ఆంధ్రజ్యోతికి చాలెంజ్ చేసిన జగన్ సీఎంవో

టీడీపీ అధినేత చంద్రబాబుపై అవాజ్య ప్రేమ చూపించే ఆంధ్రజ్యోతికి అధికార వైసీపీ అన్నా.. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ అన్నా అస్సలు పడదని ఆ పత్రిక ఓపెన్ చేస్తే ఎవరికైనా తెలుస్తోంది. ప్రతీవారం ఆ పత్రిక ఎండీ కొత్త పలుకు పేరిట జగన్ ను ఏకిపారేయకుండా ఉండలేడు. టీడీపీ అనుకూల పత్రికగా ముద్రపడ్డ ఆంధ్రజ్యోతిలో జగన్ తిట్టకపోతేనే ఆశ్చర్యం అని వైసీపీ నేతలు ఆడిపోసుకుంటారు. Also Read: మీ చావు మీరు చావండి.. ఏపీపై కేంద్రం […]

Written By: NARESH, Updated On : August 6, 2020 7:34 pm
Follow us on


టీడీపీ అధినేత చంద్రబాబుపై అవాజ్య ప్రేమ చూపించే ఆంధ్రజ్యోతికి అధికార వైసీపీ అన్నా.. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ అన్నా అస్సలు పడదని ఆ పత్రిక ఓపెన్ చేస్తే ఎవరికైనా తెలుస్తోంది. ప్రతీవారం ఆ పత్రిక ఎండీ కొత్త పలుకు పేరిట జగన్ ను ఏకిపారేయకుండా ఉండలేడు. టీడీపీ అనుకూల పత్రికగా ముద్రపడ్డ ఆంధ్రజ్యోతిలో జగన్ తిట్టకపోతేనే ఆశ్చర్యం అని వైసీపీ నేతలు ఆడిపోసుకుంటారు.

Also Read: మీ చావు మీరు చావండి.. ఏపీపై కేంద్రం నిర్ణయమిదే?

చంద్రబాబును సీఎం చేసేందుకు ఎంతో కష్టపడిన ఆ పత్రిక.. ఇప్పుడు ప్రతిపక్షంలో కూలబడ్డ చంద్రబాబును లేపడానికి పడని కష్టం లేదంటారు. ఎక్కడ వైసీపీ లూప్ హోల్ దొరుకుతుందా ఏసేద్దాం అని వేచిచూస్తున్న ఆంధ్రజ్యోతికి తాజాగా ఓ స్టోరీ కంటబడింది. సో వాస్తవాలు తెలుసుకోకుండా జగన్ ముఖ్యమంత్రి కార్యాలయం తీరుపై ఇష్టానుసారంగా ఓ కథనం వండివార్చింది.

దీంతో తాజాగా ఆ తప్పుడు కథనాల్ని ప్రసారం చేసిన ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ చానెల్ పై ఏకంగా సీఎంవో అధికారులే రంగంలోకి దిగి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఓపెన్ చాలెంజ్ విసిరారు.

సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న ఓ పేద కుటుంబం విషయంలో ఆంధ్రజ్యోతి కనీస విచారణ జరపకుండా సీఎంవోపై అభాండాలు వేస్తూ కథనాలు ప్రసారం చేసింది.

పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురానికి చెందిన చల్లా వీరనాగరావు అనే యువకుడు కరెంట్ కు షాక్ గురయ్యాడు. ఎడమ చేయి, చెవి, కాలు కోల్పోయాడు. హైదరాబాద్ లోని వీ-కేర్ ఆస్పత్రిలో ఈ ఆపరేషన్ జరిగింది. ఏడాది తర్వాత మళ్లీ అనారోగ్యం తిరగబెట్టడంతో తిరిగి అదే ఆస్పత్రికి వెళ్లి నాగరాజుకు ఈసారి ఆస్పత్రి షాకిస్తూ.. 3 ఆపరేషన్లు చేస్తేనే ప్రాణం నిలబడుతుందని.. ఇందుకు 19 లక్షల రూపాయల ఖర్చు అవుతుందని ఎస్టిమేషన్ వేసి ఇచ్చింది.

దీంతో బాధితుడు తనను ఆదుకోవాలని ఎమ్మెల్యే ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ప్రయత్నించాడు. అయితే సీఎంవో అధికారుల పరిశీలనలో ఆపరేషన్ కు 19 లక్షల రూపాయలు కావని.. రూ.5 లక్షలతో పూర్తవుతుందని తేలింది. అపోలో, గ్లోబర్ ఆస్పత్రుల్లో 5 లక్షలతో పూర్తవుతుందని ఆ ఆస్పత్రులకు వెళ్లి ఎస్టిమేషన్ తీసుకురావాలని సూచించింది. అప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల చేస్తామని సూచించారు.

Also Read: 72 సంవత్సరాల తర్వాత భారత్ గా మారిన ఇండియా

దీంతో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థ రంగంలోకి దిగి వాస్తవాలను కప్పిపుచ్చుతూ సీఎంవో అధికారులు తాము చెప్పిన చోట ఆపరేషన్ చేయించుకుంటేనే సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తామని కండీషన్ పెట్టారంటూ తప్పుడు కథనాలు వండివార్చింది. ప్రైవేట్ ఆస్పత్రులతో అధికారులు కుమ్మక్కైయ్యారంటూ ఆరోపించింది.

దీంతో ఒళ్లు మండిన జగన్ సీఎం కార్యాలయం అధికారులు ఏకంగా వివరాలతో సోషల్ మీడియాలో ఆంధ్రజ్యోతిని కడిగేశారు. వి-కేర్ ఆస్పత్రి వేసిన ఎస్టిమేషన్ తో ఏ ఇతర ఆస్పత్రితో అయినా నిరూపించాలని ఆంధ్రజ్యోతికి ఓపెన్ చాలెంజ్ విసిరారు. ఈ మేరకు ట్విట్టర్ లో సీఎంవో అధికారి హరికృష్ణ ట్వీట్ చేసి ఏబీఎన్ ను సవాల్ చేయడం అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. ఎప్పుడూ తన కథనాలతో షేక్ చేసే ఆంధ్రజ్యోతినే షేక్ చేసేలా సీఎంవో అధికారులు తొడగొట్టడం.. పత్రిక కు సవాల్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.