BJP: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉప ఎన్నికల్లో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తెలంగాణలో అధికార పార్టీని మట్టికరిపించినా ఏపీలో మాత్రం చతికిలపడింది. ఊహించని విధంగా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 23వేల ఓట్ల మెజార్టీ సాధించి ఏపీలో మాత్రం వైసీపీనే 90 వేల మెజార్టీ సాధించడం గమనార్హం. ఈ నేపథ్యంలో బీజేపీ పరిస్థితి రెండు స్టేట్లలో పరస్పర విరుద్ధంగా కొనసాగుతోంది. బీజేపీ అధికార పార్టీలకు ప్రత్యామ్నాయం అని చెప్పుకున్నా ఏపీలో మాత్రం ప్రభావం చూపలేపోయింది.

తెలంగాణలో బీజేపీ తన ప్రభావం పెంచుకుంటోంది. ఇప్పటికే దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తన సత్తా చాటిన పార్టీ ప్రస్తుతం అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ధీనికి గాను నేతలు శక్తియుక్తులు ప్రదర్శిస్తోంది. రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ఇదివరకే పాదయాత్ర చేసి అధికార పార్టీ విధానాలను ఎండగట్టారు. మరోవైపు ఏపీలో మాత్రం పరిస్థితి దిగజారిపోతోంది.
అధికార పార్టీ టీఆర్ఎస్ హుజురాబాద్ లో పాగా వేయాలని సర్వ శక్తులు ఒడ్డింది. డబ్బు, మద్యం విచ్చలవిడిగా సరఫరా చేసి విజయం సాధించాలని చూసింది. కానీ దాని పప్పులు ఉడకలేదు. దీంతో అది బీజేపీ విజయం కాదని ఈటల రాజేందర్ గెలుపు అని సముదాయించుకుంటోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు మాత్రం బీజేపీ విజయంగా చెబుతున్నారు.
Also Read: Huzurabad By Poll Results: కేసీఆర్ కు చెక్: హుజూరాబాద్ లో గెలిచింది ‘ప్రజలే’
కాంగ్రెస్ పార్టీ మాత్రం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. మరోవైపు కాంగ్రెస్ నేతలు తాము బీజేపీకే మద్దతు ఇచ్చామని చెబుతోంది. ఏపీలో వ్యతిరేకత వచ్చినా తెలంగాణలో మాత్రం తన పరువు నిలబెట్టుకుంది బీజేపీ. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు తినిపించుకుని బాణసంచా కాల్చారు. మొత్తానికి టీఆర్ఎస్ కు ఈ విజయం మింగుడు పడటం లేదు.