BJP Devi sri Prasad : హిందూ సమాజానికి దేవీశ్రీ ప్రసాద్ క్షమాపణ చెప్పాల్సిందే.. బీజేపీ డిమాండ్

BJP Devi sri Prasad : ఇటీవల కాలంలో హిందూ మతంపై ఎన్నో విధాలుగా దుష్ర్పచారాలు సాగుతున్నాయి. కావాలని చేస్తున్నారా? లేక తెలియక చేస్తున్నారా? అనే సందేహాలు వస్తున్నాయి. వారు ఏమి తెలియని వారంటే ఏదో క్షమించొచ్చు. కానీ మంచి స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా బరితెగించి మన దేవుళ్ల గీతాలను పక్కదారి పట్టిస్తూ అర్థం మారేలా చేయడం క్షమించరాని నేరం. మన మనోభావాలను దెబ్బతీసే వారు ఎంతటి వారైనా వారిని ఉపేక్షించొద్దనే వాదనలు వస్తున్నాయి. ఈ […]

Written By: Srinivas, Updated On : November 4, 2022 7:15 pm
Follow us on

BJP Devi sri Prasad : ఇటీవల కాలంలో హిందూ మతంపై ఎన్నో విధాలుగా దుష్ర్పచారాలు సాగుతున్నాయి. కావాలని చేస్తున్నారా? లేక తెలియక చేస్తున్నారా? అనే సందేహాలు వస్తున్నాయి. వారు ఏమి తెలియని వారంటే ఏదో క్షమించొచ్చు. కానీ మంచి స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా బరితెగించి మన దేవుళ్ల గీతాలను పక్కదారి పట్టిస్తూ అర్థం మారేలా చేయడం క్షమించరాని నేరం. మన మనోభావాలను దెబ్బతీసే వారు ఎంతటి వారైనా వారిని ఉపేక్షించొద్దనే వాదనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలను జాగృతం చేసే పాటలకు బదులు మన దేవుళ్ల పాటలను వక్రీకరిస్తూ హేళనకు గురవుతున్నారు.

మన చలనచిత్ర రంగంలో సంగీత దర్శకులకు విశిష్ట స్ధానం ఉంటుంది. వారు అందించే ట్యూన్లకు ప్రజలు ఫిదా అవుతుంటారు. కానీ ఇటీవల కాలంలో సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాడు. గతంలో పుష్ప సినిమాలో ఓ దేవుడి పాటను విపరీతార్థం వచ్చేలా చేశారనే అపవాదు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కూడా ఆయన మరోమారు వివాదంలో చిక్కుకున్నాడు. *హరే రామ హరే రామ రామ రామ హరే@ అనే పాటను బీచ్ లో గుడ్డలు లేకుండా మోడల్స్ తో కలిసి చిందులేసిన వైనం వివాదాస్పదమైంది. ఈ పాటను అశ్లీలం చిత్రీకరించి విడుదల చేయడంతో దేవీశ్రీపై హిందుత్వ వాదులు మండిపడుతున్నారు.

కచ్చితంగా ఆ పాట సినిమాలో ఉండకుండా చూడాలని.. దేవీశ్రీ ప్రసాద్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందేనని తాజాగా ఏపీ బీజేపీ నేత డా.పార్థసారథి డిమాండ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా హిందువులు పవిత్రంగా భావించే ‘హరేరామ హరే కృష్ణ మంత్రాన్ని’ ఐటెం సాంగ్ ల్లో చూపిస్తూ బికినీ మోడల్స్ తో కలిసి అసభ్యంగా నృత్యాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పార్థసారథి తెలిపారు. వివాదాస్పద ఇస్లాం రచయిత రక్కీ పాదం రాసిన ఈ పాట హిందూ మనోభావాలు దెబ్బతీసేలా ఉందని.. ఇది దుర్మార్గమైన విషయమన్నారు. ఇంతుకుముందు కూడా ఇదే దేవీశ్రీ ‘అన్నమయ్య కీర్తనలు, శ్రీ వేంకటేశ్వర కీర్తనలను భక్తి పాటలను ఐటెం సాంగ్ లలో పెట్టారని విమర్శించారు. పుష్పలోని ‘ఊ అంటావా’ అనే పాటలోనూ వేంకటేశ్వర స్వామి భక్తి పాటను ఇన్ వాల్వ్ చేశాడని నిప్పులు చెరిగారు.

హిందూ దేవుళ్ల గురించి ఇలా పాడుతున్న దేవీ శ్రీ.. ఇస్లాం, క్రైస్తవుల గురించి ఇలానే ఐటెం సాంగ్ లాగా పాడగలిగే దమ్ముందా? అని పార్థసారథి సవాల్ చేశారు. హిందువుల సహనశీలతను ప్రశ్నిస్తూ ఈయన చేసే పాటలను అందరూ ఖండించాలని పిలుపునిచ్చాడు. వెంటనే ఈ పాటను డిలీట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వెంటనే క్షమాపణ చెప్పాలని.. ఇలాంటి పనులు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో దేవీశ్రీ ప్రసాద్ తీరుకు అందరు మండిపడుతున్నారు. సినిమాలు ప్రజలను చైతన్యవంతులను చేయాలే కానీ ఇలా చేయకూడదని హితవు పలుకుతున్నారు.

హిందూ సమాజాన్ని కలుషితం చేయాలనే విధంగా కొందరు కంకణం కట్టుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. భగవత్ నామాలను పెడర్థం వచ్చేలా చేయడం వారికి ఎవరు నేర్పారు? అదే ఇతర మతాల వారిని అలా చేస్తారా? మన మీద ఎందుకంత నిర్లక్ష్యం. మతాన్ని సర్వనాశనం చేసే విధంగా చర్యలు తీసుకోవడం విడ్డూరమే. దేవీశ్రీ ప్రసాద్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలనే వాదనలు కూడా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.