https://oktelugu.com/

Vinesh Phogat : వినేశ్ ఫొగాట్ పై బీజేపీ కుస్తీ.. అంతిమంగా ఎవరు గెలుస్తారో?

అనుకున్నదే జరిగింది. వినేశ్ ఫొగాట్ కుస్తీ పోటీలకు శాశ్వత వీడ్కోలు పలికిన తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసింది. మరో మాటకు తావు లేకుండా కాంగ్రెస్ పార్టీలో చేరింది. త్వరలో తన సొంత రాష్ట్రం హర్యానాలో జరుగుతున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయనుంది. ఆమె జులానా సెగ్మెంట్ నుంచి బరిలో ఉంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 11, 2024 / 11:56 AM IST

    vinesh phogat and yogesh bairagi

    Follow us on

    Vinesh Phogat :  పారిస్ లో జరిగిన ఒలింపిక్స్ కుస్తీ పోటీలలో 50 కిలోల ప్రీ స్టైల్ విభాగంలో వినేశ్ ఫొగాట్ ఫైనల్ దాకా చేరింది. 100 గ్రాముల బరువు అధికంగా ఉండడంతో ఫైనల్ పోటీలలో తలపడే అవకాశాన్ని కోల్పోయింది. దీనిపై ఆమె అనే అనేక విధాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీంతో అప్పట్లోనే ఆమెకు వస్తే పోటీలకు శాశ్వతంగా వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించింది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించింది.. ఏకంగా పార్లమెంట్ ను స్తంభింపజేసింది. వినేశ్ ఫొగాట్ ఫైనల్ లో ఆడకుండా మోడీ ప్రభుత్వం కుట్రలు చేసిందని ఏకంగా రాహుల్ గాంధీ ఆరోపించారు. అప్పట్లో ఈ విషయం పెద్ద సంచలనంగా మారింది. దీనిపై బీజేపీ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. అయితే పారిస్ నుంచి ఇండియాకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎంపీ వినేశ్ ఫొగాట్ కు ఘన స్వాగతం పలికారు. ఆమె ఇంటి వరకు చేపట్టిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అప్పట్లోనే ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ ప్రముఖంగా ప్రస్తావించింది. తీరా కొద్ది రోజులకు వినేశ్ ఫొగాట్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంది. దీంతో విమర్శలు చేయడానికి బిజెపికి ఆయుధం లభించింది. ఇది ఇలా సాగుతుండగానే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో వినేశ్ ఫొగాట్ పేరు కూడా ఉండడం విశేషం. ఆమెను జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో నిలుపుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

    కుస్తీ పోటీకి బిజెపి సై

    వినేశ్ ఫొగాట్ జులానా నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న నేపథ్యంలో.. ఆమెపై పోటీగా యూత్ నాయకుడు, కెప్టెన్ యోగేష్ బైరాగి ని బిజెపి రంగంలోకి దింపింది. దీంతో ఆ నియోజకవర్గంలో వినేశ్ ఫొగాట్ వర్సెస్ యోగేష్ బైరాగి అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. మన వైపు హర్యానాలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా కొద్దీ ఇక్కడి రాజకీయాలు కొత్త రూపు దాల్చుతున్నాయి. అన్ని పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తున్నాయి. హర్యానా రాష్ట్రంలో మొత్తం 90 నియోజకవర్గాలున్నాయి. బిజెపి ఇటీవల 29 అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది. ఇందులో జులానా నియోజవర్గం నుంచి యోగేష్ బైరాగిని నిలబెట్టింది.

    గతంలో పైలట్ గా..

    యోగేష్ భారతీయ జనతా పార్టీ యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. బిజెపి స్పోర్ట్స్ సెల్ హర్యానా విభాగానికి కన్వీనర్ గా కొనసాగుతున్నారు. ఆయన గతంలో పైలెట్ గా పనిచేశారు. ఇక భారత జనతా పార్టీ ఇటీవల 67 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసిన సంగతి విధితమే. ఇక ఇటీవల పారిస్ ఒలంపిక్స్ లో కుస్తీ పోటీలలో అనర్హతకు గురైన వినేశ్ ఫొగాట్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఆమెకు ఫైనల్ ఆడే అవకాశం రాకపోవడంతో కుస్తీ పోటీలకు వీడ్కోలు పలికింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరి జులానా నియోజకవర్గ అభ్యర్థిగా ఎంపికయింది. ఇక ఆపట్లో రెజ్లర్ల ఆందోళన సమయంలో వినేశ్ ఫొగాట్ కు బజరంగ్ ఫునియా మద్దతుగా నిలిచారు. ఇటీవల వినేశ్ కాంగ్రెస్ లో చేరడంతో.. బజరంగ్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందు వారు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు రాజీనామా చేశారు.. బజరంగ్ ప్రస్తుతం ఆల్ ఇండియా కిసాన్ వర్కింగ్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఈ ఎన్నికల్లో వినేశ్ పోటీ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.