Andhra Pradesh: రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా. రాజ్యంలో రాజుదే ఆదేశం ఫైనల్ చేయడానికి యంత్రాంగం ఉండనే ఉంది. దీంతో అధికారంలో ఉన్న వారు ఎంత చెబితే అంత ఏది చెబతే అది జరడం మామూలే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు కూడా అలాగే ఉన్నాయి. రాష్ర్టంలో ఓ సిమెంట్ కంపెనీ మీద ప్రభుత్వం దౌర్జన్యం చేస్తోందని సదరు కంపెనీ యాజమాన్యం ఆరోపిస్తోంది. దీంతో రాష్ట్రంలో జగన్ సిమెంట్ పరిశ్రమ ఒక్కటే ఉండాలా వేరే ఉండకూడదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ప్రభుత్వం కావాలనే రాద్దాంతం చేస్తోందని చెబుతున్నారు. ఇంత దారుణంగా ప్రవర్తించడం వెనుక కారణాలు ఏమై ఉంటాయనే ఆందోళన కంపెనీలో వ్యక్తమవుతోంది. ఏడాది కాలంగా దాల్మియా సిమెంట్ కంపెనీపై ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది.
కంపెనీ మూసేయాలని ఏడాది క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. దీనికి కోర్టు కంపెనీ వ్యవహారాలు యథాతథంగా నడిపించుకోవచ్చని తీర్పు చెప్పింది. దీంతో అప్పటి నుంచి కార్యకలాపాలు కొనసాగుతున్నా ప్రభుత్వ వేధింపులు మాత్రం ఆగడం లేదు. దీంతో కంపెనీ వ్యవహారాల్లో తలదూర్చే ప్రభుత్వ తీరుపై సహజంగానే విమర్శలు వస్తున్నాయి. రాష్ర్టంలో వారిదే ఉండాలా వేరే వారి కంపెనీలు మనగలగకూడదా అనే సందేహాలు వస్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఇవేవీ పట్టించుకోవడం లేదు. దీనిపై అందరిలో కూడా అనుమానాలు వస్తున్నాయి. ప్రభుత్వ నిర్వాకంతో ఆశ్చర్యపోతున్నారు.
Also Read: కేంద్రం తీరుతో నైరాశ్యంలో బీజేపీ నేతలు?
గత ఏడాది ఏప్రిల్ లో జువారీ సిమెంట్ పరిశ్రమను మూసివేయించింది. అన్ని నిబంధనలు పాటించినా ప్రభుత్వం కలుగజేసుకుని దాన్ని మూసివేయించేదాకా ఊరుకోలేదు. దీంతో ప్రస్తుతం దాల్మియా సిమెంట్ కంపెనీ మీద పడింది. దీన్ని కూడా మూసివేయించే దాకా ఇలాగే చేస్తుందనే వాదన వినిపిస్తోంది. అన్నిరకాల నిబంధనలు పాటిస్తున్నా ప్రభుత్వం కావాలనే రాద్దాంతం చేస్తుందని తెలుస్తోంది. దీంతో సిమెంట్ కంపెనీలపై ప్రభుత్వం ఎందుకు ఇలా ప్రవర్తిస్తోందని కంపెనీల యాజమాన్యాలు వాపోతున్నాయి.
తమ కంపెనీ తప్ప ఇతర కంపెనీలు ఉండకూడదనే ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే వాటిపై లేనిపోని నిబంధనల పేరుతో దాడి చేసి మూసి వేయించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు గాను ఏవో సాకులు చూపుతూ వాటిని కోర్టుల చుట్టు తిప్పేందుకు నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. దీంతోనే మొన్న జువారీ, నిన్న దాల్మియా నేడు మరో కంపెనీపై నిందలు మోపేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ క్రమంలో ఏపీలో ప్రభుత్వం తీరుతో అందరిలో అనుమానాలు వస్తున్నాయి. తమ మనుగడ కోసం పక్కవారిని బలి చేయడమేమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పటికైనా సర్కారు పద్ధతి మార్చుకుని తన సంస్థతో పాటు ఇతరులను కూడా ఉండనివ్వాలనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై జగన్ ఇంకా ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియడం లేదు.
Also Read: పీఆర్సీ చర్చలు జరగలే.. ప్రభుత్వం మంచి ఛాన్స్ మిస్ చేసుకుందా..?