Atmakur By-election : నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బీజేపీ జోరుగా ప్రచారం చేస్తోంది. అభ్యర్థి గెలుపు కోసం హేమాహేమీ నాయకులంతా బరిలోకి దిగారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డా. పార్థసారథి గడపగడపకు తిరుగుతూ వైసీపీ అబద్దాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. ఈక్రమంలోనే ఓటర్లకు జగన్ లేఖల పేరిట చేస్తున్న రాజకీయాన్ని ఎండగడుతున్నారు.
వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లు పంచుతున్న లేఖలను బీజేపీ నేత పార్థసారథి స్వాధీనం చేసుకొని మీడియా ముందు ఎండగట్టారు. సలోమీ అనే మహిళకు సీఎం జగన్ మోహన్ రెడ్డి పేరిట పంపిణీ చేసిన లేఖను చదివి వినిపించి మీడియా సాక్షిగా లోపాలు ఎత్తిచూపారు.
వైఎస్ఆర్ చేయూత పథకం కింద రూ.37500 ఇచ్చానని.. పాస్టర్లకు సహాయం కింద రూ.5వేలు ఇచ్చానని.. మొత్తం కలిపి రూ.42500 ఇచ్చానని.. కాబట్టి మీరు నాకు ఓటు వేయండి అని ఈ ఉత్తరం సారాంశం. ఎంత నవ్వులపాలైన ఈ పథకాల గురించి జగన్ లేఖలో సమర్థించుకోవడం చూసి అంతా అవాక్కైన పరిస్థితి నెలకొందని పార్థసారథి విమర్శించారు.
చిన్న, వీధి వ్యాపారులకు ఒక్క రూపాయి ఇవ్వని వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఇంటికి కొంత డబ్బు పంచితే వారికి ఉపాధి లభిస్తుందా? అని పార్థసూారథి ప్రశ్నించారు. పాస్టర్లకు రూ.5వేలు ఇచ్చి హుండీల్లో డబ్బులు వేస్తున్న హిందువుల సొమ్మును ఎటు మళ్లిస్తున్నారని ప్రశ్నించారు. హిందువుల సొమ్మును పాస్టర్లకు, మసీదుల్లోని వారికి ఇస్తున్నారని ప్రశ్నించారు.
నవరత్నాలను అమలు చేస్తున్న జగన్ సర్కార్ వాటన్నింటిని నరేంద్రమోడీ అమలు చేసిన పథకాలేనని పార్థసారథి చెప్పుకొచ్చారు. మోడీ పథకాలనే మార్చి వేస్తున్నారని విమర్శించారు. గ్రామ సచివాలయాలు, ఇంగ్లీష్ మీడియం సహా రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్, గ్రంథాలయాలు కట్టానంటున్న జగన్ మోహన్ రెడ్డి అవన్నీ గ్రామాల అభివృద్ధి కోసం మోడీ సర్కార్ అమలు చేస్తున్న పథకాలని పార్థసారథి స్పష్టం చేశారు.
వైసీపీ అబద్ధాలను ప్రచారం చేస్తోందని.. మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలనే రాష్ట్రంలో పేరు మార్చి ఇక్కడ అమలు చేస్తున్నారని పార్థసారథి విమర్శించారు. హక్కుగా రావాల్సిన బీసీ, ఎస్సీల నిధులు కాజేసి వాళ్లకు పదవులు ఇచ్చి ఉద్దారించామంటున్న వైసీపీ సర్కార్ అబద్ధాలను ప్రజల ముందు ఉంచారు డా.పార్థసారథి. బీసీలు సర్పంచ్ లు, ఎంపీటీసీలు కాకుండా న్యాయంగా 33శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా కేవలం 18శాతానికి తగ్గించి వారికి పదవులు దక్కకుండా అడ్డుకున్నది వైసీపీ ప్రభుత్వం అని డా.పార్థసారథి విమర్శించారు.
వైసీపీ అబద్ధాలపై ప్రజల్లోకి తీసుకెళ్లి డా. పార్థసారథి ఎండగట్టారు. ప్రతీ పథకాన్ని వివరిస్తూ అందులోని లోటుపాట్లు ఎత్తిచూపుతూ కడిగిపారేశారు. ఆయన ప్రచారానికి సంబంధించిన పూర్తి వీడియోను కింద చూడొచ్చు.