Homeజాతీయ వార్తలుBird flu: బర్డ్‌ ఫ్లూ బెల్స్‌.. నాలుగు రాష్ట్రాలకు ముప్పు.. కేంద్రం అలర్ట్‌ !

Bird flu: బర్డ్‌ ఫ్లూ బెల్స్‌.. నాలుగు రాష్ట్రాలకు ముప్పు.. కేంద్రం అలర్ట్‌ !

Bird flu: దాదాపు మూడేళ్లు వణికించిన కరోనా నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న సమయంలో మరో ముప్పు దేశానికి మరో ముప్పు పొంచి ఉందన్ని కేంద్రం గుర్తించింది. నాలుగు రాష్ట్రాలకు బర్డ్‌ ఫ్లూ ముప్పు పొంచి ఉందని అంచనా వేస్తోంది. ఆ రాష్ట్రాల్లో పౌల్ట్రీలో కోళ్లు, ఇతర పక్షుల అసాధారణ మరణాలతో కేంద్రం అలర్ట్‌ అయింది. అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. పక్షుల మరణాలపై వెంటనే పశుసంవర్ధక శాఖ అధికారులకు తెలియజేయాలని సూచించింది.

ఏవా నాలుగు రాష్ట్రాలు..
బర్డ్‌ ఫ్లూ ముప్పు ఉందని కేంద్రం గుర్తించిన నాలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, కేరళ. ఈ రాష్ట్రాల్లో పక్షులు అనూహ్యంగా మరణిస్తున్నట్లు ధ్రువీకరించింది. ఇందుకు బర్డ్‌ ఫ్లూ కారణం అయి ఉండొచ్చని భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, మహారాష్ట్రలోని నాగ్‌పూర్, కేరళలోని అలప్పుజ, కొట్టయాం, జార్ఖండ్‌లోని రాంచీలో బర్డ్‌ ఫ్లూ వ్యాపిస్తున్నట్లు గుర్తించింది. పక్షుల నుంచి ఈ వైరస్‌ మనుషులకు సోకే ప్రమాదం ఉందని పేర్కొంది. నిరోధిండానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని మే 25న ఎన్‌సీడీసీ, కేంద్ర పశుసంవర్ధక శాఖలు సంయుక్తంగా ప్రకటన జారీ చేశాయి.

మందులు అందుబాటులో..
ఇక వైరస్‌నియంత్రణకు యాంటీ వైరల్‌ ఔషధాలు, పీపీఈ కిట్లు, మాస్కులను అందుబాటులో ఉంచుకోవాలని కేంద్రం సూచించింది. ఇప్పటికే బర్డ్‌ ఫ్లూ వ్యాప్తి క్రియాశీలంగా ఉన్న రాష్ట్రాలు మరిన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇన్‌ఫెక్షన్‌ సోనిక పక్షులను వధించే వారితోపాటు పక్షుల పర్యవేక్షకుల నుంచి కూడా క్రమంగా నమూనాలు తీసుకొని హెచ్‌5ఎన్‌1 పరీక్షలు నిర్వహించాలని సూచించింది.

మానవులకూ ముప్పు..
ఈ బర్డ్‌ ఫ్లూను ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజాగా పిలుస్తారు. ఇది పక్షులు, కోళ్లకు సోకుతుంది. ఇన్‌ఫ్లూయెంజా టైప్‌-ఏలో డజనుకుపైగా వైరస్లు ఉన్నాయి. హెచ్‌5ఎన్‌8, హెచ్‌5 ఎన్‌1 రకాలకు చెందిన బర్డ్‌ఫ్లూ మాత్రం పౌల్ట్రీ ఉత్పత్తులైన కోళ్లు, బాతులతోపాటు టర్కీలపై తీవ్ర ప్రబావం చూపుతాయి. పక్షుల్లో ప్రాణాంతకమైన ఈ హెచ్‌5ఎన్‌1 రకాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) 1997లో తొలిసారి గుర్తించింది.

2006లో భారత్‌లో..
ఇక ఈ వైరస్‌ భారత్‌లో 2006లో బయటపడింది. మన దేశంలో ఉండే వాతావరణం దృష్ట్యా ఏటా వచ్చే విదేశీ వలస పక్షుల ద్వారా బర్డ్‌ ఫ్లూ వ్యాపిస్తుందని గుర్తించింది. కొన్ని నిర్వహణ పద్ధతులతో ఇతర పక్షులతోపాటు మానవులకు వైరస్‌ వ్యాపిస్తుందని నిర్ధారించింది..

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular