టీఆర్ఎస్ నేతలపై బీజేపీ ఎంపీ అవినీతి ఆరోపణలు

కరోనాను అరికట్టడంలో కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యం చెందిన్నట్లు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఎండగడుతూ ఉంటె, ఆ పార్టీకి చెందిన నిజామాబాదు ఎంపీ డి అరవింద్ టీఆర్ఎస్ నేతలపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. ధాన్యం కొనుగోళ్లలో టీఆర్ఎస్ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. రైస్ మిల్లర్లతో కుమ్ముక్కై రైతులను దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. కడ్త పేరుతో 5కిలోల తరుగు తీస్తూ రైతులకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నట్లు మండిపడ్డారు. సరిహద్దు జిల్లాలకు కేసీఆర్ హెచ్చరిక! కష్టపడి […]

Written By: Neelambaram, Updated On : May 1, 2020 1:15 pm
Follow us on


కరోనాను అరికట్టడంలో కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యం చెందిన్నట్లు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఎండగడుతూ ఉంటె, ఆ పార్టీకి చెందిన నిజామాబాదు ఎంపీ డి అరవింద్ టీఆర్ఎస్ నేతలపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు.

ధాన్యం కొనుగోళ్లలో టీఆర్ఎస్ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. రైస్ మిల్లర్లతో కుమ్ముక్కై రైతులను దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. కడ్త పేరుతో 5కిలోల తరుగు తీస్తూ రైతులకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నట్లు మండిపడ్డారు.

సరిహద్దు జిల్లాలకు కేసీఆర్ హెచ్చరిక!

కష్టపడి పంట పండించిన రైతు పంట అమ్ముకునేందుకు తెలంగాణాలో నానా అవస్థలు పడుతున్నారని అరవింద్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం నిధులిస్తున్నా రాష్ట్రం వాటిని సరిగా ఉపయోగించుకోవడం లేదని విమర్శించారు. ధాన్యం కొనుగోలు చెసి భారత ఆహార సంస్థ గోదాంలకు పంపటం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చేతకావటం లేదని ఎద్దేవా చేశారు.

కేంద్రం ఇచ్చే నిధుల విషయంలో మంత్రి ప్రశాంత్ రెడ్డికి కనీస అవగాహన లేదని అరవింద్ ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు అవస్థలు పడుతుంటే మంత్రి ప్రశాంత్ మాత్రం కేసీఆర్ భజన చేస్తున్నాడని దుయ్యబట్టారు.

మరోసారి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను ప్రకటించిన కేంద్రం

ఐటి రంగానికి, పరిశ్రమలకు సాయం చేస్తామన్న మంత్రి కేటీఆర్ కి రైతు సమస్యలు కనపడటం లేదా? అని అరవింద్ ప్రశ్నించారు. మద్దతు దర కావాలని రాష్ట్రం ప్రతిపాదనలు పంపితే పసుపుకి మంచి మద్దతు ధర ఇచ్చేం దుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

లాక్ డౌన్ తో పేద ప్రజలకు ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశ్యంతో కేంద్రం 5 కిలోల బియ్యం, కిలో కంది పప్పు పేదలకు పంపిణీ చెస్తోందని ఆయన తెలిపారు.