BRS Leaders Bike Rally: రోడ్లపై నిత్యం జరుగుతున్న ప్రమాదాలతో తెలంగాణలో ట్రాఫిక్ రూల్స్ కఠినంగా చేశారు. అంతకుముందు వరకు ఉన్న జరినామాలు గత నవంబర్ లో రెట్టింపు చేశారు. వాహనదారులకు జరినామా పెంచితే ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారని అనుకున్న అధికారులు లక్ష్యాన్ని చేరుకోవడం లేదు. ఎంత జరిమానా విధిస్తున్నా.. ఎన్ని కఠినతర నిబంధనలు పెట్టినా కొందరు వాటిని పాటించడం లేదు. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీకి చెందిన నాయకులే పాటించకపోవడం గమనార్హం. అధికార పార్టీకి చెందిన నాయకులు ఇతరులకు ఆదర్శంగా నిలవాల్సి ఉండగా… నిబంధనలను తుంగలో తొక్కేస్తున్నారు.
నెలరోజులుగా తెలంగాణలో అభివృద్ధి పనులకు సంబంధించిన కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నారు. తెలంగాణ ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలో జోష్ పెరిగింది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ అందులో పాల్గొంటున్నారు. ఉత్సవాల్లో చివరి రోజైన గురువారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన అమరుల స్థూపాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నగరానికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా కొందరు ర్యాలీలు తీశారు.
ఇందులో భాగంగా తార్నాక నుంచి అమరవీరుల స్థూపం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అయితే అధికారికంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు ఏమాత్రం ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ ర్యాలీలు జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి తో పాటు పలువురు కార్పొరేటర్లు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో పాల్గొన్న వారిలో ఒక్కిరికీ హెల్మెట్ లేకపోవడంపై సర్వత్రా చర్చ సాగుతోంది.
సామాన్యుడికి హెల్మెట్ లేకపోతే క్షణాల్లో ఫైన్ వేసే అధికారులకు ప్రజాప్రతినిధులై ఉండి ఏమాత్రం నిబంధనలు పాటించకపోయినా ట్రాఫిక్ పోలీసులు చూస్తూ ఉన్నారే తప్ప చర్యలు తీసుకోలేదని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను మీరు కూడా చూడండి..