https://oktelugu.com/

ఏపీ ప్రభుత్వానికి బీజేపీ బిగ్ షాక్..

తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ధర్మచార్యుల పర్యవేక్షణలోకి తీసుకువస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. అయితే దీనికి ఒక కండీషన్ పెట్టింది. తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని సూచించింది. బీజేపీకి ఓటు వేస్తే.. ఆ ఓటు తిరుపతి బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే.. టీటీడీని ప్రభుత్వ పరిధి నుంచి తప్పించి. ధర్మాచార్యుల పర్యవేక్షణలోకి తీసుకువస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. అయితే ఎంపీస్థానంలో ఉండే వ్యక్తి లేదా… ఒక్క ఎంపీ సీటు గెలవడం ద్వారా బీజేపీ టీటీడీని తాను అనుకున్నట్లు […]

Written By: , Updated On : April 12, 2021 / 02:04 PM IST
Follow us on

BJP YSRCP
తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ధర్మచార్యుల పర్యవేక్షణలోకి తీసుకువస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. అయితే దీనికి ఒక కండీషన్ పెట్టింది. తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని సూచించింది. బీజేపీకి ఓటు వేస్తే.. ఆ ఓటు తిరుపతి బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే.. టీటీడీని ప్రభుత్వ పరిధి నుంచి తప్పించి. ధర్మాచార్యుల పర్యవేక్షణలోకి తీసుకువస్తామని బీజేపీ హామీ ఇచ్చింది.

అయితే ఎంపీస్థానంలో ఉండే వ్యక్తి లేదా… ఒక్క ఎంపీ సీటు గెలవడం ద్వారా బీజేపీ టీటీడీని తాను అనుకున్నట్లు ధర్మచార్యులకు అప్పగించగలదా అని ఆలోచన చేస్తే.. కొంతమేరకు రాజకీయ హామీగా అర్థం అవుతోంది. టీటీడీని నిజంగా ప్రభుత్వ పరిధి నుంచి తప్పించడం కేంద్రానికి క్షణాల్లో పని. ఆ దిశగా నిర్ణయం తీసుకునేందుకు బీజేపీ తిరుపతిలో గెలవాల్సిన అవసరం కూడా లేదు. లోక్ సభలో నాలుగువందలకు పైగా ఎంపీల మద్దతు బీజేపీకి ఉంది. ఏమైనా చేయవచ్చు. బీజేపీ గెలిస్తేనే అలా చేస్తామని చెప్పడం కేవలం ఓటు బ్యాంకును పెంచుకునేందుకు ప్రయత్నం చేయడమే.

ఇప్పుడు బీజేపీ అదే చేస్తోంది. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా.. టీటీడీ వ్యవహారాలపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. వైసీపీ హయాంలో ఇవి ఎక్కువ అయ్యాయి. అన్యమతస్తులు టీటీడీలో ఉద్యోగులుగా ఉండడం దగ్గర్నుంచి అన్యమతం ప్రచారం వరకు అన్ని రకాల వివాదాలను వైసీపీ ప్రభుత్వం.. టీటీడీ ఎదుర్కొంటున్నాయి. అవినీతి ఆరోపణలు కూడా తీవ్రంగానే వస్తున్నాయి.

అయితే రాజకీయంగా ఆరోపణలు చేయడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రాధాన్యం ఇస్తోంది. కానీ.. పవిత్రతను కాపాడడానికి కాదనే విమర్శలు వస్తున్నాయి. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామిలాంటివారు.. కోర్టుల్లో ఫిటిషన్లు వేసి.. నోటీసులు జారీ చేసి.. హడావుడి చేస్తుంటారు. టీటీడీని ప్రభుత్వ పరిధి నుంచి తప్పించాలని ప్రకటనలు చేస్తుంటారు. అయితే ఇవి.. తనకు నచ్చని ప్రభుత్వాలు ఉన్నప్పుడు చేస్తుంటారు. మిగితా సమయంలో సైలెంగ్ ఉంటారు. బీజేపీ కూడా తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో అదే తీరున వ్యవహరిస్తోంది.