KCR-BJP: తెలంగాణ రాజకీయాలు కొత్త రంగును పులుముకుంటున్నాయి. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని కేంద్రహోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా పొలిటికల్ వాతావరణం మారిపోయింది. స్వయాన కేంద్రహోంశాఖ మంత్రి ప్రకటన చేశారంటే ఆయనకు ఉండే నెట్వర్క్ మాములుగా ఉండదు. దేశాన్ని పాలిస్తున్న వారికి రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఇంటెలిజెన్స్ వర్గాలు, సర్వే బృందాల ద్వారా ఆయనకు లీక్స్ వస్తుంటాయి. తాజాగా టీఆర్ఎస్ పార్టీ కూడా ముందస్తు కోసమే అన్నట్టు వడివడిగా అడుగులు వేస్తోంది. మొన్నటివరకు ప్రజలకు దూరంగా గులాబీ నేతలు ఒక్కసారిగా నియోజకవర్గాల్లో కేంద్రానికి వ్యతిరేకంగా ధర్నాలు, దీక్షల పేరుతో హడావుడి చేస్తున్నారు.

జనంలోకి కేసీఆర్..
ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. దీనిద్వారా ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీపై ఏమాత్రం వ్యతిరేకత ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లనని కేసీఆర్ చెప్పినా ఆయన్ను నమ్మేది లేదని ప్రతిపక్షాలు అంటున్నాయి. కేసీఆర్ వేసే ప్రతీ అడుగు ప్రతిపక్షాలను ఇరుకున పెడుతుంటాయి. గతంలో ముందస్తుకు వెళ్లిన కేసీఆర్ ప్రతిపక్షాలకు సమయం లేకుండా చేశారు. అభ్యర్థుల ఎంపికకే వారికి టైం సరిపోయింది. ప్రతిపక్షాలు ప్రచారం చేయడానికి పెద్దగా టైం ఇవ్వలేదు. అదే మరి కేసీఆర్ చాణక్య నీతి.. ఇప్పుడు కూడా ముందస్తుకు వెళ్లనని చెప్పి.. గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని, అభ్యర్థుల ఎంపిక మొత్తం పూర్తయ్యాక కేసీఆర్ సడన్‌గా ముందస్తు ప్రకటించే చాన్స్ ఉంది. అందుకోసం ఇప్పటినుంచే అభ్యర్థుల ఎంపిక కోసం టీఆర్ఎస్ కసరత్తు చేస్తోందని టాక్..
కేసీఆర్ కఠిన నిర్ణయాల కోసం వెయిటింగ్..
కేసీఆర్ పార్టీలో తీసుకునే కఠిన నిర్ణయాల కోసం బీజేపీ ఎదురుచూస్తోంది. ప్రస్తుతం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో 40 నుంచి 50 మందిపై ప్రజావ్యతిరేకత తీవ్రంగా ఉందని కేసీఆర్ చేయించిన సీక్రెట్ సర్వేల్లో వెల్లడైంది. దీంతో వచ్చే ఎన్నికల్లో వారికి టికెట్స్ ఇవ్వకూడదని కేసీఆర్ భావిస్తున్నారట.. ఆ టైం కోసమే బీజేపీ వెయిట్ చేస్తుంది.. రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీలో టికెట్స్ దక్కని వారిని పార్టీలో చేర్చుకుని టికెట్స్ ఇవ్వాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. అదే జరిగితే మొన్నటివరకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా చెలామణి అయిన వారంతా బీజేపీలో గుర్తుపై నిలబడతారు. వారికి ఉన్న బలమైన కేడర్ బీజేపీ కోసం పనిచేస్తుంది. ప్రజావ్యతిరేకత అనేది ప్రస్తుతం టీఆర్ఎస్ పై, కేసీఆర్ నిర్ణయాలపై ప్రధానంగా కనిపిస్తోంది. దీంతో బీజేపీ గుర్తుపై నిలబడితే టీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకత అనేది తమకు కలిసివచ్చే అవకాశం ఉందని ఆ పార్టీలో టికెట్ దక్కని నేతలు కూడా ఆలోచిస్తారని తెలుస్తోంది.
Also Read: వచ్చే ఎన్నికల్లో కేసీఆర్, జగన్‌కు ఎదురీత తప్పదా..?
కేంద్రహోమంత్రి అమిత్ షా కూడా ఇదే విషయంపై రాష్ట్ర బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారట.. వీలైనంత వరకు కీలక నేతలను పార్టీలో చేర్చుకోవాలని స్పష్టంచేశారట. అందుకే ప్రస్తుతం గులాబీ బాస్ పార్టీలో ఏ నిర్ణయం తీసుకున్నా అది బీజేపీకి ప్లస్ అవుతుందని రాజకీయాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. మరో ముఖ్యమైన విషయం ఎంటంటే.. ప్రస్తుతం బీజేపీకి 117 అసెంబ్లీ స్థానాల్లో కావాల్సిన అభ్యర్థులు కూడా కనిపించడం లేదు. అందుకే టీఆర్ఎస్ పార్టీలో టికెట్స్, పదవులు ఆశించి భంగపడిన ఉద్యమకారులు, సీనియర్ లీడర్లు, కీలకనేతలను బీజేపీ గుర్తుపై నిలబెట్టి వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందాలని కమలం నేతలు ఎదరుచూస్తున్నారు. సమీప భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల్లో ఇంకెన్ని మార్పులు చేటుచేసుకోనున్నాయో వేచి చూడాల్సిందే.
Also Read: కేసీఆర్ ముందస్తు: ఒకేదెబ్బకు రెండు పిట్టలు.. తెలంగాణలో అమిత్ షా ప్లాన్ ఇదే