
తెలంగాణ బీజేపీ నాయకుడు, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు షాక్ తగిలింది. నాంపల్లి ప్రత్యేక కోర్టు రాజా సింగ్‌కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ.. తీర్పు వెల్లడించింది. దీంతో ఇప్పుడు ఈ తీర్పు రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. 2016 ఉస్మానియా బీఫ్ ఫెస్టివల్ వ్యవహారంలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఐదు సంవత్సరాల క్రితం కేసు నమోదయ్యింది. ఆయనను అరెస్ట్ చేసి బొల్లారం పీఎస్‌కు తరలించారు. ఆయనపై సెక్షన్ 295ఏ కింద బొల్లారం పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి గట్టి షాక్
ఇక ఐదేళ్ల తర్వాత ఈ కేసులో నాంపల్లి కోర్టు శుక్రవారం తీర్పు ప్రకటించింది. ఇక దీనిపై రాజా సింగ్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇక ఈ కేసుపై హైకోర్టును ఆశ్రయిస్తానని రాజాసింగ్ తెలిపారు. బీఫ్ ఫెస్టివల్ సందర్భంగా రాజాసింగ్ ఆ సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీఫ్ ఫెస్టివల్ జరుపుతామని ఓయూ విద్యార్థులు ప్రకటించారు. దీనికి సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఉస్మానియా యూనివర్సిటీలోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఉస్మానియాలో బీఫ్ ఫెస్టివల్ చేస్తే.. మరో దాద్రి అవుతుందని వివాదస్పద వాఖ్యలు చేశారు రాజాసింగ్.
Also Read: ఎప్పుడు.. ఎంత ప్రకటించాల్నో కేసీఆర్‌కు తెలుసట
ఈ నేపథ్యంలో నాంపల్లి ప్రత్యేక కోర్టులో రాజాసింగ్ కేసు విచారించింది. ప్రాసిక్యూషన్ సమర్పించిన ఆధారాలన్నీ రుజువు కావడంతో ప్రత్యేక న్యాయస్థానం రాజాసింగ్‌కు ఏడాదిపాటు జైలు శిక్ష విధించింది. అయితే.. తన జైలు శిక్ష పైన రాజాసింగ్ వెంటనే బెయిల్ కూడా మంజూరు చేసింది. హైకోర్టులో అప్పీల్ చేసేందుకు నెల సమయం కూడా విధించింది. తాను ఎలాంటి తప్పు చేయలేదని అప్పటికీ పోలీసులు బలవంతంగా తనపై కేసులు వేశారని రాజాసింగ్ ఆరోపించారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
ఒకవేళ హైకోర్టు శిక్ష ఖరారు చేసినా రాజాసింగ్‌కు రాజకీయంగా వచ్చే నష్టం ఉండదు. ఆయనపై అనర్హతా వేటు పడదు. చట్టం ప్రకారం రెండేళ్ల జైలు శిక్షపడితేనే ప్రజాప్రతినిధిపై అనర్హతా వేటు పడుతుంది. కానీ.. రాజాసింగ్‌పై వచ్చిన తీర్పు రాజకీయ నాయకుల్లో చర్చనీయాంశం కావడం ఖాయం. ఇటీవల ఓ బీజేపీ నేత తిరుపతి ఉపఎన్నికలను కృష్ణుడు, ఏసుకు మధ్య పోటీగా అభివర్ణించారు. మామూలుగా అయితే ఇది రాజ్యాంగాన్ని ఘోరంగా అవమానించినంత నేరం. కానీ వారు దేశంలోని అధికార పార్టీ వారు.. వారి రాజకీయ విధానమే ఆ కోణంలో ఉంటుంది కాబట్టి ఎవరూ కేసుల వరకూ వెళ్లలేదు. కానీ విద్వేష రాజకీయాలను కూకటివేళ్లతో పెకిలించాలంటే రాజాసింగ్‌కు విధించిన శిక్ష తరహాలోనే అన్ని రాజకీయ పార్టీల నేతలకు వేయాలి.