NDA Alliance: బీహార్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయాన్ని సాధించడం ద్వారా ఎన్డీఏ కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.. అంతేకాదు ఆర్జెడి కూటమికి తిరుగులేని ఓటమిని పరిచయం చేసింది. అయితే ఈ గెలుపు ఎన్డీఏ కూటమికి మరో అదనపు బలాన్ని కూడా అందించింది.. తద్వారా తిరుగులేని స్థాయిలో ఎన్డీఏ కూటమి ఆవిర్భవించింది.
బీహార్ ఎన్నికల్లో సాధించిన విజయం ద్వారా ఇండియా కూటమికి రాజ్యసభలో బలం అమాంతం పెరిగింది. బీహార్ రాష్ట్రంలో రాష్ట్రంలో ఐదు రాజ్యసభ స్థానాలకు వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సి ఉంది. మిగతా ఐదు స్థానాలకు 2028లో ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిని ఎన్డీఏ దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. ఇందులో ప్రతిపక్ష ఆర్జేడి తన మూడు స్థానాలను. ఒక సీటును నిలబెట్టుకోవాలంటే కనీసం 42 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. అయితే ఆర్జెడి కేవలం 25 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. రాజ్యసభలో మొత్తం 245 మంది సభ్యులు ఉంటారు. ఇప్పటివరకు ఎన్ డి ఏ కు 133 మంది ఎంపీలు ఉన్నారు.
పార్లమెంటులో రూపొందిన బిల్లులను రాజ్యసభకు పంపిస్తారు. అక్కడ ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి వద్దకు పంపిస్తారు. రాష్ట్రపతి సంతకం పెట్టిన తర్వాత ఆ బిల్లు చట్టం అవుతుంది.. ఇప్పటివరకు బిజెపి ప్రభుత్వం తెరపైకి తీసుకువచ్చిన చట్టాలు మొత్తం ఈ విధంగానే రూపుదిద్దుకున్నాయి. 2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత బిజెపికి అంతగా రాజ్యసభలో బలం లేదు. కానీ తదుపరి ఎన్నికల్లో వరుసగా విజయాలు సాధిస్తూ.. రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూ బిజెపి రాజ్యసభలో తన బలాన్ని పెంచుకుంది. తద్వారా కీలక బిల్లుల విషయంలో బిజెపికి ఎదురులేకుండా పోతుంది.
ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, కర్ణాటకలో అధికారంలో ఉంది. తమిళనాడులో భాగస్వామ్య పార్టీలతో అధికారాన్ని దక్కించుకుంది. జమ్ము కాశ్మీర్లో కూడా భాగస్వామ్య పార్టీలతో అధికారంలో ఉంది.. వాస్తవానికి మిగతా రాష్ట్రాలలో గతంలో కాంగ్రెస్ బలంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ బలాన్ని మొత్తం కోల్పోతోంది. అందువల్లే ప్రాంతీయ పార్టీలతో పొత్తుల పెట్టుకోవాల్సిన పరిస్థితి ఆ పార్టీకి ఏర్పడుతోంది.