Mirai vs Vishwambhara similarities: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కారణం ఏంటి అంటే వాళ్ల సినిమాలను చూడడానికే ప్రేక్షకులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ల సినిమాలు రిలీజ్ అయిన రోజు వాళ్ళ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకుల్లో కూడా ఒక పండగ వాతావరణం అయితే నెలకొంటుంది. ఒకప్పుడు పెద్ద సినిమా రిలీజ్ అవుతోంది అంటే ప్రేక్షకుల్లో చాలా మంచి హైప్ ఉండేది. ఈ మధ్యకాలంలో కొంతవరకు తగ్గింది. అయినప్పటికి స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు మాత్రం ఆ ఫీవర్ అప్పుడప్పుడు కనిపిస్తోంది. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది టాప్ లెవల్ కి వెళ్ళిపోయింది. కాబట్టి మన నుంచి వచ్చే కాన్సెప్ట్ లు సైతం పాన్ ఇండియా ప్రేక్షకులను మెప్పించే రేంజ్ లో ఉండాలి అనే ఉద్దేశ్యంతో సగటు దర్శకులందరు మంచి కాన్సెప్ట్ లను సినిమాలుగా ఎంచుకొని ముందుకు తీసుకెళుతుండడం విశేషం… తేజ సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం లో వచ్చిన మిరాయి సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది. అయితే ఈ సినిమా రీసెంట్ గా రిలీజై సక్సెస్ ఫుల్ టాక్ తో ముందుకు దూసుకెళ్లడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి.
మరి ఇలాంటి సందర్భంలో ‘మిరాయి’ సినిమా కథకి చిరంజీవి హీరోగా వస్తున్న ‘ విశ్వంభర ‘ కి సినిమా కథకి మధ్య చాలా దగ్గర పోలికలు ఉన్నాయంటూ కొంతమంది కొన్ని కామెంట్స్ అయితే చేస్తున్నారు. మిరాయి సినిమా అశోకుడు తన శక్తులను 9 గ్రంథాల్లో పొందుపరిచాడు. ఆ గ్రంథాలను దుష్టశక్తులకు చిక్కకుండా అడ్డుకోవడమే హీరో పనిగా సినిమా అయితే తెరకెక్కింది.
కానీ విశ్వంభర సినిమా మాత్రం ఒక యుగానికి మరో యుగానికి మధ్య కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. మరి ఈ రెండింటి మధ్య బ్యాడ్రాప్ వేరైనప్పటికి కథ మాత్రం ఒక్కటే అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇంతకుముందు చిరంజీవి విశ్వంభర సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ లో చిరంజీవి రెక్కల గుర్రం మీద ఎక్కి స్వారీ చేస్తూ వచ్చాడు.
ఇక మిరాయి సినిమాలో కూడా వాటి మీద వస్తాడు ఈ రెండింటి పోలికలను బట్టి చూసినా కూడా ఈ రెండింటి మధ్య చాలా దగ్గర పోలికలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి… అయితే విశ్వంభర సినిమాలో రాక్షసుల నుంచి ధర్మాన్ని కాపాడటమే హీరో ధ్యేయంగా తెలుస్తోంది…ఇక కథలు ఒకేలా ఉన్న కూడా దాని ప్రజెంటేషన్ బాగుంటే అన్ని సినిమాలు బాగా ఆడుతాయి…