30 శాతం విలువ కోల్పోయిన బిట్ కాయిన్…కారణం ఇదే..?

ప్రపంచంలో అత్యధికంగా రేటు కలిగిన బిట్ కాయిన్ విలువ మెల్లమెల్లగా పడిపోతుంది. ఒక్క సంవత్సరంలో ఎంత వేగంగా పెరిగిందో అందేస్థాయిలో దిగజారింది. ఏప్రిల్ రెండో వారం నుంచి దాదాపు 30 శాతానికి పైగా ట్రేడింగ్ కోల్పోయింది. అయితే ఈ పరిస్థికి కారణంగ చైనానే అంటున్నారు. ఆ దేశం తీసుకున్న కొన్ని నిర్ణయాలు బిట్ కాయిన్ విలువ పడిపోవడానికి కారణం అయ్యాయి. అత్యధిక ధనవంతుడు ఎలెన్ మస్క్ దానిని కొననందుకు ఎంతో పశ్చాత్తాప పడ్డాడు. అయితే చివరికి తన […]

Written By: NARESH, Updated On : May 20, 2021 4:40 pm
Follow us on

ప్రపంచంలో అత్యధికంగా రేటు కలిగిన బిట్ కాయిన్ విలువ మెల్లమెల్లగా పడిపోతుంది. ఒక్క సంవత్సరంలో ఎంత వేగంగా పెరిగిందో అందేస్థాయిలో దిగజారింది. ఏప్రిల్ రెండో వారం నుంచి దాదాపు 30 శాతానికి పైగా ట్రేడింగ్ కోల్పోయింది. అయితే ఈ పరిస్థికి కారణంగ చైనానే అంటున్నారు. ఆ దేశం తీసుకున్న కొన్ని నిర్ణయాలు బిట్ కాయిన్ విలువ పడిపోవడానికి కారణం అయ్యాయి. అత్యధిక ధనవంతుడు ఎలెన్ మస్క్ దానిని కొననందుకు ఎంతో పశ్చాత్తాప పడ్డాడు. అయితే చివరికి తన మాట మార్చడం కూడా బిట్ కాయిన్ పతనాకి ఒకందుకు కారణంగా చెప్పుకుంటున్నారు.

ఈమధ్య ప్రతీ విషయంలో పైచేయి సాధిస్తున్న డ్రాగన్ దేశం చైనా బిట్ కాయిన్ పతనానికి కారణమైందని అంటున్నారు. 2019లో చైనా దేశం క్రిప్టో కరెన్సీని నిషేధించింది. అప్పటి వరకు చైనా ప్రజలకు ఎక్కువగా క్రిప్టో కరెన్సీపైనే ట్రేడింగ్ చేస్తున్నారు. దీంతో ఎక్కడా పరిస్థితి చేజారుతుందోనని ఆందోళన చెంది ఆంక్షలు విధించింది. తాజాగా చైనాకు చెందిన ది నేషనల్ ఇంటర్నెట్ ఫైనాన్స్ అసోసియేషన్ ఆఫ్ చైనా, ది చైనా బ్యాంకింగ్ అసోసియేషన, ద పేమెంట్ అండ్ క్లియరింగ్ అసోసియేషన్ అనే ప్రభుత్వం రంగ సంస్థలు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టి లాసయితే తమకు సంబంధం లేదని ప్రకటించాయి. మిగిలిన దేశాలు కూడా ఇదే బాట పట్టడంతో పాటు వాటిని ప్రభుత్వ బ్యాంకులే నిర్వహించాలని ఆదేశాలు చేశారు.

ఇక బిట్ కాయిన్ వినియోగం కంటే మ్యానిఫ్యాక్చరింగ్ ఎక్కువగా చైనాలోనే జరుగుతుంది. దాదాపు 75 శాతం మైనింగ్ డ్రాగన్ దేశం చేస్తోంది. బిట్ కాయిన్ ఉత్పత్తికి అధికంగా విద్యుత్ అవసరమవుతుంది. చైనాలోని షిన్ జియాంగ్ ప్రాంతంలో గత ఏప్రిల్ లో వీటి మైనింగ్ లో సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో వీటి విలువ 14 శాతం వరకు పడిపోయింది.

ఇదే కాకుండా ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు ఎలెన్ మస్క్ టెస్లా కార్ల కొనుగోలుకు బిట్ కాయిన్ ను అనుమతించమని ప్రకటించాడు. అప్పటి వరకు మార్చిలో టెస్లా కొనుగోలుకు అనుమతి ఉందని ప్రకటించి ఒక్కసారిగా మాట మార్చాడు. ఇది కూడా బిట్ కాయిన్ విలువ పడిపోవడానికి కారణమైంది. ఈ ప్రకటనతో 30 శాతం విలువ కోల్పోయిందని అంటున్నారు. మొత్తంగా ఏప్రిల్ రెండో వారంలో 63 వేల డాలర్లు ఉన్న బిట్ కాయిన్ ఇప్పుడు 40 వేల డాలర్లకు దిగింది.