https://oktelugu.com/

Bjp: కేంద్రం తీరుతో నైరాశ్యంలో బీజేపీ నేతలు?

BJP: గత కొంతకాలంగా జగన్ సర్కారుపై ఒంటికాలిపై లేచే బీజేపీ నేతలు కేంద్రం ప్రవేశపెట్టిన 2022-23 బడ్జెట్ తర్వాత ఒక్కసారిగా సైలంట్ అయిపోయారు. ఏపీలో బీజేపీని బలోపేతం చేసేందుకు అక్కడి నేతలు ఎంత ప్రయత్నం చేస్తున్నా వారి ఆశలపై ప్రతీసారి కేంద్రం నీళ్లు చల్లుతూనే ఉంది. కేంద్రం తీరుతో ఏపీ బీజేపీ నేతలు కనీసం బయట మొఖం కూడా చూపించలేని స్థితిలోకి వెళుతున్నారనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏపీలో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ లేకపోయినా […]

Written By:
  • NARESH
  • , Updated On : February 2, 2022 / 03:05 PM IST
    Follow us on

    BJP: గత కొంతకాలంగా జగన్ సర్కారుపై ఒంటికాలిపై లేచే బీజేపీ నేతలు కేంద్రం ప్రవేశపెట్టిన 2022-23 బడ్జెట్ తర్వాత ఒక్కసారిగా సైలంట్ అయిపోయారు. ఏపీలో బీజేపీని బలోపేతం చేసేందుకు అక్కడి నేతలు ఎంత ప్రయత్నం చేస్తున్నా వారి ఆశలపై ప్రతీసారి కేంద్రం నీళ్లు చల్లుతూనే ఉంది. కేంద్రం తీరుతో ఏపీ బీజేపీ నేతలు కనీసం బయట మొఖం కూడా చూపించలేని స్థితిలోకి వెళుతున్నారనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

    ఏపీలో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ లేకపోయినా జగన్ సర్కారుతో ఢీ అంటే ఢీ అంటోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటాన్ని స్థానిక నేతలు సద్వినియోగం చేసుకుంటున్నారు. అయితే కేంద్రం తీసుకునే నిర్ణయాలతో ఏపీ బీజేపీ నేతలు ప్రతీసారి ఇరుకున పడుతున్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, ఏపీ రాజధాని, విశాఖ స్టీట్ ప్లాంట్ ప్రవేటీకరణ విషయంలో ఇప్పటికే బీజేపీ నేతలు ప్రజలకు ఎలా సమాధానం చెప్పాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.

    ఇలాంటి సమయంలోనే కేంద్ర బడ్జెట్ పై ఏపీ బీజేపీ నేతలు చాలా ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలపై కేంద్రం మరోసారి నీళ్లు చల్లింది. ఏపీ ప్రయోజనాలను కాపాడేలా కేంద్రం బడ్జెట్లో ఏ ఒక్క అంశంపై కూడా ప్రస్తావించలేదు. పోలవరం నిధులు, రెవిన్యూ లోటు బడ్జెట్, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధుల ఊసే ఎత్తలేదు. కేంద్రం ప్రవేశపెట్టిన 2022-23 బడ్జెట్ ఏరకంగా చూసిన రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతిసేలా ఉండటంతో ప్రజలంతా మండిపడుతున్నారు.

    జనాల నాడిని గమనించిన బీజేపీ నేతలు కేంద్ర బడ్జెట్ పై మాట్లాడేందుకు జంకుతున్నారు. కనీసం మీడియా ముందుకు రావడానికి కూడా వారికి మొఖం చెల్లడం లేదు. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు యత్నిస్తుండటంతో బీజేపీ నేతలు కేంద్రం పాలసీకి బహిరంగంగా మద్దతు పలుకలేక అలాగని వ్యతిరేకించలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ కారణంగానే పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు జరిగిన ఏ ఎన్నికలోనూ ఆపార్టీకి కనీసం డిపాజిట్లు కూడా దక్కటం లేదు.

    తాజా బడ్జెట్లో కేంద్రం ఏపీకి హ్యండివ్వడంతో బీజేపీ నేతలు ఏపీలో అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. కేంద్రంలోని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక ఏపీకి  పెద్దగా ప్రయోజనం చేకూర్చే పనులేమీ చేయలేదు. ఏపీకి ఏం చేసినా రాజకీయంగా తమకు పెద్దగా ఉపయోగం ఉండదనే భావనతో కేంద్రంలోని బీజేపీ ఉన్నట్లు కన్పిస్తోంది. దీంతోనే కేంద్రం ఏపీకి ఈసారి బడ్జెట్లో మొండి చేయి చూపించడంతో స్థానిక బీజేపీ నేతలు నైరాశ్యంలోకి వెళ్లిపోయారు.