BJP Big Strategy: బీజేపీ వ్యూహం మారుతోంది. అధికారమే లక్ష్యంగా దూసుకుపోతోంది. దక్షిణాదిలో తన ప్రస్థానం కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందులో భాగంగా తన ప్రణాళికలకు పదును పెడుతోంది. దీంతో దేశంలో ఉత్తరాదిపైనే కాకుండా దక్షిణాదిపై కూడా పట్టు నిలుపుకోవాలని అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అధికారం కోసం అన్ని ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో జులై ఒకటి నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలని సంకల్పించింది. దీని కోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. పనిలో పనిగా తమ పార్టీ ఉద్దేశాలను తమ అనుచరులకు తెలియజేసేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది.
హైదరాబాద్ మహానగరం రోజురోజుకు విస్తరిస్తున్న మహానగరం కావడంతో ఇక్కడ బీజేపీ బలం పుంజుకోవాలని చూస్తోంది. ఇందుకు గాను పక్కా ప్రణాళికలు రచిస్తోంది. నగరంలో నిర్వహించే జాతీయ కార్యవర్గ సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. ప్రధాని మోదీతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్య నేతలు వస్తుండటంతో వారితో తమ ప్రాంతానికి చెందిన వారితో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి వారిలో బీజేపీ విధానాలు, లక్ష్యాలు తెలియజేసేందుకు నిర్ణయించింది.
Also Read: BJP Target On KCR: టార్గెట్ కేసీఆర్ బీజేపీ నాయకుల లక్ష్యం ఇదేనా?
నగరంలో అన్ని రాష్ట్రాలకు చెందిన వారికి ఆవాసయోగ్యం కావడంతో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఇక్కడ చాలా మందే ఉన్నారు. దీంతో వారిని పార్టీకి అనుకూలంగా మలుచుకునేందుకు ప్లాన్ చేస్తోంది. ఒక్కో రోజు కొన్ని రాష్ట్రాల ప్రజలతో సమావేశాలు నిర్వహించి వారిలో పార్టీకి విధేయులుగా మలుచుకోవాలని ఉద్దేశిస్తున్నారు. దీనిలో భాగంగా బీజేపీ సంస్థాగతంగా మార్పులు తీసుకురావాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. పలు రాష్ట్రాల ప్రజలతో ముఖాముఖి చర్చించి వారిని తమ పార్టీకి ఓటు వేసేలా చేయాలని నిర్ణయం తీసుకుందని చెబుతున్నార. ఈ మేరకు ఇప్పటికే నేతలకు ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం.
ఏ రాష్ట్రానికి చెందిన వారికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో భేటీ నిర్వహించి వారిని బీజేపీకి మద్దతుదారులుగా చేసుకునేందుకు ముందుకు కదులుతున్నట్లు చెబుతున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావాలని శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. దీనికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. భవిష్యత్ లో బీజేపీకి ఎదురు లేకుండా చేయాలనే దృఢ సంకల్పతో బీజేపీ నేతలు ఉన్నట్లు తెలిసిందే. సమావేశాల నిర్వహణ విజయవంతంగా సాగాలని పార్టీ నేతలకు ఆదేశాలు వెళ్లాయి. భారీగా జనసమీకరణ చేసి ప్రత్యర్థి పార్టీలకు మింగుడుపడకుండా చేయాలని కృతనిశ్చయంతో ఉన్నట్లు చెబుతున్నారు.
దక్షిణాదిలో బీజేపీ తిరుగులేని శక్తిగా అవతరించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ ఇదివరకే ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం నిర్వహించే జాతీయ కార్యవర్గ సమావేశాలను దిగ్విజయం చేసి ప్రత్యర్థి పార్టీలకు సవాలు విసరాలని భావిస్తున్నట్లు సమాచారం.
Also Read:Fadnavis as The CM Of Maharashtra: మహా’ సీఎంగా రేపు ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం..?