BJP MLAs Suspended Assembly: *అసెంబ్లీలో తనను ఎదురించే మగాడే ఉండొద్దని కేసీఆర్ డిసైడ్ అయ్యాడు. అందుకే అసలు సభ ప్రారంభం కాగానే.. బీజేపీ నేతలు కనీసం ఆందోళన కూడా చేయకముందే సస్పెండ్ చేసిపారేశారు. ఇదేం అన్యాయం అని హతాషులైన బీజేపీ ముగ్గురు ఎమ్మెల్యేలు అసెంబ్లీ ముందు భైఠాయించి నిరసన తెలుపుతున్నారు. కేసీఆర్ ఇలాకాలో ప్రశ్నించేటోడు ఉండదన్నది ప్రభుత్వ పాలసీ.. మరి ప్రశ్నించడానికే వచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలను ఎలా వదులుతాడు.. అందుకే సస్పెండ్ చేసిపడేశాడు. మిగతా ఇద్దరు ఎమ్మెల్యేలకూ ఈ విషయం తెలియకున్నా.. కేసీఆర్ ఉద్యమ సహచరుడు అయినా ఈటల రాజేందర్ కు ఈ విషయం తెలుసూ.. అందుకే తాజాగా హైకోర్టుకెక్కారు.*

రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన ప్రభుత్వానికి వ్యూహం బెడిసి కొట్టే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. సభ ప్రారంభమైన కొద్ది సేపటికే బీజేపీకి చెందిన ఎమ్మెల్యేటు రాజాసింగ్, రఘునందన్‌రావు, ఈటల రాజేందర్‌ను సస్పెండ్ చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రతిపాదించారు. వెంటనే స్పీకర్ కనీసం ఎమ్మెల్యే ముఖం కూడా చూడకుండా సస్పెన్షన్ నోట్ చదివారు.
Also Read: సభలో కేటీఆర్, ఈటల ఆలింగనం.. వైరల్ అవుతున్న వీడియో
ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్న బీజేపీ..
హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఘోర ఓటమి చవి చూసింది. ఈ ఫలితం కేసీఆర్ ఉలిక్కి పడేలా చేసింది. హుజూరాబాద్ ఫలితాల తర్వాత నుంచి బీజేపీ టార్గెట్‌గా సీఎం కేసీఆర్ సభలు, సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఒకప్పుడు రాష్ట్రంలో బీజేపీ ఎక్కడుంది అన్న కేసీఆర్ నేడు బీజేపీని విమర్శించకుండా ఉండలేకపోతున్నాడు. అసహనంతో ఊగిపోతున్నారు. ఈ క్రమంలోనే దేశ రాజకీయాల్లోకి వెళ్తానంటూ పర‍్యటనలూ చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యేపై మరోసారి సీఎం తన అక్కసు ప్రదర్శించారు. వారు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ఇష్టం లేక ఎలా తప్పించుకోవాలని చూస్తున్న సీఎంకే వెతకబోయిన తీక కాలికి తగినట్లు అయింది. బీజేపీ ఫో‍్లర్ లీడర్ రాజాసింగ్ గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై నిరసన తెలిపారు. వెంటనే సీఎం సస్పెన్షన్ మోషన్ పెట్టాలని మంత్రి తలసానిని పిలిచి సూచించారు. ఆ వెంటనే మంత్రి మోషన్ ప్రతిపాదించడం, స్పీకర్ ఆ వెంటనే దానిని ఆమోదం తెలుపుతూ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం జరిగిపోయింది.

బీజేపీ న్యాయ పోరాటం..
చట్ట సభల్లో నిరసన తెలిపే హక్కు ప్రతీ సభ్యుడికి ఉంటుంది. దీని ఆధారంగానే ఇటీవల లోక్‌సభలో టీఆర్‌ఎస్ ఎంపీలు నిరసనలు తెలిపారు. 12 రోజుల నిర్సనల తర్వాత స్పీకర్ ఓం బిర్లా టీఆర్‌ఎస్ ఎంపీలతోపాటు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. సరిగా ఇదే అంశాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం ప్రస్తావిస్తున్నారు. చట్ట సభల్లో సభ్యుల హక్కులు తెలంగాణ స్పీకర్ హరించాడని ఆరోపిస్తున్నారు. వరుస మీడియా సమావేశాలతో సోమవారం అసెంబ్లీలో జరిగిన తీరును, స్పీకర్ వైఖరిని, ప్రభుత్వం, కేసీఆర్ తీరును ఎండగడుతున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం బీజేపీ ఎమ్మెల్యేను సస్పెన్షన్‌ను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.
ప్రజాక్షేత్రంలో నిరసన..
బీజేపీ ఎమ్మెల్యే సస్పెన్షన్‌పై ఆ పార్టీ ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండల కేంద్రాల్లో కేసీఆర్ దిష్టిబొమ్మల దహనం చేయాలని, రాజ్యాంగాని‍్న రాష్ట్ర ప్రభుత్వం అపసాహ్య చేస్తున్న తీరును నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రం ఇవ్వాలని పిలుపు నిచ్చారు. ఈమేరకు పార్టీ నాయకులు నిరసనలతో హోరెత్తించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ప్రజలకు మరింత స్పష్టంగా వివరించినట్లుయింది.
కాంగ్రెస్ కూడా పరోక్ష మద్దతు..
బీజేపీ ఎమ్మెల్యే సస్పెన్షన్‌ను కాంగ్రెస్ పార్టీ కూడా ఖండించింది. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు అన్ని పార్టీలు సభలో ఉండాలని ప్రజాస్వామ్య ప్రభుత్వం ఆకాంక్షిస్తుంది. కానీ కేసీఆర్ మాత్రం ప్రతిపక్షాలు ఉండకూడదనే వైఖరినే మొదటి నుంచీ అవలంబిస్తున్నారు. ఈ తీరును పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఖండించారు. ప్రభుత్వ వైఖరిపై బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపు నివ్వడంతో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ప్రజల్లో చర్చ మొదలైంది.
సస్పెన్షన్‌పై నోరు మెదపని అధికార పార్టీ..
బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై అధికార పార్టీ నుంచి ఒక్కరు కూడా స్పందించడం లేదు. సస్పెన్షన్ సరైనదే అయితే సభ ముగిసిన మరుక్షణమే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు విలేకరుల సమావేశం నిర్వహించేవారు. సస్పెన్షన్ జరిగి 24 గంటలు గడిచినా ఎవరూ నోరు మెదపకపోగా, అన్యాయంగానే సస్పెండ్ చేశారనే అభిప్రాయం అధికార పార్టీలోనూ వ్యక్తమవుతున్నట్లు పార్టీ కేడర్‌లో చర్చ జరుగుతోంది. దీంతో పార్టీ అధిష్టానం కూడా సెల్‌్ప గోల్ కొట్టుకున్నామా అనే సందిగ్ధంలో పడింది.
Also Read: కేసీఆర్ కు నిజంగా ఆ భయం పట్టుకుందా?