బీజేపీ మాస్టర్ ప్లాన్: తెలుగు రాష్ట్రాల్లో ‘కొత్త నేతల’ పాగా..!

బీజేపీ ఇప్పటికే రెండుసార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. 2023లోనూ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలని  భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే బీజేపీ ఇప్పటి నుంచే మాస్టర్ ఫ్లాన్ తో ముందుకెళుతోంది. 2021లో దేశవ్యాప్తంగా ఒకేసారి జమిలి ఎన్నికలు జరిగినా.. 2023లో పార్లమెంట్ ఎన్నికలు జరిగినా దేనికైనా సిద్ధమేనంటూ బీజేపీ దూకుడుగా వెళుతోంది. Also Read: అగ్రి గోల్డ్ బాధితులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్..? బీజేపీ తొలి నుంచి ఉత్తరాది రాష్ట్రాల్లో మంచిపట్టు ఉంది. ఈ రాష్ట్రాల్లోనే బీజేపీ ఎక్కువ సీట్లు […]

Written By: NARESH, Updated On : September 29, 2020 3:30 pm
Follow us on

బీజేపీ ఇప్పటికే రెండుసార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. 2023లోనూ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలని  భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే బీజేపీ ఇప్పటి నుంచే మాస్టర్ ఫ్లాన్ తో ముందుకెళుతోంది. 2021లో దేశవ్యాప్తంగా ఒకేసారి జమిలి ఎన్నికలు జరిగినా.. 2023లో పార్లమెంట్ ఎన్నికలు జరిగినా దేనికైనా సిద్ధమేనంటూ బీజేపీ దూకుడుగా వెళుతోంది.

Also Read: అగ్రి గోల్డ్ బాధితులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్..?

బీజేపీ తొలి నుంచి ఉత్తరాది రాష్ట్రాల్లో మంచిపట్టు ఉంది. ఈ రాష్ట్రాల్లోనే బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకొని కేంద్రం అధికారం చేపడుతోంది. అయితే దక్షిణాదిలో మాత్రం బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. ఒక కర్ణాటక మినహా మిగతా రాష్ట్రాల్లో బీజేపీ అంతంత మాత్రంగానే ఉంది. తమిళనాడు, కేరళలో బీజేపీ ఏమాత్రం పాగా వేయలేకపోతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ బీజేపీ ఒకటి ఆరా మినహా పెద్దగా సీట్లు సాధించిన దాఖలాలు లేవు. అయితే తెలంగాణ, ఆంధప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయాక మాత్రం ఊహించని విధంగా పుంజుకుంటోంది.

తెలంగాణలోనూ, ఏపీలోనూ బీజేపీ దూకుడుగా వెళుతోంది. ఏపీలో బీజేపీకి ఒక్క సీటు లేకుండానే రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తోంది. కేంద్రంలో బీజేపీ అధికారాన్ని ఏపీ నేతలు సద్వినియోగం చేసుకుంటున్నారు. అదేవిధంగా జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకొని రాజకీయంగా బలమైనశక్తిగా ఎదిగే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణలో బీజేపీ రోజురోజుకు బలంగా ఎదుగుతోంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కంటే బీజేపీ పార్టీనే ప్రజా సమస్యలపై పోరాడుతూ ముందుంటోంది. టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నయం అనే భావనను ప్రజల్లోకి తీసుకెళుతోంది.

ఏపీలో 2023 ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి బండి సంజయ్ కుమార్ తమదైన వ్యూహారచనతో ముందుకెళుతోన్నారు. ఇప్పటికే సొంత కమిటీలను నియమించుకుని ప్రజా సమస్యలపై గళంవిప్పుతున్నారు. ఇక బీజేపీ అధిష్టానం సైతం కొత్త నేతలకు కీలక పదవులు ఇస్తూ పార్టీలో జోష్ నింపే ప్రయత్నం చేస్తోంది. కొత్తవారికి బీజేపీలో ప్రాధాన్యం ఉండదనే అపవాదును చెరివేసేలా బీజేపీ జాతీయ కమిటీని ప్రకటించింది.

Also Read: హైదరాబాద్ లో సెలబ్రిటీలకు షాక్.. వాట్సాప్ చాట్ హ్యాక్

తెలంగాణ నుంచి డీకే అరుణ, ఏపీ నుంచి పురంధరేశ్వరీలకు జాతీయ కమిటీలో కీలక పదవులను కట్టబెట్టింది. ఇటీవల పార్టీలో చేరిన కొత్తవారికి కూడా జాతీయ కమిటీలో కీలక పదవులు దక్కినట్లు తెలుస్తోంది. గతంలో అస్సాంలోనూ బీజేపీ కొత్తవారికి కీలక పదవులను ఆఫర్ చేసి ఏడాదిలోనే ఆ రాష్ట్రంలో పాగా వేసింది. ఈ ప్లాన్ వర్కౌట్ అవడంతో దీనిని మరికొన్ని రాష్ట్రాల్లో ప్రయోగించి సక్సస్ సాధించింది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనూ అస్సాం తరహా వ్యూహాన్నే బీజేపీ అమలు చేస్తోంది. కొత్తవారికి బీజేపీ సముచిత స్థానం ఉంటుందనే సంకేతాలు పంపడం ద్వారా ఇతర పార్టీల్లోని కీలక నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. తద్వారా బీజేపీ బలపడేందుకు యత్నిస్తోంది. కొత్తవారితోపాటు పాతవారికి బీజేపీ సముచితం స్థానం కల్పిస్తూ 2023 ఎన్నికలే లక్ష్యంగా ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది.