Legendary Directors Of Tollywood: థియేటర్ లో వెల్లకిలా పడుకొని తెర వైపు చూస్తూ ఉంటే.. క్రమక్రమంగా జీవితంలో జరిగిన సంఘటనలు, తాను తీసిన అనేక సినిమాల తాలూకు జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తూ ఉన్నాయి. సినిమాలు అంటే తనకు ప్రాణం.. కానీ, ఇప్పుడు ఏ సినిమా చూడలేక లోలోపల సతమవుతూ ఉన్నాడు. తన తోటి దర్శకులంతా క్రమక్రమంగా తగ్గిపోతూ ఉన్నారు. మరోపక్క తనను ‘అరే, ఒరేయ్’ అని పిలిచే స్నేహితులొక్కొక్కరూ రాలిపోతూ ఉన్నారు.
ఒకప్పుడు తాను కాలు బయట పెడితే.. పాదాలు మొక్కడానికి క్యూలో ఉన్న జనం, ఇప్పుడు పిలిచినా పలకట్లేదు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి.. ఆ వెలుగుల మాయ లోకంలో ఫేడ్ అవుట్ అయిపోయిన ప్రతి లెజెండరీ సీనియర్ దర్శకుల మనోగతం ఇది. తన అండగా ఉన్న గురువులు ఎప్పుడో తనని వదిలేసి వెళ్ళిపోయారు. బయటకు రాలేని నిస్సహాయతతో తన తోటి దర్శక స్నేహితులు ఇళ్ళల్లోనే జ్ఞాపకాలతో మగ్గిపోతున్నారు. కానీ, తనకు మాత్రం ఇంకా సినిమా చేయాలని ఘాడమైన కోరిక ఉంది. సాధ్యం అవుతుందా ?
Also Read: Best Dialogues From KGF Series: `కేజీఎఫ్` సిరీస్ నుంచి వచ్చిన బెస్ట్ డైలాగ్స్
తన ముందు నిక్కర్లేసుకుని తిరిగిన తన చేత తిట్లు తిన్న అసిస్టెంట్ డైరెక్టర్లు.. ఈ రోజు పెద్ద పెద్ద డైరెక్టర్లు. ఏ ఫంక్షన్ లోనే వాళ్ళంతా కనబడి తన చుట్టూ చాలా హడావిడిగా తిరుగుతూ పలకరిస్తూ వెళ్తున్నారు. వారిలో కొంతమందికి తనతో మాట్లాడే సమయం కూడా లేదు. తన దగ్గర జాయిన్ అవ్వడానికి వాళ్ళు పడిన పాట్లు తనకు చిన్నగా గుర్తుకొచ్చి నవ్వుకున్నాడు. కానీ.. ఈ రోజు తనను వాళ్ళు పట్టించుకోవడం లేదు. తనకు కాలం విలువ మరోసారి తెలిసొచ్చింది.
తన జీవితంలో తాను ఎన్నో విజయాలు సాధించి ఉండవచ్చు, తన దర్శకత్వ ప్రతిభ, కీర్తి నాలుగు దిక్కులా ప్రసరించి ఉండొచ్చు.. కానీ దాన్ని నేడు ఎవరూ గుర్తించే స్థితిలో లేరు. తన నుంచి హిట్ సినిమాలు రావడం ఆగిపోయిన క్షణం నుంచే.. తన మీద స్పాట్‌లైట్ ప్రసరించటం మానేసి చాలా కాలం అయిపోయింది. ఈ సినీ ఇండస్ట్రీ తన గురించి పట్టించుకోవటం మానేసి చాలా కాలం అయిపోయింది.
అయినా సినిమా చేయాలనే తపన తనలో ఇంకా రగులుతూనే ఉంది. దాహంతో దూరంగా ఎక్కడో ఒక కాకి కావుమని అరుస్తూ ఉంటుంది కదా.. అలాగే ప్రతి సీనియర్ దర్శకుడు మరోసారి వెండితెర పై మ్యాజిక్ చేయాలని తనలో తానే ఆశ పడుతూ ఉంటాడు. తనలాంటి దర్శకుల గురించి తానే అనుకున్న మాట ఇది. కానీ తమ కోరిక సాధ్యం అవుతుందా ?
వయసు అయిపోయిన డైరెక్టర్ వి.. నిర్మాతలు నిన్ను నమ్ముతారా ? అంటూ తనవాళ్ళే తనను అనుమానించారు మరి. ఒక విధంగా ఇదే నిజం ఏమో. తాను అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడితినే పట్టించుకోని నిర్మాతలు.. రోజూ తన దగ్గరకు వచ్చి కథా చర్చల్లో ఎందుకు కూర్చుంటారు ? అసలు తన అమూల్యమైన అనుభవాన్ని, అభిప్రాయాన్ని ఈ డిజిటల్ జనరేషన్ ఎందుకు పట్టించుకుంటుంది ?
అర్ధరాత్రి ఏ నొప్పితోనో తనకు మెలకువ వచ్చి అరిచినా.. పక్కగదిలో ఉన్న తన పిలల్లు నిద్రాభంగానికి ఆసక్తి చూపించడం లేదు. ఇక బయట వ్యక్తులు తన ఆలోచనలను ఎందుకు నమ్మాలి. రోజూ ఇలాగే ఆలోచిస్తూ ఆలోచిస్తూ జ్ఞాపకాల్లో బతకడం జీవితంలో భాగమైపోయింది. ప్రస్తుతం ప్రతి సీనియర్ దర్శకుడు పరిస్థితి ఇదే. హే.. ? ఏ.. సింగీతం శ్రీనివాసరావు లాంటి లెజండరీ దర్శకుడికి ఎందుకు అవకాశాలు ఇవ్వకూడదు. సినిమా ఛాన్స్ కోసం ఆయన ఈ వయసులో కూడా ఆఫీస్ ల చుట్టూ తిరగడం ఎంత బాధాకరమైన విషయం. నిర్మాతల్లారా ఆలోచించండి.
Also Read: SS Rajamouli First Movie: రాజమౌళి మొదటి సినిమా ఏదో తెలుసా.. విడుదలకు నోచుకోలేదు..
Recommended Video: