Hyderabad Gang Rape Case: హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం ఘటన కేసు విచారణ పోలీసులకు అగ్ని పరీక్షలా మారింది. కొంతమంది ప్రముఖుల పిల్లలకు ఈ నేరంతో సంబంధం ఉందనే ఆరోపణలు రావడంతో ఇది రాజకీయ వివాదంగానూ మారింది. తాజాగా పోలీసులు కొంతమదికి క్లీన్‌చిట్ ఇవ్వడం.. మరుసటి రోజే బీజేపీ నేతలు గ్యాంగ్‌రేప్‌లో వారు ఉన్నట్లు ఫొటోలు, వీడియో మీడియాకు విడుదల చేయడం సంచలనంగా మారింది.

ప్రముఖుల తనయులకు డీసీపీ క్లీన్ చిట్..
మే 28న జరిగననట్లుగా భావిస్తున్న ఈ ఘటన గురించి జూబ్లీ హిల్స్ పోలీసు స్టేషన్‌లో వెస్ట్ జోన్ డీసీపీ డీ జోయెల్ డేవిస్ శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. మే 31వ తేదీ రాత్రి బాలిక తండ్రి పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు ఇచ్చారని తెలిపారు. ఈమేరకు దర్యాప్తు చేస్తున్నామన్నారు. అయితే బాధితురాలు ఒకరిని మాత్రమే గుర్తించిందని, మిగతవారిని గుర్తించలేదని పేర్కొన్నారు. వాళ్ల పేర్లకు కూడా ఆమెకు తెలియవన్నారు.
Also Read: Hyderabad Minor Girl Incident : 28న రేప్.. 31న ఎఫ్ఐఆర్.. 3న అరెస్ట్.. ఏం జరుగుతోంది?
ఆమె ఇచ్చిన స్టేట్ మెంట్ ప్రకారం.. దర్యాప్తు చేశామని చెప్పారు. స్టేట్‌మెంట్, సీసీటీవీ ఫుటేజ్, సీడీఆర్ అనాలసిస్, ఇతర సాంకేతిక విశ్లేషణల ద్వారా ఈ ఐదుగురినీ గుర్తించామన్నారు. అయితే ఈ కేసులో హోం మంత్రి మనుమడు ఉన్నాడని కొన్ని చానెళ్లు ప్రచారం చేశాయని. ఇవి వంద శాతం నిరాధారమైన వార్తలని డీసీపీ ఖండించారు. ‘ఈ నేరం మొదలైన ప్రాంతం నుంచి మొత్తం సీసీటీవీ ఫుటేజ్ చూశాం. నిందితులు తీసుకున్న ఫొటోలు చూశాం. నేరం ప్రారంభం నుంచి చివరి వరకూ అన్ని రకాల ఆధారాలను మేం విశ్లేషించాం. ఇందులో హోం మంత్రి మనుమడి ప్రమేయం ఉందని చెప్పడం నిరాధారం’ అని తెలిపారు. ‘ఈ కేసులో ఒక ప్రముఖ వ్యక్తి కుమారుడు ఉన్నాడు. అతడు కూడా నిందితుడు. అయితే, అతడు మైనర్ కాబట్టి అతని పేరు బయటపెట్టడం లేదు’అని డీసీపీ చెప్పారు. ‘ఎమ్మెల్యే కుమారుడిపై కేసు నమోదు చేసేందుకు తమకు ఎలాంటి ఆధారాలూ లభించలేదు’ అని స్పష్టం చేశారు.
ఆధారాలు బయటపెట్టిన బీజేపీ..
డీసీపీ ప్రముఖుల పిల్లలకు క్లీన్‌చిట్ ఇచ్చి 24 గంటలు గడవక ముందే.. బీజేపీ నేతలు గ్యాంగ్ రేప్ కేసులో ప్రముఖుల పిల్లలు ఉన్నట్లు ఆధారాలు బయట పెట్టారు. అయితే మైనర్లు అయినందున ఎంతవరకు చూపాలో అంతరకే చూపుతున్నామని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు తెలిపారు. పోలీసులు క్లీన్‌చిట్ ఇవ్వడంలోనే ఏదో జరుగుతుందని అర్థమవుతుందని, కావాలంటే ఈ ఆధారాలను పోలీసులకు ఇస్తామని తెలిపారు. సీసీ ఫుటేజీలను ఎడిట్ చేశారని ఆరోపించారు. జుడీషియల్ లేదా సీబీఐ విచారణ జరుపాలని డిమాండ్ చేశారు.

ఖంగుతిన్న పోలీసులు..
బీజేపీ నేతలు బయటపెట్టిన ఆధారాలతో పోలీసులు ఖంగుతున్నారు. ఆ వీడియోలు, ఫొటోలు ఎలా బయటకు వచ్చాయని, దీనిపై ఎలాంటి చర్య తీసుకోవాలని సందిగ్ధంలో ఉన్నారు. దోషులను శిక్షించడం కంటే ముందు రఘునందన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. అయితే రఘునందన్‌రావు ఆధారాలను సుప్రీం కోర్టుకు సమర్పిస్తానని, ఇంకా ఇలాంటి ఆధారాలు చాలా ఉన్నాయని ప్రకటించడంలో చర్యలు తీసుకుంటే ఇంకా ఏయే ఫొటోలు, వీడియోలు బయటకు వస్తాయో.. తమ మెడకు ఏమైనా చుట్టుకుంటుందా అనే భయం పోలీసుల్లో కనబడుతోంది. ఇప్పటికే పొలిటికల్ టర్న్ తీసుకున్న ఈ ఘటన ఆధారాలు బయటకు రావడంతో మళ్లీ ఎలాంటి సంచలనం నమోదవుతుందో వేచిచూడాలి.
నిందితులను తప్పించేందుకు టీఆర్‌ఎస్ కుట్ర : బండి సంజయ్
‘‘ఈ ఘటనలో ఎంఐఎం, టీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధుల ప్రమేయం ఉంది. అందుకే నిందితులను తప్పించేందుకు టీఆర్‌ఎస్ కుట్ర చేస్తోంది. నిందితులను తక్షణం అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి. మైనర్ బాలికపై అఘాయిత్వం జరిగి 5 రోజులైనా నిందితులను ఇంతవరకు అరెస్టు చేయలేదు. మీరు మనుషులా… రాక్షసులా. మైనర్ బాలికపై అఘాయిత్యం చేస్తే నిందితులను అరెస్ట్ చేయరా? ఎఫ్‌ఐఆర్ లో నిందితుల పేర్లు నమోదు చేయరా? సీసీ టీవీ కెమెరాలున్నదెందుకు? బాలికను తీసుకెళుతున్న కారులో టీఆర్‌ఎస్, ఎంఐఎం నాయకులున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆ ఫుటేజీల ఆధారంగా నిందితులను ఇప్పటి వరకు ఎందుకు విచారించలేదు? చంచల్‌గూడ జైల్లో ఉంచాల్సిన నిందితులను సేఫ్ గా దాచిపెడతారా? కేసు నుండి వారిని తప్పించేందుకు కష్టపడుతున్న పోలీసులు చట్టాన్ని రక్షించేవాళ్లా… భక్షించేవాళ్లా? రాష్ట్రంలో టీఆర్‌ఎస్, ఎంఐంఎం నాయకులు ఏదైనా చేయొచ్చు… కాపాడటానికి పోలీసులు రడీగా ఉన్నారనే సంకేతాలను పంపుతున్నారా?’’ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Also Read:Chandrababu: టీడీపీ కొంపముంచుతున్న కోటరీ.. కట్టడి చేయలేకపోతున్న చంద్రబాబు
[…] Also Read: Hyderabad Gang Rape Case: పోలీసులకు అగ్ని పరీక్ష.. బీజ… […]