వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇప్పుడు చంద్రబాబును ఆయన సొంత ఇలాకాలో ఓడించి అత్యంత ఘోరంగా అవమానించాలని స్కెచ్ గీశాడట.. ఈ మేరకు చిత్తూరు జిల్లా నేతలకు కుప్పం నియోజకవర్గంపై నజర్ పెంచాలని ఆదేశించారట.. కుప్పంలో వైసీపీ వ్యవహారాలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డికి తోడు చిత్తూరు వైసీపీ ఎంపీ రెడ్డెప్ప సైతం కుప్పం నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. 2019లో ఎంపీగా గెలిచిన నాటి నుంచి దూకుడుగా ఉంటున్న ఆయన.. తన పరిధిలోని మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల కంటే కుప్పానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. మరోవైపు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అట్టహాసంగా ఆ నియోజకవర్గం ప్రారంభిస్తున్నారు. పెద్ద ఎత్తున సభలు పెడుతున్నారు రెడ్డప్ప.
Also Read: బీజేపీ పితలాటకం.. తిరుపతిలో గెలిపిస్తేనే కేంద్రం నిధులా?
ఆ విధంగా జిల్లా కేంద్రం చిత్తూరు కంటే.. కుప్పంలోనే ఎక్కువగా కనిపిస్తున్నారట. స్థానిక వైసీపీ కేడర్‌కు కొత్తలో ఎంపీ రాక ఉత్సాహం తీసుకొచ్చినా.. తర్వాత ఆయన తీరు చూసి హడలిపోతున్నారట. ఎంపీ స్థాయిని మరిచి.. ప్రతీ చిన్న కార్యక్రమంలోనూ జోక్యం చేసుకోవడంపై విస్మయం చెందుతున్నారు.
Also Read: గంటా ఫ్యూచర్ ఏంటి..?
ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఆరు నుంచి ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. కానీ.. ఎంపీ రెడ్డప్ప మాత్రం తన పార్లమెంట్ పరిధిలోని ఒక్క నియోజకవర్గం మీదనే దృష్టిపెట్టాడంట. ఆయన కన్ను ఇప్పుడు కుప్పంపై పడిందట. చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో ఇన్నాళ్లూ టీడీపీ అధినేత చంద్రబాబు గెలిచింది ఒక ఎత్తు అయితే.. 2019లో వరించిన విజయం మరో ఎత్తు. ఆ ఎన్నికల్లో వైసీపీ నుంచి చంద్రబాబుపై పోటీ చేసిన రిటైర్డ్ ఐఏఎస్ చంద్రమౌళి.. మొదటి రౌండ్లో మెజారిటీ సాధించి టీడీపీ అధినేతకు షాక్ ఇచ్చారు. చివరకు చంద్రబాబు గెలిచినా.. ఆయన మెజారిటీ తగ్గించి సీఎం జగన్ దగ్గర శభాష్ అనిపించుకున్నారు చంద్రమౌళి. అయితే అనారోగ్యంతో చంద్రమౌళి చనిపోవడంతో కుప్పం వైసీపీల పరిస్థితులు మారాయి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
ప్రస్తుతం వైసీపీ కుప్పం ఇన్‌చార్జిగా చంద్రమౌళి కుమారుడు భరత్ ఉన్నాడు. అయితే.. ఎంపీ హడావిడితో ఇప్పుడు భరత్‌కు స్థానికంగా పెద్దగా విలువ లేకుండా పోయిందట. ఇదే విషయాన్ని పార్టీ కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు. అంతా ఆయనే చేసేస్తే తామేం చేయాలని కామెంట్స్ వినిపిస్తున్నాయట. మంత్రి పెద్దిరెడ్డి జోక్యం చేసుకుంటే కానీ రెడ్డప్ప జోరుకు బ్రేక్ పడే అవకాశం లేదట. అయితే.. పెద్దిరెడ్డి ఎంపీ జోరుకు బ్రేక్ వేస్తారా..? వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓటమే లక్ష్యంగా ఎంపీని మరింత రెచ్చగొడుతారా..? చూడాలి.