మారబోతోందట. మరికొంత మంది నేతలు గోడదూకేందుకు సిద్ధపడ్డారట. అయితే.. ఇన్నాళ్లు టీఆర్ఎస్ బాట పట్టిన నాయకులు.. ఇప్పుడు కాషాయం కండువా కప్పుకునేందుకు సిద్ధపడుతున్నారు. శేరిలింగంపల్లి నుంచి భిక్షపతి యాదవ్.. ఆయన కుమారుడు బీజేపీ గూటికి చేరారు. ఇలా కాంగ్రెస్‌లో సీనియర్లు.. కాస్త బలమైన క్యాడర్ ఉన్న వారిని లాగే పనిలో పడింది బీజేపీ. కాంగ్రెస్ అధికార ప్రతినిధులు మొదలుకుని.. నియోజకవర్గ ఇన్‌చార్జీల వరకు ఎవరినీ వదలకుండా కమలనాథులు వరుస పెట్టి సంప్రదింపులు జరుపుతున్నారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
ఏ రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా.. పొత్తులు పొడవడం కామన్. అలాగే.. వలసలూ సాధారణం. ఓ పార్టీ నుంచి టికెట్ ఆశించి.. లభించకపోవడంతో మరో పార్టీలోకి చేరిపోవడం ఆనవాయితీ. లేదా.. ఇప్పుడున్న పార్టీలో ప్రాధాన్యం దక్కడం లేదని మరో పార్టీని వెతుక్కుంటుండడం చూస్తుంటాం. అయితే.. ఇప్పుడు తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నడుస్తున్నాయి.