spot_img
Homeజాతీయ వార్తలుWatermelon Food Poisoning: బిర్యానీ తిన్న తర్వాత.. పుచ్చకాయ లాగించకూడదా.. ప్రాణాలకు అంతటి ముప్పా..

Watermelon Food Poisoning: బిర్యానీ తిన్న తర్వాత.. పుచ్చకాయ లాగించకూడదా.. ప్రాణాలకు అంతటి ముప్పా..

Watermelon Food Poisoning: మనలో చాలామందికి బిర్యానీ అంటే చాలా ఇష్టం. బిర్యానీలో వెరైటీలను లాగించడం అంటే మరింత ఇష్టం. పైగా ఒకప్పటి మాదిరిగా కేవలం చికెన్ బిర్యాని లేదా మటన్ బిర్యానీ మాత్రమే కాదు, రొయ్యల నుంచి మొదలుపెడితే చేపల వరకు, వంకాయ నుంచి మొదలు పెడితే పనసకాయ వరకు రకరకాల బిర్యానీలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. కార్పొరేట్ కంపెనీలు కూడా బిర్యాని తయారీలోకి రంగ ప్రవేశం చేశాయి. బిర్యానీ తయారీ కూడా అతిపెద్ద వ్యాపారంగా మార్చేశాయి.

బిర్యానీ తింటున్న చాలా మందికి కూల్ డ్రింక్ తాగడం అలవాటు. కొంతమంది బిర్యాని తిన్న తర్వాత కూల్ డ్రింక్ తాగుతూ ఉంటారు. కూల్ డ్రింక్ తాగడం వల్ల తిన్న బిర్యాని అరుగుతుందని చాలామంది నమ్ముతుంటారు. అయితే ఇటీవల ముంబై నగరంలో రాత్రిపూట బిర్యాని తిని.. ఆ తర్వాత కొద్దిసేపటికి పుచ్చకాయ తిన్నది ఓ కుటుంబం. అలా తిన్న ఆ కుటుంబంలో నలుగురు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది.. అయితే వారు ఆ పుచ్చకాయను నిల్వ ఉంచారు. దీనివల్ల ఫుడ్ పాయిజన్ అయిందని న్యూట్రిషన్ లు చెప్తున్నారు..”నీటి శాతంతో పాటు చక్కెర కూడా పుచ్చకాయలో అధికంగా ఉంటుంది. పుచ్చకాయ కలుషితమైతే కచ్చితంగా బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. తీపిని పెంచడానికి కొంతమంది పండ్లకు సూదులు కూడా వేస్తుంటారు. అవి గనక ఇన్ఫెక్ట్ అయితే సమస్యలు వస్తాయి. చివరికి ప్రాణాలు కూడా పోతాయని” వైద్యులు అంటున్నారు.

బిర్యానీ తయారీలో అధికంగా నెయ్యి అధికంగా వాడతారు.. రాత్రిపూట బిర్యాని తినడం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు. రాత్రిపూట ఆయిల్ ఫుడ్ తీసుకుంటే అంత ఈజీగా జీర్ణం కాదు. బిర్యానీలో అధికంగా నెయ్యి వాడతారు కాబట్టి.. అది జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. పైగా లేట్ అవర్స్ లో తినడం వల్ల ఆహారం జీర్ణం కావడంలో కూడా ఇబ్బంది ఏర్పడుతుంది.. అందువల్లే ముంబైలో ఒకే కుటుంబంలో నలుగురు చనిపోయారు.. బిర్యాని తిన్న తర్వాత.. వారు పుచ్చకాయను లాగించారు. పుచ్చకాయను చాలా రోజులపాటు నిల్వ ఉంచడం.. దానిలో తీపిదనాన్ని పెంచడానికి ఇంజక్షన్ వేయడంతో.. అందులో బ్యాక్టీరియా వేగంగా అభివృద్ధి చెందింది. దీనివల్ల ఆ నలుగురు చనిపోయారు..

బిర్యానీ అనేది మాంసాహారం వంటకం. పైగా ఆ నలుగురు కూడా చికెన్ బిర్యాని తిన్నారు.. రాత్రి పూట తినడంతో అది జీర్ణం కాలేదు. దీనికి తోడు పుచ్చకాయ కూడా తినడంతో వారి శరీరంలో బ్యాక్టీరియా వేగంగా అభివృద్ధి చెందింది. చివరికి వారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అందువల్లే నాన్ వెజ్ తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని.. వైద్యులు సూచిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular