Homeజాతీయ వార్తలుBJP History: బీజేపీ ప్రపంచంలోనే నంబర్ 1గా ఎలా ఎదిగింది?

BJP History: బీజేపీ ప్రపంచంలోనే నంబర్ 1గా ఎలా ఎదిగింది?

BJP History: స్వతంత్ర భారత దేశంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఒక చరిత్ర సృష్టించింది. వరుసగా నరేంద్రమోదీ ప్రధాని పదవి చేపట్టి జవహర్‌లాల్‌ నెహ్రూ రికార్డు సమం చేశారు. ఇక పదేళ్లు ఎలాంటి కుంభకోణాలు లేని పాలన అందించి మరో రికార్డు.. భారత దేశాన్ని 5వ ఆర్థిక శక్తిగా నిలిపి ఇంకో రికార్డు సృష్టించింది. తాజాగా మరో వరల్డ్‌ రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా గుర్తింపు పొందింది. 1951లో శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్‌తో మొదన బీజేపీ జాతీయవాద ఆలోచనలతో ఏర్పడిన జనసంఘ్, హిందుత్వ భావజాలం, భారతీయ సంస్కృతి ఆధారంగా రాజకీయ వేదికగా ఉద్భవించింది. 1980లో, జనసంఘ్‌ నుంచి కొంతమంది నాయకులు బీజేపీని స్థాపించారు, దీని గుర్తుగా కమలం పుష్పాన్ని ఎంచుకున్నారు. ఈ కమలం గుర్తు బీజేపీ సాంస్కృతిక, రాజకీయ గుర్తింపును సూచిస్తుంది.

బలమైన పునాది వేసిన వాజ్‌పేయి..
బీజేపీ చరిత్రలో అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఒక కీలక వ్యక్తిగా నిలుస్తారు. ఆయన దేశభక్తి, నాయకత్వ లక్షణాలు, సమర్థవంతమైన వాగ్ధాటితో పార్టీని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా చేశారు. ‘అంధేరా ఛటేగా, సూరజ్‌ నికలేగా, కమల్‌ ఖిలేగా‘ వంటి ఆయన కవితాత్మక వ్యాఖ్యలు పార్టీ కార్యకర్తలకు స్ఫూర్తినిచ్చాయి. వాజ్‌పేయి దేశ ప్రయోజనాలను పార్టీ ప్రయోజనాల కంటే ముందు ఉంచిన నాయకుడు. ఆయన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి, దేశ సేవకు అంకితమయ్యారు. ఆయన నాయకత్వంలో బీజేపీ 1998–2004 మధ్య మొదటిసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది, ఇది పార్టీకి ఒక మైలురాయి.

కష్టాల నుంచి శక్తిగా ఎదుగుదల
వాజ్‌పేయి యుగం తర్వాత, బీజేపీ అనేక సవాళ్లను ఎదుర్కొంది. 2004, 2009 ఎన్నికల్లో ఓటములతో పార్టీ బలహీనపడింది. సరైన నాయకత్వం లేక పార్టీ కష్టాల్లో కూరుకుపోయింది. ఈ సమయంలో అమిత్‌ షా, నరేంద్ర మోదీ వంటి నాయకులు పార్టీని పునరుద్ధరించేందుకు ముందుకొచ్చారు. అమిత్‌ షా వ్యూహాత్మక నాయకత్వం, మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా అనుభవం కలిసి, బీజేపీని 2014 ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించేలా చేశాయి. ఈ విజయం బీజేపీని జాతీయ రాజకీయాల్లో ఒక శక్తివంతమైన శక్తిగా నిలబెట్టింది.

ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా..
నేడు, బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా గుర్తింపు పొందింది, దీనికి 14 కోట్ల మంది సభ్యులు, 2 కోట్ల మంది క్రియాశీల కార్యకర్తలు ఉన్నారని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. 240 పార్లమెంటు సభ్యులు, 1,500 శాసనసభ సభ్యులు, 170 శాసనమండలి సభ్యులతో, బీజేపీ భారత రాజకీయ వ్యవస్థలో ఆధిపత్యం చెలాయిస్తోంది. 20కి పైగా రాష్ట్రాల్లో పార్టీ బలమైన ఉనికిని కలిగి ఉంది, ఇది దాని విస్తృతమైన సంస్థాగత నిర్మాణాన్ని సూచిస్తుంది.

మోదీ యుగం..
2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత, బీజేపీ అనూహ్యమైన వృద్ధిని సాధించింది. జమ్మూ–కశ్మీర్‌లో 370 అధికరణ రద్దు, రామ మందిర నిర్మాణం, ట్రిపుల్‌ తలాక్‌ నిషేధం, వక్ఫ్‌ చట్టంలో సవరణలు వంటి ముఖ్యమైన నిర్ణయాలు యువతలో బీజేపీపై ఆకర్షణను పెంచాయి. ఈ నిర్ణయాలు దేశ భద్రత, సాంస్కృతిక గుర్తింపు, ఆర్థిక పురోగతికి బీజేపీ నిబద్ధతను చాటాయి. భారతదేశాన్ని నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చిన ఘనత కూడా మోదీ ప్రభుత్వానికి దక్కింది.

జనసంఘ్‌ నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిన బీజేపీ ప్రయాణం దాని స్థిరత్వం, వ్యూహాత్మక దృష్టిని సూచిస్తుంది. శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ, అటల్‌ బిహారీ వాజ్‌పేయి, అమిత్‌ షా, నరేంద్ర మోదీ వంటి నాయకుల ద్వారా, బీజేపీ భారత రాజకీయాల్లో అజేయ శక్తిగా మారింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular