Telangana Election Results 2023: నవంబర్ 30వ తేదీన తెలంగాణలో జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఫలితాలలో కనీ వినీ ఎరగని రీతిలో అద్భుతాలు జరుగుతున్నాయి…ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తన సత్తా చాటుతూ భారీ సీట్లను గెలుచుకుంటూ ముందుకు సాగుతోంది. ఇక ఇంతకుముందు అధికార పార్టీ ప్రతినిధులుగా కొనసాగుతున్న కెసిఆర్ కి టిఆర్ఎస్ పార్టీకి షాక్ ఇస్తూ కాంగ్రెస్ తనదైన రీతిలో అత్యధిక సీట్లు గెలుస్తు ముందుకు దూసుకెళ్తుంది.ఇక ఈ క్రమంలోనే బిజెపి పార్టీ శ్రేణుల్లో గాని, బిజేపీ కార్యకర్తలు గాని కాంగ్రెస్ గెలుపుని జీర్ణించుకోలేకపోతున్నారు. నిజానికి పది సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో విసిగిపోయిన జనాలు వాళ్ళకి ఆల్టర్నేట్ గా బిజెపిని ఎంచుకోవాలని చూశారు. ఎందుకంటే 2018 ఎలక్షన్స్ తర్వాత బిజెపి పార్టీ తెలంగాణ స్టేట్ అధ్యక్షుడి గా బండి సంజయ్ ని బిజెపి హై కమాండ్ ప్రకటించి మంచి పని చేసింది. ఆ ఎలక్షన్స్ లో బిజెపి ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది దాంతో బండి సంజయ్ ఎంపీగా గెలిచి స్టేట్ అధ్యక్షుడిగా నియామకం అయిన తర్వాత ఒక్కసారిగా తెలంగాణలో బిజెపి జెండా బలంగా ఎగిరింది.
అలా చాలా మంది రాజకీయ నాయకులతోపాటు ప్రజలు కూడా కెసిఆర్ చేసే అరాచకాలని అంత మొందించడానికి బిజెపి నే మనకు అనుకూలమైన పార్టీ అని ఆ పార్టీ వైపు మొగ్గు చూపారు.ఇక ఈ దశలోనే బండి సంజయ్ చేసిన చాలా కార్యక్రమాలు జనాల్లో చాలా ఇంపాక్ట్ ని చూపించాయి. ఇక ఈసారి ఈజీగా బిజెపి ఎక్కువ సీట్లను గెలుచుకొని తనదైన రీతిలో గవర్నమెంట్ ని ఫామ్ చేస్తుంది అనే ఉద్దేశ్యం లో ప్రతి కార్యకర్త గాని జనాలు గాని ఒక మంచి అభిప్రాయం లో ఉన్నప్పుడు. బిజెపి హై కమాండ్ ఏం ఆలోచించిందో ఏమో తెలీదు గానీ మళ్ళీ బిఆర్ఎస్ ని గెలిపించే కుట్ర చేసి బండి సంజయ్ లాంటి ఒక బలమైన ప్రెసిడెంట్ బిజెపి పార్టీలో ఉంటే అతను బిఆర్ఎస్ పార్టీతో పొత్తుకు సహకరించడు కాబట్టి అతనిని తప్పించాలి అనే ఒక కుట్ర అయితే చేసింది. ఇక అందులో భాగంగానే అతన్ని పక్కన పెట్టి అతని ప్లేస్ లో కిషన్ రెడ్డిని బిజెపి పార్టీ ప్రెసిడెంట్ గా నియమించింది. ఇక దాంతో బిజెపి బిఆర్ఎస్ రహస్యపు ఒప్పందం తెలుసుకున్న కార్యకర్తలు గాని అందులో ఉన్న లీడర్లు గాని అందరూ బిజెపి నుంచి బయటికి వచ్చి ఆల్టర్నేట్ గా ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు…
అయితే బిజెపి ఏం ప్లాన్ చేసిందంటే బిజెపి కి బిఅర్ఎస్ కి మధ్య టఫ్ ఫైట్ అయితే అది కాంగ్రెస్ కి ప్లస్ అవుతుంది దానివల్ల తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అలా చేస్తే సెంట్రల్ లో వాళ్ళకి ఇబ్బంది అవుతుందని అనుకున్నారు.ఆ ఆలోచనలో ఉండి బిఆర్ఎస్ తో రహస్యపు ఒప్పందాన్ని కుదుర్చుకొని వాళ్లని హైలెట్ చేసి మళ్ళీ వాళ్ళకే అధికారాన్ని కట్టబెట్టే ప్రయత్నం చేశారు. కానీ 10 సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో మగ్గిపోయిన జనం ఇక బిఆర్ఎస్ నుంచి వాళ్ళకి విముక్తి కల్పించే పార్టీ బిజెపి పార్టీ అనుకున్నప్పటికీ ఈ రెండు పార్టీలు ఒకటే అని తెలిసిన తర్వాత అందరూ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. దాని ప్రభావం వల్లే ఇప్పుడు కాంగ్రెస్ విజయం సాధించిందని తెలుస్తుంది…
అలా కాకుండా బిజెపి బండి సంజయ్ కి పూర్తి ఫ్రీడమ్ ఇచ్చి అతన్ని మళ్లీ అధ్యక్షుడిగా కంటిన్యూ చేసినట్టు అయితే తప్పకుండా ఇప్పుడు ఎలాగైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ని ఫామ్ చేయబోతుందో, అదే రీతిలో బిజెపి కూడా గవర్నమెంట్ ని ఫామ్ చేసేది. అనవసరమైన పోకడలకి పోయి బండి సంజయ్ ని పక్కన పెట్టారు దాని ఫలితంగా ఇప్పుడు బిజెపి పార్టీలో కీలక నేతలుగా ఉన్న అరవింద్,రఘు నందన్ రావు, బండి సంజయ్,ఈటెల రాజేందర్ లాంటి వారు కూడా ఓటిమి పాలవడానికి కారణం అవుతున్నారు…ఇక్కడ బిఆర్ఎస్ పార్టీకి సరైన ప్రతిపక్షం లేకపోయిన కూడా ఆ పార్టీ అధికారులతో వాళ్ల పాలన తో విసిగిపోయిన జనమే ప్రతిపక్షంగా మారి వాళ్లకి కావాల్సిన పార్టీని వాళ్ళే గెలిపించుకున్నారు. ప్రతిపక్షం ఫెయిల్ అయిన చోట జనాలే ప్రతిపక్షం గా అవతరిస్తారు అనడానికి ఈ కాంగ్రెస్ గెలుపును ఒక ఉదాహరణగా చెప్పవచ్చు…