Mohan Babu: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మెయిన్ లీడ్‌లో నటించిన ‘సన్ ఆఫ్ ఇండియా’ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ట్రైలర్ లో మ్యాటర్ ఉంది. ముఖ్యంగా మోహన్ బాబు డైలాగ్స్ అండ్ గెటప్స్ బాగా ఆకట్టుకున్నాయి. అలాగే ట్రైలర్ ను కట్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. మెయిన్ లీడ్ గా మోహన్ బాబు అదరగొట్టాడు. ఎక్కడా వయసు పై బడింది అనే ఫీలింగ్ ను తీసుకురాలేదు.

అయితే.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సినిమాలకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రావడం గగనమైన పరిస్థితుల మధ్య, మోహన్ బాబు హీరోగా ఈ సినిమాను తీసుకువస్తున్నాడు. ఒకప్పుడు కలెక్షన్ కింగ్ అంటూ ప్రేక్షకులు మోహన్ బాబు సినిమాలకు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను అందించేవారు. దానికి తగ్గట్టే అన్నట్టు మోహన్ బాబు నటన, అలాగే ఆయన వాచకం ఇప్పటికీ వైవిధ్యమే. నిజానికి ఆ రోజుల్లో.. అంటే, ముఖ్యంగా ఇరవై ఐదేళ్ల క్రితం మాట. మోహన్ బాబుకి స్టార్ హీరో ఇమేజ్ ఉండేది.
ఆయన సినిమాలకు విపరీతమైన ఓపెనింగ్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పైగా ఈ మధ్యలో వారసుల ఎంట్రీ, దీనికి తోడు వరుస ప్లాప్ లు మొత్తానికి రెండు దశాబ్దాలుగా మోహన్ బాబు తన వైభోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అదే విధంగా తన వయసుకు తగిన పాత్రలు పట్టుకోవడంలో కూడా మోహన్ బాబు నిరాశ పరిచారు. ఆ మధ్య ఆర్జీవీతో రౌడీ అంటూ ఓ సినిమాని నమ్మి కాస్త బడ్జెట్ ఎక్కువ పెట్టి తీశారు గానీ, ఆ సినిమా హీరోగానూ, అలాగే అటు నిర్మాతగానూ కనీసం వర్కౌట్ కాలేదు. మరి ఇప్పుడు సన్ ఆఫ్ ఇండియా సినిమా చేస్తున్నాడు.
కాగా ఈ సినిమా ఈ నెల 18న థియేటర్లలో విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో తనికెళ్ల భరణి, ప్రగ్యా జైస్వాల్, నరేష్, వెన్నెల కిషోర్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. డైమండ్ రత్నబాబు తెరకెక్కించిన ఈ సినిమాను శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ సంస్థల ఆధ్వర్యంలో మంచు విష్ణు నిర్మించాడు.
Also Read: రోజాకు ఈసారైనా మంత్రి పదవి దక్కేనా? ప్రత్యర్థుల ఉచ్చులో చిక్కుకుంటారా?

[…] Also Read: జగన్ తో భేటీ మిస్ అయినా ట్రైలర్ తో వచ్… […]