Rashi Khanna In Short Middy: వరల్డ్ ఫేమస్ లవర్ రిజల్ట్ తో బోల్తా పడ్డ రాశి ఖన్నా మరలా ట్రాక్ లోకి వచ్చింది. తెలుగులో ఆఫర్స్ దక్కించుకుంటూ సత్తా చాటుతుంది. 2019 రాశికి బాగా కలిసొచ్చింది. ఆ ఏడాది ప్రతిరోజూ పండగే, వెంకీ మామ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది. అయితే బోల్డ్ అటెంప్ట్ వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ అమ్మడు కెరీర్ ని తిరగేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్ ప్లాప్ టాక్ తెచ్చుకుంది.

ఆ చిత్రంలో విజయ్ దేవరకొండతో కలిసి శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించింది. అలాంటి సన్నివేశాల్లో నటించడం ఆమె కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపింది. ఆ దెబ్బతో తెలుగులో ఆఫర్స్ ఆగిపోయాయి. అయితే తమిళంలో టైర్ టు హీరోల పక్కన ఆఫర్స్ దక్కాయి. విజయ్ సేతుపతికి జంటగా తుగ్లక్ దర్బార్, ఆర్య తో ఆర్నమనై 3 చిత్రాల్లో నటించారు. అలాగే అంధాదున్ మలయాళ రీమేక్ భ్రమమ్ మూవీ చేశారు రాశి.

కెరీర్ గ్రాఫ్ పడిపోయింది అనుకుంటే రాశి అనూహ్యంగా పుంజుకుంది. తెలుగులో రెండు, తమిళ్ లో రెండు, ఓ హిందీ చిత్రం ప్రకటించారు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య నటిస్తున్న థ్యాంక్యూ మూవీలో రాశి ఖన్నా మెయిన్ హీరోయిన్. అవికా గోర్ మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక గోపీచంద్ కి జంటగా పక్కా కమర్షియల్ మూవీ చేస్తున్నారు. దర్శకుడు మారుతీ తెరకెక్కించిన ఈ చిత్రం జులై 1న విడుదల కానుంది.

ఇక రాశి ఖాతాలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ యోధ. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ఈ హిందీ యాక్షన్ ఎంటర్టైనర్ లో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. దిశా పటాని మరో హీరోయిన్. కెరీర్ ఇలా జోరందుకోగా సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది భామ. తాజాగా షార్ట్ మిడ్డీ ధరించి సూపర్ హాట్ ఫోజులతో టెంపరేచర్ పనిచేసింది. అమ్మడు గ్లామర్ ఓవర్ డోస్ దెబ్బకు కుర్రాళ్లు బేజారు అవుతున్నారు. రాశి ఖన్నా లేటెస్ట్ ఫోటోస్ వైరల్ గా మారాయి.
Also Read: Star Comedian Insulted Chiranjeevi: చిరంజీవి ని ఘోరంగా అవమానించిన స్టార్ కమెడియన్