మమత బాటలో కమలం.. ఆ చాన్స్ ఇవ్వనంటున్న దీదీ..

దేశవ్యాప్తంగా పలుచోట్ల ఎన్నికలు జరుగుతున్నా.. ప్రజలందరి దృష్టి మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే ఉంది. దేశంలో అధికారంలో ఉన్న కమలం పార్టీకి.. పశ్చమ బెంగాల్ ను ఏలుతున్న తృణముల్ కాంగ్రెస్ కు పోటీ రోజురోజుకు తీవ్రతరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగల్ లో ఎన్నికలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. అయితే ఇప్పటికే మమతా బెనర్జీని తాము బలహీన పరిచినట్లు బీజేపీ భావిస్తోంది. ఎక్కువ మంది కమల దళంలో చేర్చుకోవడం ద్వారా మానసికంగా మమతా ఇబ్బంది పడుతుందని అనుకుంటున్నారు. […]

Written By: Srinivas, Updated On : April 6, 2021 12:41 pm
Follow us on

దేశవ్యాప్తంగా పలుచోట్ల ఎన్నికలు జరుగుతున్నా.. ప్రజలందరి దృష్టి మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే ఉంది. దేశంలో అధికారంలో ఉన్న కమలం పార్టీకి.. పశ్చమ బెంగాల్ ను ఏలుతున్న తృణముల్ కాంగ్రెస్ కు పోటీ రోజురోజుకు తీవ్రతరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగల్ లో ఎన్నికలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. అయితే ఇప్పటికే మమతా బెనర్జీని తాము బలహీన పరిచినట్లు బీజేపీ భావిస్తోంది. ఎక్కువ మంది కమల దళంలో చేర్చుకోవడం ద్వారా మానసికంగా మమతా ఇబ్బంది పడుతుందని అనుకుంటున్నారు. అయితే ఈ చేరికలు మమతా బెనర్జీకి ఎంతమేర కలిసి వస్తాయన్నదే ప్రశ్నగా వినిపిస్తోంది.

గతంలో వామపక్ష కూటమిని మమతా బెనర్జీ ఇలాగే దెబ్బతీశారు. ఆమె లెఫ్ట్ పార్టీపై అలుపెరగని పోరాటం చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ నేతలను ఎక్కువ సంఖ్యలో తమ పార్టీలో చేర్చుకోవడంలో సఫలీకృతం అయ్యారు. ఇప్పుడు బీజేపీ సైతం మమతా బాటలోనే నడుస్తోంది. అయితే ఇక్కడ మమతా బలహీన పడలేదు. నేతలు వెళ్లిపోయినంత మాత్రాన క్యాడర్, ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదన్న ఆత్మవిశ్వాసంతో మమత బెనర్జీ ఉన్నారు.

నిజానికి బీజేపీకి అంతకుముందు పశ్చిమ బెంగాల్ లో పెద్దగా బలం లేదు. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీలు బలహీనం కావడంతో బీజేపీకి పశ్చిమ బెంగాల్ లో రూట్ క్లియర్ అయ్యింది. అందుకే మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ రెండు స్థానాల నుంచి 18 స్థానాలకు ఎగబాకింది. దీంతో ఈ ఎన్నికల సమయంలో మమతా బెనర్జీ అప్రమత్తం అయ్యారు. ఆ 18 నియోజకవర్గాల పరిధిలో ఉన్న అసెంబ్లీపై దృష్టి పెట్టారు.

మరోవైపు కాంగ్రెస్, కమ్యునిస్టులు బలంగా ఉన్న చోట మమతా బెనర్జీ తన పార్టీ నుంచి బలహీనమైన అభ్యర్థులను బరిలో దింపారన్న విమర్శలు కూడా జోరుగానే వినిపిస్తున్నాయి. అక్కడ బీజేపీ నెగ్గకూడదన్న ఆలోచనతో మమతా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎన్నికల తరువాత అవసరం అయితే వామపక్షాలు, కాంగ్రెస్ తమకే మద్దతు ఇచ్చే అవకాశాలు ఉండడంతో బీజేపీ నెగ్గకుండా మమతా బెనర్జీ ఈ వ్యూహం పన్నుతున్నారని తెలిసింది. అయితే ఇలాంటి స్థానాలు అతికొద్దిగానే ఉన్నయాని అంటున్నారు.